E-Paper
Advertisement

Marriage Material: మీ బాయ్‌ఫ్రెండ్‌లో ఈ 7 లక్షణాలు ఉంటే.. అతను పక్కా ‘ మ్యారేజ్ మెటీరియల్’ !

Marriage Material: మీ బాయ్‌ఫ్రెండ్‌లో ఈ 7 లక్షణాలు ఉంటే.. అతను పక్కా ‘ మ్యారేజ్ మెటీరియల్’ !
Advertisement

Marriage Material: ఒక వ్యక్తిని ప్రేమించడం వేరు.. అతన్ని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం వేరు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన వివాహ బంధానికి కేవలం ప్రేమ, శారీరక ఆకర్షణ మాత్రమే సరిపోవు. స్థిరత్వం, గౌరవం, బాధ్యత వంటి కీలక లక్షణాలు అవసరం. మీ భాగస్వామి నిజంగా వివాహానికి తగిన వ్యక్తి అని నమ్మడానికి అతని ప్రవర్తనలో కొన్ని నిర్దిష్ట సంకేతాలను గమనించాలి.

వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పురుషుడిలో ఉండాల్సిన 5 ముఖ్య లక్షణాలు:

Advertisement

1. నిజాయితీ సంభాషణ:
వివాహంలో కమ్యూనికేషన్ అనేది పునాది వంటిది. వివాహానికి సిద్ధంగా ఉన్న పురుషులు ఎప్పుడూ తన భావాలను, భయాలను , ఆశయాలను నిజాయితీగా పంచుకుంటాడు. అంతే కాకుండా సమస్యలు వచ్చినప్పుడు వాటిని దాచిపెట్టకుండా.. పరిష్కారం కోసం మాట్లాడతారు. మీ మాటలను శ్రద్ధగా వింటారు. అంతే కాకుండా మీ అభిప్రాయాలకు విలువ ఇస్తారు. వారి సంభాషణలో దాపరికాలు, గందరగోళం ఉండవు. స్పష్టత ఉంటుంది.

2. ఆర్థిక బాధ్యత , స్థిరత్వం:
వివాహం అనేది ఇద్దరి జీవితాలు ఆర్థికంగా కూడా ముడిపడే బంధం. అందుకే ఆర్థిక బాధ్యత చాలా కీలకం. భవిష్యత్తు గురించి, ఆర్థిక ప్రణాళికల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. అప్పులు, ఖర్చుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఆదాయం ఎంత ఉన్నా, సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. మీరు ఇద్దరూ కలిసి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు సిద్ధంగా ఉంటాడు.

Advertisement

3. మీకు విలువ ఇచ్చేవాడు:
మీ భాగస్వామి మీ కలలు, లక్ష్యాలు, అభిరుచులకు ఎంత మేరకు మద్దతు ఇస్తున్నారు అనేది ముఖ్యం. వివాహానికి తగిన వ్యక్తి మీ కెరీర్ లక్ష్యాలను ఎప్పుడూ చిన్నబుచ్చడు.. బదులుగా ప్రోత్సహిస్తాడు. మీ ఇష్టాలు, స్నేహితులు, వ్యక్తిగత సమయాన్ని గౌరవిస్తాడు.
మీరు ఏ నిర్ణయం తీసుకున్నా.. అది మంచిదైతే ధైర్యంగా మీ వెనక నిలబడతాడు. అతను మిమ్మల్ని మీలాగే అంగీకరించి.. సమానంగా భావిస్తాడు.

4. ఇతరులతో గౌరవంగా వ్యవహరించడం:
ఒక వ్యక్తి తన భాగస్వామితో మాత్రమే కాకుండా.. రెస్టారెంట్‌లో సర్వర్‌లు, డ్రైవర్లు, తన తల్లిదండ్రులు లేదా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో ఎలా వ్యవహరిస్తాడో గమనించాలి. వివాహానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అందరికీ మర్యాదగా గౌరవిస్తాడు. అతను కోపంలో ఉన్నప్పుడు కూడా ఇతరులను కించపరచడం లేదా దుర్భాషలాడటం వంటివి చేయడు. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ప్రేమగా, గౌరవంగా చూస్తాడు.

5. సమస్యలకు పరిష్కారం కనుగొనే వ్యక్తిత్వం:
ఏ బంధంలోనైనా గొడవలు రావడం సహజం. కానీ.. వివాహానికి తగిన పురుషులు ఆ గొడవలను ఎలా ఎదుర్కొంటాడు అనేది ముఖ్యం. కోపం, అరుపుల ద్వారా కాకుండా.. ప్రశాంతంగా కూర్చుని పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. తప్పు తన వైపు ఉంటే.. దానిని ఒప్పుకోవడానికి సంకోచించడు. బంధాన్ని కాపాడుకోవడానికి.. మీ ఇద్దరి మధ్య సామరస్యం కోసం చొరవ తీసుకుంటాడు.

ఈ లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే.. అతను కేవలం బాయ్‌ఫ్రెండ్‌గా మాత్రమే కాకుండా.. జీవితాంతం తోడుండే ఒక అద్భుతమైన జీవిత భాగస్వామిగా కూడా నిలబడగలడని మీరు నమ్మవచ్చు.

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×