E-Paper
Advertisement

కేవలం చదువు మాత్రమే కాదు.. పిల్లలకు ఈ నైపుణ్యాలు నేర్పడం చాలా ముఖ్యం

కేవలం చదువు మాత్రమే కాదు.. పిల్లలకు ఈ నైపుణ్యాలు నేర్పడం చాలా ముఖ్యం
Advertisement

పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని, జీవితంలో ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకుంటారు. కానీ స్కూల్ చదువులు, మార్కులు మాత్రమే జీవితంలో నిజమైన సవాళ్లు కాదు. భవిష్యత్తులో పిల్లలు ఎన్నో ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులు సిద్ధం చేయాలి. ప్రస్తుతం పిల్లలు చదువులు, సమాజంలో ఇతరులతో పోటీ వల్ల ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వారికి అవసరమైన లైఫ్ స్కిల్స్ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

విమర్శను ప్రశాంతంగా ఎదుర్కోవాలని పిల్లలకు నేర్పించండి

ఎప్పుడూ అందరి నుంచి ప్రశంసలు పొందాలని పిల్లలు ఆశిస్తారు. కానీ అన్నిసార్లు అలా జరగదు. స్నేహితులు, ఉపాధ్యాయులు లేదా తోటివారు కొన్నిసార్లు బాధపెట్టే మాటలు చెప్పవచ్చు. విమర్శ వల్ల పిల్లలు కొన్ని సార్లు మానసికంగా బలహీనపడతారు.
తల్లిదండ్రులు పిల్లలకు తమ విలువను ఇతరుల అభిప్రాయాలతో ముడిపెట్టకూడదని నేర్పాలి. ప్రశాంతంగా ఆలోచించడం వల్ల కష్ట సమయాల్లో సరైన స్పందన ఇవ్వగలరు. జీవితంలో తప్పులు, విమర్శలు జీవితంలో సాధారణమని అర్థం చేసుకోవాలి.

చిన్న చిన్న సమస్యలు, అసౌకర్యాలను సహించడం నేర్పండి

Advertisement

ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు తల్లిదండ్రులు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నారు. అడిగిన ప్రతిది తెచ్చి ఇస్తున్నారు. ఏదైనా ఆలస్యం జరిగినా, అడిగిన వస్తువు తెచ్చి ఇవ్వక పోయినా పిల్లలు నిరాశపడతారు. ఆ వస్తువు తమకు దక్కలేదని బాధపడతారు. అందుకే జీవితంలో ఆశించిన ప్రతిదీ దక్కదని చిన్న చిన్న అసౌకర్యాలు సాధారణమని వారికి అర్థమయ్యేవిధంగా చెప్పాలి.
తల్లిదండ్రులు ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించకూడదు. పిల్లలకు కొంత బాధ్యత ఇవ్వడం వల్ల వారిలో ఓర్పు, మానసిక బలం పెరుగుతాయి. స్వతంత్రంగా చిన్న సవాళ్లను ఎదుర్కోవడం వల్ల పిల్లలు మానసికంగా బలపడతారు.

ఏ విషయాన్నైనా పిల్లలు చెప్పగలిగే భద్రత కల్పించండి

పిల్లలు కొన్ని సార్లు ఏదైనా భయం, బాధ ఉంటే ఆ ఒత్తిడిని లోపలే దాచేస్తారు. దీని వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకేవారికి ఇంట్లో సురక్షితమైన వాతావరణం కల్పించాలి. వారితో అన్ని విషయాలు చర్చించే విధంగా భద్రతా భావం కలిగించాలి. పిల్లల మాటలు ఓపికగా వినండి. దీని వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య నమ్మకం పెరుగుతుంది. అప్పుడే తమ మనోభావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలరు.

సహాయం కోరడం తప్పుకాదని చెప్పాలి

Advertisement

కొందరు పిల్లలు ప్రశ్నలు అడగడానికి భయపడతారు. దీంతో వారిలో ఒంటరితనం, ఒత్తిడి పెరుగుతుంది. సహాయం కోరడం బలహీనత కాదు, పరిపక్వత అని చెప్పాలి. కష్ట సమయాల్లో పెద్దలతో తమ సమస్యలను చెప్పి సాయం తీసుకోవాలని ప్రోత్సహించండి. దీంతో వారి భారం తగ్గుతుందని చెబుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి.

Also Read: మీ అభిప్రాయాలకు మీ చుట్టూ ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తున్నారా? దీనికి కారణం అదే

పరీక్షల్లో మార్కులు మాత్రమే వారి ప్రతిభకు గుర్తింపు కాదు

పిల్లలు ఎక్కువగా తాము సాధించిన మార్కులు, గ్రేడ్స్ ద్వారా తమకు టాలెంట్ ఉందని అంచనా వేసుకుంటారు. తక్కువ మార్కులు వచ్చినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వారి ప్రయత్నం, నిజాయితీ, క్రమశిక్షణ, సృజనాత్మకతను కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వండి. రిపోర్ట్ కార్డ్ పూర్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించదని గుర్తు చేయండి. ప్రయత్నాన్ని ప్రశంసించండి, ఇతరులతో పోల్చడం మానండి.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×