E-Paper
Advertisement

Rashmika Mandanna: మనుషుల్లా ప్రవర్తించండి.. ఏఐ మార్ఫింగ్ ఫోటోలపై రష్మిక సీరియస్‌

Rashmika Mandanna: మనుషుల్లా ప్రవర్తించండి.. ఏఐ మార్ఫింగ్ ఫోటోలపై రష్మిక సీరియస్‌
Advertisement

Rashmika Reacts Misuse Of AI: ఏఐ.. ప్రస్తుతం హాట్టాపిక్గా ఉన్న అంశం. టేక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభమైంది. ఎంత కష్టమైన పనైకైనా.. ఈజీగా సోల్యూషన్దొరుకుంది. స్టూడెంట్స్నుంచి పెద్ద పెద్ద ఐటీ ఉద్యోగుల వరకు ఏఐ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మన దేశం పూర్తిగా డిజిటల్ఇండియాగా మారిపోయింది. ఇది సంతోషించే విషయమే. అదే సమయంలో టెక్నాలజీ వల్ల సవాళ్లు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సినీస్టార్స్కి.

సీని తారలకు చేదు అనుభవం

Advertisement

ఏఐ(ఆర్టిఫిషియల్ఇంటలిజెన్స్‌) వల్ల డిజిటల్రంగం ఎంతగా అభివృద్ధి చెందుతుందో.. మరోవైపు సినీతారలకు అంత చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఏఐ ద్వారా నటీనటులను తమ ఇష్టమైన పాత్రల్లో తీర్చిదిద్దుతున్నారు. తారల ఫోటోలను తమకు ఇష్టమొచ్చినట్టు ఎడిట్చేస్తూ సోషల్మీడియాలో పోస్ట్స్చేస్తున్నారు. ఇందులో కొన్ని అబ్బా అనిపించేలా.. మరికొన్నిఅబ్బో అనిపించేలా ఉన్నాయి. ఇంకోందరైతే మితిమిరీ మరి ఫోటోలను ఎడిట్చేస్తున్నారు. వీటిలో మంచికంటే అసభ్యకరమైన కంటెంటే ఎక్కువగా ఉంటోంది.  వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఇందులో మొట్టమొదటి బాధితులు ఎవరంటే టక్కున చెప్పే పేరు రష్మిక మందన్నా.

టెక్నాలజీ అసభ్యతను పెంచడానికి కాదు

అమ్మాయి లిఫ్ట్లో వెళుతున్న వీడియోకి రష్మిక ఫోటోని మార్ఫింగ్చేసి వైరల్చేశారు. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున దుమారం రేపింది. వీడియో సోషల్మీడియా, మీడియాలో హాట్టాపిక్గా మారింది. దీనిపై రష్మిక సైబర్క్రైంని కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రష్మిక తర్వాత మెగాస్టార్చిరంజీవి వంటి స్టార్హీరోలు కూడా దీని బాధితులే. అయితే ఏఐ దుర్వినియోగంపై రష్మిక మందన్నా స్పందించింది. మేరకు ఎక్స్లో పోస్ట్చేసింది. “టెక్నాలజీ అనేది మన అభివృద్ధి కోసం సృష్టించింది.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. “మనం సత్యాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుంది. కానీ కొందరు ఏఐని పురోగతికి కంటే అసభ్యతను సృష్టించడానికే ఎక్కువ వినియోగిస్తున్నారుఅని మండిపడింది.

Advertisement

వారిని కఠినంగా శిక్షించాలి

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని దాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అలాంటి వ్యక్తులకు నైతికత లేదనేది స్పష్టమవుతుంది. వారంత ఒకటి గుర్తు పెట్టుకోవాలి. నిజానికి ఇంటర్నెట్ అనేది అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్‌. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం. ఒకవేళ ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్సోషల్మీడియాలో చర్చనీయాంశమైంది. ఏఐ దుర్వినియోగం పట్ల రష్మిక స్పందించిన తీరు ప్రశంసనీయమని పలువురు నెటిజన్స్నుంచి రష్మికకు మద్దతు వస్తోంది.

Also Read: Mahavatar Narsimha Movie: పాక్‌ గడ్డపై మహావతార్‌ నరసింహా ప్రదర్శన.. భక్తి పారవశ్యంలో పాకిస్తానీలు‌

Related News

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

Big Stories

Advertisement
×