E-Paper
Advertisement

Tamarind seed paste: చింత గింజల పేస్టు.. దంత సమస్యలకు సహజ పరిష్కారమా?

Tamarind seed paste: చింత గింజల పేస్టు.. దంత సమస్యలకు సహజ పరిష్కారమా?
Advertisement

Tamarind seed paste: మన దంతాలు ఆరోగ్యంగా ఉండటం మన శరీర ఆరోగ్యానికి పునాది. ఎందుకంటే ఏ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ముందుగా అది నమలాల్సిందే. పళ్ళు బలంగా లేకపోతే మనం తినే ఆహారం సరిగ్గా నమలడం సాధ్యం కాదు, అలా జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. కానీ నేటి జీవనశైలి, అవగాహన లేకుండా, చిన్న చిన్న అలవాట్లు కూడా పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఉదయం నిద్రలేచి నోరు కడగకుండానే టీ తాగడం, నిద్రకి ముందు పళ్ళు తోమక పోవడం, రోజూ మిఠాయిలు తినడం, చక్కెర పానీయాలు, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ మన పళ్ళపై గట్టిగా ప్రభావం చూపుతున్నాయి.

ఇదే కారణంగా చిన్న వయసులోనే పళ్ళు కుళ్లిపోవడం, దంత నొప్పి, వాపు, రక్తస్రావం, నోటి దుర్వాసన లాంటి సమస్యలు సాధారణమైపోయాయి. చాలామంది ఈ సమస్యల కోసం వెంటనే మందులు తీసుకుంటారు, కానీ అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. నిజమైన పరిష్కారం ప్రకృతిలో ఉంది. ఆ ప్రకృతి ఇచ్చిన అద్భుత ఔషధం చింత గింజ, దానితో తయారుచేసే చింత గింజల పేస్టు దంతాలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Advertisement

Also Read: Motorola 5G Phone: కేవలం రూ.13వేలకే మోటో జి85 5జి ఫోన్.. ప్రీమియం ఫీచర్లతో మార్కెట్‌లో హవా

చింత పండు మనకు తెలిసినదే కానీ దాని గింజల్లో దాగి ఉన్న ఔషధ గుణాలు చాలా మందికి తెలియవు. చింత గింజల్లో యాంటీబాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పళ్ళలో బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటాయి. దాంతో పళ్ళు బలంగా మారుతాయి, దంతాల చుట్టూ ఉండే వాపులు తగ్గుతాయి, రక్తస్రావం ఆగుతుంది. చింత గింజలను తీసుకుని ఎండలో బాగా ఆరబెట్టి, వాటిని మెత్తగా పొడి చేయాలి.

Advertisement

ఆ పొడిని కొద్దిగా నీటిలో కలిపి పేస్టు చేయాలి. ఈ పేస్టును నిద్రకు ముందు దంతాలపై మృదువుగా రుద్దాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో నెమ్మదిగా కడగాలి. దీన్ని ప్రతిరోజూ వాడితే పళ్ళకు శుభ్రత, మెరుపు పెరుగుతుంది. చింత గింజల పేస్టు వాడడం వలన దంత ఇన్ఫెక్షన్, బలంగా కొరికే అలవాటు తగ్గిపోతాయి. దంతాలపై ఉన్న స్కిన్ బలంగా మారుతుంది. ముఖ్యంగా దుర్వాసన సమస్యను ఇది చాలా వరకు తగ్గిస్తుంది. మార్కెట్లో దొరికే కెమికల్ పేస్టుల వలె రసాయనాలు లేకపోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.

ఇది పూర్తిగా సహజమైన దంత సంరక్షణ పద్ధతి. చింత గింజలలో ఉండే సహజ గుణాలు పళ్ళ ఎనామెల్‌ను అంటే పళ్లపై బయట ఉన్న కఠినమైన రక్షణ పొర. దీనినే పళ్ళ ఎనామెల్ కాపాడి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. ప్రతి రోజు ఈ పేస్టును వాడితే పళ్ళు తెల్లగా, మెరిసేలా మారుతాయి. ప్రకృతి ఇచ్చిన ఈ సులభమైన చిట్కా ద్వారా మనం ఖరీదైన దంత చికిత్సలు లేకుండానే పళ్ళను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చింత గింజల పేస్టు మన ఇంట్లోనే ఉండే సహజ దంత వైద్యం. వీటిని రోజూ ఉపయోగించి మీ పళ్లను సురక్షితంగా చేసుకోండి. పళ్ళ సంబంధిత ప్రతి సమస్యకు సులభమైన, నమ్మదగిన పరిష్కారం చింత గింజల పేస్టు సహజ వైద్యం.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×