E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై బాలు కౌంటర్.. బాలుకు రోహిణిపై అనుమానం.. శృతి, రవి కాపురంలో చిచ్చు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై బాలు కౌంటర్.. బాలుకు రోహిణిపై అనుమానం.. శృతి, రవి కాపురంలో చిచ్చు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode may 27th : మీనా వంటలు చాలా బాగున్నాయని ఇంటికి వచ్చినా మలేషియా అతిథులు పొగిడేస్తారు. అక్కడ ఇండియన్ ఫుడ్ కి చాలా కాస్ట్.. మీనా ను అడిగి వంట ఎలా చేయాలో నేను నేర్చుకుంటానని ఆవిడ అంటుంది. ఇక బాలు వచ్చిన దంపతులకు బట్టలు తీసుకుని వస్తాడు ప్రభావతి సత్యం ఆ బట్టలను వాళ్ళకి పెడతారు. అయితే మా కోడలు వస్తుంది కాసేపు ఆగండి అని ప్రభావతి ఆపుతుంది. ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి మీనా లాంటి కోడలు ఉండడం మీ అదృష్టం మీ ఇంటికి గౌరవాన్ని మీనాని పెంచుతుంది అని ఆమె మీనా పై ప్రశంసలు కురిపిస్తుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మనోజ్ బిజినెస్ మాన్ అని చెప్పుకోవడంతో అందరూ నవ్వుకుంటారు..

ప్రభావతి పై బాలు కౌంటర్స్..

దంపతులు మీనా వంటని మెచ్చుకుంటారు.. మీరు అలాంటి కోడలు ఈ రోజుల్లో ఉండడం చాలా అదృష్టం అని వాళ్ళు పొగడ్తల వర్షం కురిపిస్తారు.. ఏ రోజుకైనా మీ కుటుంబ గౌరవాన్ని పెంచేది మీనా ఒక్కటే అని అనడంతో బాలు ప్రభావతి పై సెటైర్లు వేస్తాడు.. నిజంగానే చెప్తున్నాము. మేం అలాంటి అమ్మాయి దొరకడం మీ అదృష్టం అని ప్రభావతిపై ఆ మలేషియా దంపతులు పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఉండాలంటే ఎవరికైనా రాసిపెట్టి ఉండాలి.. మేము ఇకనుంచి వెళ్లిపోయిన సరే మీనా వంటలు మాత్రం అసలు మర్చిపోమని వాళ్ళు మెయిన్ అబ్బాయి ఎనలేని అభిమానాన్ని చూపిస్తారు.. ఇక దంపతులు చాలా సంతోషంగా బాలు ఇంటి నుంచి వెళ్లిపోతారు.. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మెమోరీస్ ని మీరు ఇచ్చారు మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోము అని అంటారు..

పన్ను పోగొట్టుకున్న రోహిణి..

Advertisement

వాళ్ళ అలా వెళ్ళగానే రోహిణి శృతి హాస్పిటల్ నుంచి ఇలా ఇంటికి వచ్చేస్తారు.. ఏమైంది ఎందుకలా చెయ్యి పెట్టుకున్నావు ఏం చెప్పారు డాక్టర్లు అని ప్రభావతి అడుగుతుంది. ఏమీ లేదు అత్తయ్య పండు పుచ్చిపోయింది అని పీకేసారు అని రోహిణి చెబుతుంది.. ఇన్స్టంట్ కాఫీ లాగా ఇంత సడన్గా పంటు వాపు ఎలా వచ్చింది అని రవి అనుమానం వ్యక్తం చేస్తాడు.. ఎక్కడైనా కానీ రెండు రోజులు తర్వాత నొప్పి ఎక్కువైతే గాని పండ్లు తీయరు ఇంత సడన్గా పండుని తీసేయాల్సిన అవసరం ఏంటి అని రవి అలాగే బాలు కూడా అనుమానంగా ఉంది అని అనుకుంటారు.. రోహిణి మాత్రం శృతి వల్ల నా పన్ను పీకేస్తారు అని చెప్పి నేను రెస్ట్ తీసుకుంటానని లోపలికి వెళ్ళిపోతుంది..

