E-Paper
Advertisement

Flirting Tips: మాటలు, చేతల్లో మాయ.. ఎవరినైనా సింపుల్‌గా మీవైపు తిప్పుకునేందుకు బెస్ట్ టిప్స్ !

Flirting Tips: మాటలు, చేతల్లో మాయ.. ఎవరినైనా సింపుల్‌గా మీవైపు తిప్పుకునేందుకు బెస్ట్ టిప్స్ !
Advertisement

Flirting Tips: ఫ్లర్టింగ్ అనేది కేవలం ఇతరులను ఆకర్షించడం మాత్రమే కాదు, ఇది ఆత్మవిశ్వాసం , సరదా, మానవ సంబంధాలను పెంచే ఒక కళ. అయితే.. చాలామంది ఫ్లర్టింగ్ అంటే ఏదో పెద్ద విషయం అనుకుంటారు. కానీ సంబంధాల నిపుణుల ప్రకారం..ఫ్లర్టింగ్‌కు అతి ముఖ్యమైనది నిజాయితీ , సింప్లిసిటీ. మీ ఫ్లర్టింగ్ నైపుణ్యాలను మెరుగు పరుచు కోవడానికి నిపుణులు సూచించిన 5 ముఖ్యమైన చిట్కాలు..

1. కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి:
శారీరక ఆకర్షణలో కంటి చూపు కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తితో మీరు మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి సుమారు 4-5 సెకన్ల పాటు చూస్తూ చిరునవ్వు ఇవ్వడం గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.

Advertisement

నిపుణుల సలహా: నిరంతరం కాకుండా.. మధ్య మధ్యలో చూస్తూ.. చిన్నగా నవ్వడం ద్వారా మీరు వారిపై ఆసక్తి కలిగి ఉన్నారని సున్నితంగా తెలియజేయవచ్చు. ఇది ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది.

2. బాడీ లాంగ్వేజ్:
నవ్వు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. నిజమైన, హృదయపూర్వకమైన నవ్వు ఎదుటివారిని త్వరగా ఆకర్షిస్తుంది. అలాగే..బాడీ లాంగ్వేజ్‌కు కూడా చాలా ముఖ్యం.

Advertisement

నిపుణుల సలహా: మాట్లాడే సమయంలో వారి వైపు తిరగండి. చేతులను కట్టుకోకుండా రిలాక్స్‌డ్‌గా ఉంచండి. వారి మాటలకు ప్రతిస్పందనగా చిన్నగా నవ్వడం, నడుమును వాల్చడం వంటివి ఆసక్తిని పెంచుతాయి.వారు చేసే చిన్న చిన్న కదలికలను మీరు కూడా సున్నితంగా అనుకరించడం.

3. ఎక్కువగా వినండి:
గొప్పగా మాట్లాడటం కంటే.. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం అనేది ఫ్లర్టింగ్‌లో అత్యంత ముఖ్యమైన విషయం. మీరు వింటున్నారని వారికి తెలియజేయండి.

నిపుణుల సలహా: వారు చెప్పిన విషయాలపై స్పష్టమైన ప్రశ్నలు వేయండి. ఉదాహరణకు.. “మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అన్నారు కదా, మీరు వెళ్లిన బెస్ట్ ప్లేస్ ఏది?” అని అడగడం ద్వారా.. మీరు వారిపై, వారి ఆసక్తులపై శ్రద్ధ పెడుతున్నారని తెలుస్తుంది.

Also Read: నెల రోజులు అద్దం చూడకుండా ఉంటే ఇంత జరుగుతుందా ? అస్సలు ఊహించలేరు !

4. సున్నితమైన స్పర్శ:
సందర్భానుసారంగా చిన్నపాటి, సున్నితమైన స్పర్శలు దగ్గరితనాన్ని పెంచుతాయి. అయితే.. ఇది చాలా సున్నితమైన విషయం, ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త వహించాలి.

నిపుణుల సలహా: నవ్వుతున్నప్పుడు లేదా ఏదైనా అద్భుతమైన విషయం చెప్పినప్పుడు, వారి చేతిని లేదా భుజాన్ని ఒక సెకను పాటు సున్నితంగా తాకండి. ఇది ‘మీరు నాకు నచ్చుతున్నారు’ అనే భావాన్ని మాటలు లేకుండా తెలియజేస్తుంది. ఈ సమయంలో వారి సౌకర్యాన్ని గమనించండి.

5. ప్రశంస:
మీరు ఇచ్చే ప్రశంసలు వారి రూపం గురించి కాకుండా.. వారి వ్యక్తిత్వం లేదా నైపుణ్యం గురించి ఉంటే మరింత ప్రభావ వంతంగా ఉంటాయి.

నిపుణుల సలహా: “మీ చొక్కా చాలా బాగుంది” అనడం కంటే.. “మీరు సమస్యను పరిష్కరించిన విధానం నాకు నిజంగా నచ్చింది. చాలా తెలివైనవారు” అని అనడం వారి ఆత్మగౌరవాన్నిపెంచుతుంది. ప్రశంసలు చిన్నవిగా, నిజాయితీగా ఉండాలి.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×