E-Paper
Advertisement

మీ చర్మ సౌందర్యాన్ని హాని చేసే శత్రువులు ఇవే.. మెరిసే చర్మం కోసం ఇవి అసలు తీసుకోకూడదు

మీ చర్మ సౌందర్యాన్ని హాని చేసే శత్రువులు ఇవే.. మెరిసే చర్మం కోసం ఇవి అసలు తీసుకోకూడదు
Advertisement

ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే పౌష్టికాహారం, సరైన నిద్రపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది మెరిసే చర్మం కోసం స్కిన్ క్రీమ్స్ వాడితే సరిపోతుందని భావిస్తారు. కానీ మీ చర్మ ఆరోగ్యం దెబ్బతినడానికి అతిపెద్ద కారణం షుగర్ డ్రింక్స్. మీరు తినే ఆహారంలో అధిక చక్కెర.. చర్మ సమస్యలను పెంచుతుంది. సమతుల్య ఆహార అలవాట్లు చర్మాన్ని క్లియర్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

షుగర్ డ్రింక్స్ చర్మ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

షుగర్ డ్రింక్స్ శరీరంలో వాపును పెంచుతాయి. అధిక చక్కెర చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కొలాజెన్ చర్మాన్ని గట్టిగా, మృదువుగా ఉంచుతుంది. ఇది తగ్గడం వల్ల చర్మంలో కాంతి తగ్గిపోతుంది.

సాఫ్ట్ డ్రింక్స్ చర్మానికి హాని

Advertisement

సాఫ్ట్ డ్రింక్స్‌లో ఎక్కువ చక్కెర, కృత్రిమ పదార్థాలు ఉంటాయి. వీటిని తరచుగా తాగడం వల్ల మొటిమలు, ఆయిలీ స్కిన్ సమస్యలు పెరుగుతాయి. చర్మం పొడిబారి మెరుగు తగ్గుతుంది.

ప్యాకెట్ ఫ్రూట్ జ్యూసులతో ప్రమాదం

ప్యాకెట్ జ్యూసులు ఆరోగ్యకరంగా అనిపించినా ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇవి చర్మ క్వాలిటీని తగ్గిస్తాయి. ఇంట్లో తాజా జ్యూస్ మంచి ఎంపిక.

స్వీటెన్డ్ కాఫీ డ్రింక్స్ చర్మాన్ని ప్రభావితం చేస్తాయి

Advertisement

ఫ్లేవర్డ్ కాఫీల్లో చక్కెర, క్రీమ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మం.. నిస్తేజంగా, పొడిగా మారడానికి కారణం అవుతాయి. అధిక కెఫీన్ నిద్రను పాడు చేసి చర్మాన్ని అలసటగా చేస్తుంది.

ఎనర్జీ డ్రింక్స్ చర్మ సమస్యలు పెంచుతాయి

శరీరంలో తక్షణ శక్తి నింపుతాయని మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర, కెఫీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్, స్ట్రెస్‌ను పెంచి చర్మం మెరుగును తగ్గిస్తాయి.

బబుల్ టీ, మిల్క్‌షేక్స్ అధిక చక్కెరతో నిండి ఉంటాయి

ఇవి చర్మంలో వాపు, ఆయిల్ పెరుగుదలను కలిగిస్తాయి. ఇంట్లో తయారు చేసుకునే స్మూతీలు వీటికి మంచి ప్రత్యామ్నాయం.

చక్కెర కొలాజెన్‌ను దెబ్బతీస్తుంది

అధిక చక్కెర కొలాజెన్‌ను దెబ్బతీసి ముడతలు, చర్మం వేలాడటం పెంచుతుంది. సమతుల్య ఆహారం చర్మాన్ని రక్షిస్తుంది.

డీహైడ్రేషన్ చర్మ మెరుగును తగ్గిస్తుంది

స్వీట్ డ్రింక్స్.. శరీరాన్ని సరిగా హైడ్రేట్ చేయవు. తగినంత నీళ్లు తాగడం చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

Also Read: ఇతరుల కంటే కొందరు ఎల్లప్పుడూ ముందుంటారు.. విజయం కోసం మనిషిలో ఈ లక్షణాలు తప్పనిసరి

చర్మం మెరుగు కోసం ఆరోగ్యకర డ్రింక్స్ ఇవే

తాజా కొబ్బరి నీళ్లు, లెమన్ జ్యూస్, హెర్బల్ టీలు చర్మానికి మంచివి. ఫ్రూట్ స్మూతీలు తాగితే శరీరానికి విటమిన్లు లభిస్తాయి.

స్వీట్ డ్రింక్స్ చర్మ మెరుగును తగ్గించి, వాపు, డీహైడ్రేషన్‌ పెంచుతాయి. తాజా, సహజ పానీయాలు, సమతుల్య ఆహారం, తగినంత నీళ్లు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. చిన్న మార్పులు చర్మానికి మంచి ఫలితాలు ఇస్తాయి.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×