E-Paper
Advertisement

Toothbrush: టూత్‌బ్రష్ విషయంలో చాలామంది చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?

Toothbrush: టూత్‌బ్రష్ విషయంలో చాలామంది చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?
Advertisement

Toothbrush: దంతాలు మిళమిళ మెరవాలంటే పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేవు. సరైన విధంగా బ్రష్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ విషయంలోనే చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. రోజూ బ్రష్ చేస్తున్నామనే భావన ఉన్నా, నిజానికి చాలామంది పళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదని దంత వైద్యులు చెబుతున్నారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలన్న విషయం అందరికీ తెలిందే. అయితే కనీసం ఒకసారి బ్రష్ చేసినప్పుడు కూడా పళ్లను పూర్తిగా శుభ్రం చేసేవారు చాలా తక్కువట. ఈ కారణంగానే దంత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాదు.. మనం ఉపయోగించే టూత్‌బ్రష్ విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుని పాటించడం అవసరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాఫ్ట్ బ్రిజిల్స్‌నే ఎంచుకోవాలి:

ప్రతిరోజూ పళ్లు తోముకోవడానికి దంతాలు, చిగుళ్లకు రక్షణ కలిగించేది సాఫ్ట్ బ్రిజిల్స్‌ను మాత్రమే ఎంచుకోవాలి. హార్డ్ బ్రిజిల్స్ వల్ల ఎనామెల్ నష్టం, చిగుళ్ల గాయాల వంటి సమస్యలు తలెత్తవచ్చు. అదే విధంగా.. ఒక టూత్‌బ్రష్‌ను 3 నుంచి 4 నెలలకు మించి వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫ్లూ, జలుబు, దగ్గు వచ్చిన తర్వాత వెంటనే బ్రష్‌ను మార్చడం చాలా ముఖ్యంగా. ఎందుకంటే.. టూత్ బ్రష్‌లలో ఇన్ఫెక్షన్లు నిలిచి ఉండే అవకాశం ఉంది కాబట్టి.

Advertisement

Read Also: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా?.. సులభమైన చిట్కాలతో నివారించండిలా!

బాత్రూమ్‌లో అస్సలు ఉంచొద్దు:

బాత్రూమ్‌లో ఉండే తేమ, హానికర బాక్టీరియా టూత్‌బ్రష్‌పై సులభంగా అతుక్కుంటాయి. ఇది దంతాల మీద మాత్రమే కాకుండా మీ ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే బ్రష్‌లను ఎప్పుడూ పొడి ప్రదేశంలో, గాలి ఆడే షెల్ఫ్‌లో ఉంచాలని సూచిస్తున్నారు.

అలా చేయడమే పెద్ద ప్రమాదం:

Advertisement

సాధారణంగా అందరూ చేసే పొరపాటు ఏంటంటే.. అందరి బ్రష్‌లను కలిపి ఓకే షెల్ఫ్‌లో పెట్టడం. ఇలా చేయడం వల్ల ఒకరి బ్రష్‌పై ఉండే బాక్టీరియా మరొకరి బ్రష్‌కు చేరే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరి టూత్‌బ్రష్‌లను వేర్వేరుగా ఉంచడం ఉత్తమం. అలాగని టూత్‌బ్రష్‌కు క్యాప్ పెట్టడమూ మంచిది కాదు. ఎందుకంటే.. తేమలో బాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువ.

2 నిమిషాలు తప్పనిసరి:

తాజా సర్వేలు చెబుతున్న సమాచారం ప్రకారం చాలామంది కేవలం 45 నుంచి 70 సెకండ్లలోనే తమ బ్రషింగ్‌ను పూర్తి చేసేస్తున్నారట. కానీ నోటి బాక్టీరియాను తగ్గించాలంటే కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేయడం తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దంతాలను శుభ్రం చేసుకోవడంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ సమయం కేటాయిస్తారనే విషయం తాజా సర్వేలో వెల్లడైంది.

Read Also: నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదా? కాదా?.. ఈ విషయంలో నిపుణులు మాట ఇదే!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×