E-Paper
Advertisement

People Media Factory : సెన్సార్ బోర్డుకి క్షమాపణలు, ఆ నటుడి మాటలే కారణం

People Media Factory : సెన్సార్ బోర్డుకి క్షమాపణలు, ఆ నటుడి మాటలే కారణం
Advertisement

People Media Factory : కొన్ని సందర్భాలలో స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజుల్లో చిన్న చిన్న మాటలు వల్లే చాలామందికి పెద్దగా మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితి. కొన్ని సినిమా పాటలు విషయాల్లోనూ ఇది జరుగుతుంది. సందీప్ రాజ్ దర్శకత్వంలో సుమా కనకల తనయుడు రోషన్ కనకల నటిస్తున్న సినిమా మౌగ్లి. ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది.

మొదట ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు కానీ అనుకోని కారణాల వలన అఖండ కూడా అదే డేట్ కి రావడంతో ఈ సినిమాను ఒకరోజు వెనక్కి తీసుకువెళ్లారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిన సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో బండి సరోజ్ కుమార్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. తను మాట్లాడిన మాటలకు గాను పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డు కు క్షమాపణలు తెలియజేశారు.

సెన్సార్ బోర్డు కు క్షమాపణలు 

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ బ్యానర్స్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. ఇప్పటికే 50 సినిమాలకు పైగా ఈ బ్యానర్ నిర్మించింది. నిన్న ఈవెంట్ లో నటుడు బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా మాట్లాడారు అని, ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు అని తెలియజేశారు.

సెన్సార్ బోర్డు పై తమకు ఉన్న గౌరవాన్ని మరోసారి గుర్తుచేస్తూ, సెన్సార్ బోర్డు అత్యంత బాధ్యతతో, నమ్మకంగా పనిచేస్తారు అనే అవగాహన తమకు ఉంది అని తెలిపారు. బోర్డు సభ్యులు అనుభవజ్ఞులైన అధికారులు, పరిశ్రమలో సీనియర్ నిపుణులు కావడంతో వారి సూచనలు, మార్గదర్శకత్వాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని కంపెనీ తెలియజేసింది.

Advertisement

సరోజ్ కేవలం మాట్లాడింది అనుకోకుండా అని, అలానే భవిష్యత్తులో ఇలాంటి అపార్ధాలు రాకుండా చూసుకుంటాం అని తమకు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

సరోజ్ ఏమన్నారు?

ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఏ సర్టిఫికేట్ అంటే ఈ సినిమా ఏదో అసభ్యంగా ఉంటుంది అని అనుకోకండి. నా క్యారెక్టర్ చూసి సెన్సార్ బోర్డు మెంబరు భయపడిపోయాడట. రూత్ లెస్ పోలీస్ లా ఉన్నాడు. రూత్ లెస్ పోలీస్ క్యారెక్టర్ లా లేదు నా ముందు వాడు నిలుచుంటున్నట్లు ఉంది పర్ఫామెన్స్ అని ఆశ్చర్యపోయాడు అని సందీప్ నాతో చెప్పాడు అని సరోజ్ మాట్లాడాడు.

బహుశా సెన్సార్ బోర్డు మెంబర్ ని ఏక వచనంతో పిలవడం వలన వాళ్లు హర్ట్ అయినట్లు తెలుస్తుంది. అందుకోసమే పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

Also Read: Peddi : చెప్పిన డేట్ కి రామ్ చరణ్ పెద్ది, బుచ్చిబాబు బ్యాకప్ ప్లాన్ ఇదేనా?

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×