E-Paper
Advertisement

Balakrishna Nandamuri: అమ్మ కడుపులోనే జై బాలయ్య అని విన్నాను

Balakrishna Nandamuri: అమ్మ కడుపులోనే జై బాలయ్య అని విన్నాను
Advertisement

Balakrishna Nandamuri: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. మొదటిసారి బాలకృష్ణ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ముంబైలో విడుదల చేశారు. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ పలు హిందీ చానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాను భారతదేశపు ఆత్మ అని బోయపాటి శ్రీను ముంబై వేడుకలో చెప్పారు. అయితే ఇలా చెప్పటం అలానే ఈ సాంగ్ లో ఒక మాస్ నెంబర్ సాంగ్ నెక్స్ట్ వేడుకలో విడుదల చేయడం. ఇవన్నీ కూడా భారతదేశపు ఆత్మలో ఇలాంటి పాటలు ఏంటి అనే కామెంట్స్ కూడా తీసుకొచ్చాయి. ఇకపోతే బాలకృష్ణ కొన్ని సందర్భాలలో మాట్లాడిన మాటలు ఎంతగా వైరల్ అవుతుంటాయి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా ఒక హిందీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జై బాలయ్య అనే పదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలయ్య.

అమ్మ కడుపులో ఉన్నప్పుడే విన్నాను 

Advertisement

రీసెంట్ గా హిందీ ఇంటర్వ్యూలో బాలకృష్ణకు ఒక ప్రశ్న ఎదురైంది. మొదటిసారి జై బాలయ్య అనే పదాన్ని ఎప్పుడు విన్నారు అని ఇంటర్వ్యూ లో అడిగారు. దీనికి సమాధానం గా బాలకృష్ణ.. అమ్మ కడుపులో ఉన్నప్పుడే విన్నాను. అభిమన్యుడు కురుక్షేత్రానికి ఎలా వెళ్లాలో అమ్మ కడుపులో ఉండగానే విన్నట్టుగా, నేను కూడా అప్పుడే విన్నాను. అంటూ చెప్పారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది దీనికి ఎలివేషన్ ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఎప్పుడూ ట్రోల్ చేసిన విధంగానే ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అఖండ టు సినిమా మీద విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ కు సంబంధించిన టికెట్లు కూడా సేల్ అయిపోయాయి.

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ 

Advertisement

కొన్ని కాంబినేషన్స్ లో సినిమాను అనౌన్స్ చేస్తే చాలు విపరీతమైన అంచనాలు పెరిగిపోతుంటాయి. ఇప్పటివరకు వీరిద్దరి కెరియర్లో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి అందుకే అఖండ 2 సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తమన్ బాలకృష్ణ సినిమాలకు ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తారు అందరికీ తెలిసిన విషయమే. అందుకే బాలకృష్ణతో పాటుగా మొన్న జరిగిన వేడుకలు భారీ కటౌట్ తమన్ కు ఏర్పాటు చేశారు. కేవలం అద్భుతమైన పాటలు మాత్రమే కాకుండా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాలకృష్ణ సినిమాలకు అందిస్తుంటాడు తమన్.

Also Read : Spb: రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం,శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×