E-Paper
Advertisement

Telugu Moral Story: వ‌రాలు ఇచ్చే చెరువు కథ..అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది

Telugu Moral Story: వ‌రాలు ఇచ్చే చెరువు కథ..అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది
Advertisement

Telugu Moral Story:  నీతి కథలు… పిల్లలకు అదే సమయంలో పెద్దలకు మంచి ప్రవర్తనను, జీవన విలువలను నేర్పిస్తాయి. ఈ కథలు ( Telugu Moral Stories) మానవ జీవితాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. మనిషి జీవితంలో వీటి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. ఇంటర్నెట్ యుగం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో… ఈ నీతి కథల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కానీ వీటి ప్రభావం మాత్రం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

వరాలు ఇచ్చే చెరువు కథ

Advertisement

అనగనగా ఓ అందమైన దట్టమైన అడవి ఉండేది. అందులో వేలాది రకాల పక్షులు, జంతువులు జీవించేవి. ఆ జీవరాశుల మధ్య ఎలాంటి గొడవలు ఉండేవి కాదు. అయితే.. వీటిలో ఓ కోతి, జింక చాలా హుషారుగా ఉండేవి. మంచి మాటకారి జంతువులే ఈ రెండు. కాస్త కన్నింగ్ కూడా. అయితే ఈ ఇద్దరికీ అడవిలో ఉన్న ఓ సరస్సు, వరం ఇస్తుంది. మీరు ఏది కోరుకుంటే అది అందిస్తానని చెబుతుంది. దీంతో అందమైన పండ్లతోట ఇవ్వమని కోతి కోరుకుంటుంది. అటు ప్రశాంతంగా ఉండే వాతావరణం కావాలని జింక తన మనసులో మాట చెబుతుంది. వాళ్ళిద్దరూ కోరుకున్నట్లుగానే సరస్సు తనలోకి వాళ్లను తీసుకువెళ్లి.. ఇద్దరి కోరికలు తీర్చుతుంది. ఆ తర్వాత మళ్లీ అడవిలో వదిలేస్తుంది. అయితే ఈ విషయం ఓ పక్షి ద్వారా లీక్ అవుతుంది. దీంతో అడవిలో ఉన్న జంతువులన్నీ సరస్సు దగ్గరికి వచ్చి తమ తమ కోరికలు తీర్చుకుంటాయి. దానికి తగ్గట్టుగానే సరస్సు కూడా ఎవ్వరు అడిగినా కాదనకుండా, కోర్కెలను తీర్చుతుంది. ఒక్క జంతువుకు ఒక్కసారి మాత్రమే, అవకాశం కల్పిస్తూ వాళ్ళ ఆనందాలకు బాటలు వేస్తుంది ఆ సరస్సు.

అయితే ఇందులో ఒకే ఒక కొంగ మాత్రం… సరస్సు ద్వారా తన కోరికను తీర్చుకోదు. అత్యాశకు వెళ్లకుండా, తనకు ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ కోరిక తీర్చుకుంటానని మిగిలిన జంతువులతో కొంగ చెబుతుంది. దీంతో కొంగను ఇన్సల్ట్ చేసి మిగిలిన జంతువులన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు.. అడవిలోకి వేటగాడు వస్తాడు. జంతువులకు చంపేందుకు.. కోడిగుడ్ల ఆకారంలో ఉన్న మత్తు పదార్థాలను అడవిలో చల్లుతాడు. దీంతో జంతువులు, పక్షులు ఒక్కొక్కటిగా మతిస్థిమితం కోల్పోయి కింద పడిపోతాయి. ఈ లోగా మరికొన్ని జంతువులు కొంగ దగ్గరికి వచ్చి.. నువ్వే కాపాడాలని వేడుకుంటాయి. దీంతో సరస్సు దగ్గరికి వెళ్లి… ఆ వేటగాడి నుంచి అడవిలో ఉన్న జంతువులకు ఎలాంటి హాని జరగకుండా వరం ఇవ్వు అంటూ కొంగ కోరుకుంటుంది. ఈ క్రమంలో సరస్సు వెంటనే.. ఓ ఆయుధాన్ని కొంగకు ఇస్తుంది. ఇక ఆయుధంతో వేటగాడిని అడవి నుంచి తరిమి కొడుతుంది కొంగ. దీంతో జంతువులన్నీ బతికి బయటపడతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కొంగ.. అందరినీ ప్రాణాలు కాపాడిందని జంతువులన్నీ మెచ్చుకుంటాయి.

కథ ద్వారా నీతి ఏంటంటే ?

Advertisement

ప్రతి ఒక్కరికి ముందుచూపు అవసరం. అత్యాశకు అస్సలు వెళ్లకూడదు. ప్రాణాల పైకి వచ్చినప్పుడు మాత్రమే కొంగలాగా లైఫ్ లైన్ వాడుకోవాలి. అంతేకానీ అనవసరమైన చోట, మనం తెలివి తక్కువగా వ్యవహరించకూడదన్నమాట. సమయస్ఫూర్తితో వ్యవహరించి మన విజయాలకు బాటలు వేసుకోవాలి. ఎవ‌రినీ త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దు. అదే స‌మ‌యంలో అవ‌మానించొద్ద‌ని ఈ క‌థ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

15 నుంచి 18 ఏళ్ల టీనేజ్ పిలల్లను తల్లిదండ్రులు ప్రతిరోజు ఈ 5 ప్రశ్నలు అడగాలి..

సిబిఎస్ఈ సప్లిమెంటరీ పరీక్ష 2026.. మంచి మార్కులు సాధించాలంటే ఈ 7 తప్పులు అసలు చేయకూడదు

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

వానాకాలంలో ఇల్లు చెమ్మ వాసన వస్తోందా? నిమిషాల్లో దుర్వాసనకు చెక్

ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి

Big Stories

Advertisement
×