E-Paper
Advertisement

పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం
Advertisement

Litton Das:  బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు లిటన్ దాస్ (Litton Das)సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దేశంలో అడుగు పెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందేనంటూ బాంబు పేల్చారు. సేఫ్టీ విషయంలో పాకిస్తాన్ కంటే ఇండియా బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లో (PAKISTAN ) అడుగుపెడితే, మళ్లీ వెనక్కి వచ్చే దానిపైన గ్యారెంటీ ఉండదని షాకింగ్ ఆరోపణలు చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026 tournament) నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ తప్పుకోవడం గురించి ప్రస్తావించిన లిటన్ దాస్… షాకింగ్ నిజాలను పంచుకున్నారు. ఉగ్ర‌వాదులు, బాంబు దాడులు జ‌రిగే పాకిస్తాన్ కు వెళ్లి క్రికెట్ ఆడిన త‌మపై, ఇండియాలో ప‌ర్య‌టించ‌వ‌ద్ద‌ని గ‌త బంగ్లా స‌ర్కార్ ఒత్తిడి తీసుకువ‌చ్చింద‌ని షాకింగ్ నిజాలు పంచుకున్నారు.  ఇండియాలో ర‌క్ష‌ణ ఉండ‌బోద‌ని, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌కుండా మా ఆశ‌ల‌ను చంపేశార‌ని సీరియ‌స్ అయ్యారు లిట‌న్ దాస్.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే

Advertisement

ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026 tournament) సందర్భంగా గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. హిందువులపై బంగ్లాదేశ్ లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులు జరిగాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇండియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ను బ్యాన్ చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అయితే, ఈ వివాదం పైన తాజాగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ లిటన్ దాస్ (Litton Das) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల… తాము ఇండియాలో పర్యటించలేక…టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మిస్ చేసుకున్నట్లు ఆయన వివరించారు. పాకిస్తాన్ కంటే ఇండియానే చాలా సేఫ్టీ కంట్రీ అంటూ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ దేశంలో ఎప్పుడు పర్యటించినా, గన్మెన్లను మన రూమ్ దగ్గర పెట్టుకోవాల్సిందేనని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి పాకిస్తాన్ దేశంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ ఇండియాలో గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోవచ్చని.. సొంత దేశం లాగా అక్కడ ఉండవచ్చని పేర్కొన్నారు. కానీ చాలా మంది ఇండియాలో అసలు సేఫ్టీ ఉండబోదని చెబుతుంటారని.. అవన్నీ బూటకపు మాటలంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇండియాలో సేఫ్టీ ఉండబోదని.. టి20 ప్రపంచ కప్ ఆడకుండా తమపై ఒత్తిడి తెచ్చిందని సీరియస్ అయ్యారు. కానీ ఇప్పుడు తాము బాధపడుతున్నట్లు ఎమోషనల్ అయ్యారు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ లిటన్ దాస్.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

Big Stories

Advertisement
×