E-Paper
Advertisement

Women Lifestyle: అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?.. మీరు అనుకున్నదే నిజమైంది!

Women Lifestyle: అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?.. మీరు అనుకున్నదే నిజమైంది!
Advertisement

Women Lifestyle: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. అని ఎప్పుడో చెప్పారు ఓ సినీ కవి. వారి మాటలకు అర్థాలు మాత్రమే కాదు.. వారి అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు కూడా భిన్నంగానే ఉంటాయి. అమ్మాయిలను అన్ని సందర్భాల్లోనూ అర్థం చేసుకోవడం కష్టం అంటుంటారు కొందరు. ఎందుకుంటే.. ప్రతి అమ్మాయి స్వభావం భిన్నంగా ఉంటుంది కాబట్టి. అయితే, చాలామంది అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉండటానికి కొన్ని పనులు చేస్తుంటారు. తాజా సర్వే ప్రకారం.. అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలియజేసే ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి..

వంటింట్లో ప్రయోగాలు:

15 శాతం మంది అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు.. కొత్త వంటలు చేయడానికి ఇష్టపడుతున్నారని సర్వే చెబుతోంది. పని ఒత్తిడికి దూరంగా, వంటగదిలో తమ సృజనాత్మకతను వెలికితీస్తూ.. కొత్త రెసిపీలను ప్రయత్నించడం వారికి ఓ థెరపీలా మారుతోంది. కొత్త రుచులు సృష్టించడం, వాటిని ఆస్వాదించడం వలన అమ్మాయిలు రిలాక్స్ అయ్యేందుకు ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు.

అద్దం ముందు నృత్యం:

Advertisement

మరో 15 శాతం మంది అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ డాన్స్ చేస్తారని తెలిసింది. అద్దం ముందు గానీ, గదిలో గానీ తమకిష్టమైన పాటలకు కాలు కదపడం వలన ఒత్తిడిని దూరం అవుతుందట. ఈ డాన్స్‌లో రిథమ్ మాత్రమే కాదు.. ఒక స్వేచ్ఛా భావం కూడా దాగి ఉంటుందని తెలిపారు.

Read Also: గంటల తరబడి కంప్యూటర్‌తో కుస్తీ.. అనారోగ్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు!

వెబ్‌సిరీస్/సినిమాలు:

Advertisement

ఇక 10 శాతం స్త్రీలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తమ సమయాన్ని సినిమాలు లేదా వెబ్ సిరీస్ చూస్తూ గడుపుతున్నారని సర్వే తెలిపింది. వారికది ఒకరకంగా మానసిక విశ్రాంతిని ఇస్తుందట. వారికిష్టమైన పాత్రలు, కథలు, భావోద్వేగాలు వాళ్లను మరో లోకానికి తీసుకెళ్తాయి. ఆ సమయంలో బయటి ప్రపంచాన్ని మర్చిపోయి, తమతో తాము గడుపుతారు.

ఫిట్‌నెస్ మీద ఫోకస్:

యోగా, ధ్యానం, వ్యాయామాలు కూడా అమ్మాయిలకు ఇష్టమైన పనుల్లో ఒకటి. 10% అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు తమ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా చేస్తారని,
దీనివల్ల శరీరానికి మాత్రమే కాకుండా.. మనసుకూ ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఆ నిశ్శబ్ద క్షణాల్లో వాళ్లు తమలో తాము లీనమైపోతారు.

అందంగా కనిపించాలని:

ఇక 8 శాతం అమ్మాయిలు.. ఇంట్లోనే స్పా చేసుకోవడం, ఫేస్ మాస్క్ వేసుకోవడం చేస్తారట. ఇది వాళ్లకు స్వీయ సంరక్షణలో భాగం. బయటి ప్రపంచం హడావుడికి దూరంగా, అద్దం ముందు తమను తాము మరింత ప్రేమించుకునే సమయంగా ఈ క్షణాలు మారుతాయి. మరో 2 శాతం మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తమ అనుభూతులను రాసుకోవడం ద్వారా ఉపశమనం పొందుతారట.

ఆన్‌లైన్ షాపింగ్‌లో బిజీ:

ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 శాతం అమ్మాయిలు షాపింగ్ యాప్స్‌లో బిజీ బిజీగా గడిపేస్తుంటారట. ఏం కొనాలి అంటూ.. బ్రౌజ్ చేస్తూ సమయాన్ని గడుపుతున్నారని సర్వే చెబుతోంది. అవసరం లేకపోయినా కొత్త వస్తువులను చూస్తూ చిన్న చిన్న ఆనందాలు పొందుతున్నారు. అలాగే 5% స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాల లోకంలో మునిగిపోతారు. కథలు, భావాలు, పాత్రలు వాళ్లను నిజ జీవిత ఒత్తిడి నుంచి తాత్కాలికంగా దూరం చేస్తాయి.

ఊహల ప్రపంచంలో తేలిపోతూ:

15 శాతం అమ్మాయిలు పాటలు వినడానికి ఎక్కువ ఇష్టపడతారట. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, తమకిష్టమైన పాటలతో ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారు. అది వారికీ ఒక భావోద్వేగ యాత్రలా ఉంటుంది. అలాగే మరో 15% అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, స్టైలిష్ పోజులతో ఫొటోలు దిగడం ఇలా.. కెమెరా ముందు తమలోని ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలకు స్వేచ్ఛను, ప్రశాంతతను అందిస్తాయని తాజా సర్వేలో వెల్లడైంది.

Read Also: ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోనూ.. ఈ సుగంధ ద్రవ్యాల రాణి ఉండాల్సిందే!

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×