బాలు, మీనాకు రోహిణి పై అనుమానం..

దవడ పండు రాలినట్టు ఇంత సడన్గా పన్ను నొప్పి రావడం ఏంటి..? అంతే సడన్గా దాని పీకేయడమేంటి అని బాలు మీనా పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు.. ఎక్కడైనా ఒక ఊరి వాళ్ళు వచ్చారు అంటే చాలా సంతోషంగా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.. అలాంటిది రోహిణి మాత్రం మలేషియా పేరు వినగానే పంటి నొప్పి వచ్చేసింది అని బాలు మీనాలకి అనుమానం మొదలవుతుంది.. నిజంగానే ఈ పార్లరమ్మ మలేషియా నుంచి వచ్చిందా లేదా నాటకమాడుతుందా అన్నది నేను కనిపెడతాను అని బాలు అంటాడు. శృతి వచ్చి దాని గురించి మాట్లాడుకుంటున్నారా..? నొప్పి లేదు ఏమీ లేదు నేనే పండు పీకేయమని చెప్పాను అని శృతి అనగానే బాలు మంచి పని చేశావు అని అంటాడు..

రవి పై శృతి సీరియస్..

Advertisement

రవి కోసం శృతి చాలాసార్లు ఫోన్ చేస్తుంది.. నీతు రెస్టారెంట్ ని డెవలప్ చేసుకునేందుకు ఇంకా ఏదైనా ప్లాన్లు చేయాలి అని మీటింగ్ పెట్టి ఉంటుంది. మన రెస్టారెంట్ బ్రాండ్ ని పెంచుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేయాలి. ఒక్కొక్కరూ మీకు నచ్చిన ఐడియాలు ఇవ్వండి. అది చిన్నదా పెద్దదా కాదు మన రెస్టారెంట్ ని పెంచుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడుతుందో అది చూసుకోవాలి అని అందరితో కలిసి చెబుతుంది.. అందరూ చాలా సీరియస్ గా మీటింగ్లో ఉండగా రవికి శృతి చాలాసార్లు ఫోన్ చేస్తుంది.. కానీ శృతి ఫోన్ ని లిఫ్ట్ చేసే అవకాశం లేకపోవడంతో రవి సైలెంట్ లో పెట్టేస్తాడు.. శృతి నా ఫోనే లిఫ్ట్ చేయవా నన్ను దూరం పెట్టేస్తున్నావా? నాకు ఎంత బాధగా ఉందో అని కోపంగా ఉంటుంది..

కొడుకులు, కోడళ్ల మధ్య గొడవలు..

తాగద్దని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం మీ నా మాట వినకుండా తాగేసి ఇంటికి వస్తాడు.. దానికి మీనా చాలా సీరియస్ అవుతుంది.. ఇదంతా చెప్తున్న సరే వినకుండా నువ్వు తాగేసి వస్తావా అని బాధపడుతుంది. అటు రోహిణి పై మనోజ్ కి అనుమానం రావడంతో అడుగుతాడు దాంతో వీళ్ళిద్దరూ కాస్త గొడవ పడతారు.. ఇక రవి శృతి లు కూడా గొడవ పడతారు. రాత్రి అందరూ భోజనం చేయడానికి కూర్చుంటే ముగ్గురు మగాళ్లు మాత్రమే అక్కడ కూర్చుని ఉంటారు. రోహిణి మీనా శృతి ముగ్గురు వీళ్ళ తిన్న తర్వాత మేము వచ్చి తింటాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. అసలేం జరిగింది ఎందుకు మీరు అందరు ఇలా ఉన్నారు అని ప్రభావతి ఎంత అడుగుతున్నా సరే ఎవ్వరు కూడా మాట విప్పకుండా అక్కడ నుంచి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ వెయిటింగ్.. డ్రగ్స్ కేసులో ధీరజ్ ఇరుక్కుంటాడా? శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×