E-Paper
Advertisement

మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు
Advertisement

Manav Suthar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముగియగానే… ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా (India vs Afghanistan, One-off Test) మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. న్యూ చండీగఢ్ వేదికగా ఈ టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. ఈ టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. మొదట ఇండియా బ్యాటింగ్ చేయగా.. 564 పరుగులు సాధించింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకు కుప్ప కూలింది. ఈ క్రమంలో ఫాలోవన్ ఆడుతోంది.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

ఆరు వికెట్లతో అదరగొట్టిన మాన‌వ్ సుతార్

Advertisement

ఆఫ్గనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు రవీంద్ర జడేజా వారసుడు మాన‌వ్ సుతార్ (Manav Suthar ). ఇక అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో 22 ఓవర్లు వేసిన మాన‌వ్ సుతార్… 33 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లు మేడిన్ చేశాడు. అరంగేట్రంలోనే ఆరు వికెట్లు పడగొట్టిన రెండో ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్రా టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీశాడు. ఇక 18 సంవత్సరాల తర్వాత సుతార్ కూడా ఆరు వికెట్లు పడగొట్టి అదే రికార్డు బద్దలు కొట్టాడు. గత 38 సంవత్సరాల లో టెస్ట్ అరంగేట్రంలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడిగా కూడా మనోడు హిస్టరీ క్రియేట్ చేశాడు. 1988లో ఇండియన్ బౌలర్ నరేంద్ర హిర్వాణి, వెస్టిండీస్ పై 61 పరుగులు ఇచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. లేటెస్ట్ గా ఆఫ్గనిస్తాన్ పై మాన‌వ్ సుతార్ 6 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.

మూఢనమ్మకంతో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చూసేందుకు మాన‌వ్ సుతార్ కుటుంబ సభ్యులు కూడా స్టేడియానికి వచ్చారు. అయితే మొదటి రోజు జరిగిన మ్యాచ్ మొత్తం తిలకించిన ఆ కుటుంబ సభ్యులు… రెండో రోజు మాన‌వ్ సుతార్ బౌలింగ్ చేసే క్రమంలో స్టేడియం నుంచి వెళ్లిపోయారు. తాము ఉంటే తమ కుమారుడు మాన‌వ్ సుతార్ సరిగ్గా ఆడడేమో అని… మూఢ నమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఓ జ్యోతిష్యుడు కూడా ఇదే విషయాన్ని తెలిపాడట. దాన్ని ఫాలో అవుతూ… స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆరు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు మాన‌వ్ సుతార్.

ఇంతకు ఎవరీ మాన‌వ్ సుతార్ ?

Advertisement

ఇండియన్ క్రికెట్ లో రవీంద్ర జడేజా వారసుడిగా పేరు గాంచిన మాన‌వ్ సుతార్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్. జడేజా తరహాలో ఎడమ చేతితో బౌలింగ్ వేయడమే కాకుండా.. బ్యాటింగ్ కూడా అదరగొడతాడు. రాజస్థాన్ లోని ఈ శ్రీరంగ నగర్ అనే గ్రామంలో జన్మించాడు మాన‌వ్ సుతార్. ఈ క్రమంలో 2022-23 సమయంలో రాజస్థాన్ తరఫున రంజీ మ్యాచులు ఆడాడు. ఈ రంజీ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడి 39 వికెట్లు పడగొట్టాడు. దీంతో సెలెక్టర్ల కంటపడ్డ మానవ్… ఇండియాలోకి వచ్చేసాడు. ఐపీఎల్ లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌ఫున ఆడుతున్నారు.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

 

Related News

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

తెలుగోడు నితీశ్ కొంప ముంచిన ప్రీతి జింటా? కావ్య మ‌రో బ్లాస్టిక్ నిర్ణ‌యం!

బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

IPL టోర్న‌మెంట్ వ‌ల్ల‌..టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోతోంది…SRH కెప్టెన్ క‌మిన్స్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×