E-Paper
Advertisement

పిల్లలు మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్నారా? తల్లిదండ్రులు చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే!

పిల్లలు మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్నారా? తల్లిదండ్రులు చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే!
Advertisement

First day of school tips for parents:  పిల్లలను మొదటిసారి స్కూల్‌కు పంపే రోజు తల్లిదండ్రుల మనసులో ఎన్నో ఎమోషన్స్ నడుస్తుంటాయి. ఒక వైపు తమ చిన్నారి పెద్దవాడై స్కూల్‌కి వెళ్తున్నాడనే ఆనందం, మరో వైపు అంత సేపు మనకు దూరంగా ఎలా ఉంటాడో ఏడుస్తాడేమో అనే ఆందోళన కలగడం సహజం. నిజానికి ఇల్లు అనే చిన్న ప్రపంచం నుంచి స్కూల్ అనే పెద్ద ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు.. పిల్లలు భయపడటం చాలా నార్మల్.మరి ఈ భయాన్ని పోగొట్టి, మీ పిల్లలు మొదటిసారి స్కూల్‌కు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఏం చేయాలో ఇప్పుడు  తెలుసుకుందాం.

పిల్లలు మొదటిసారి స్కూల్‌కి వెళ్లేటప్పుడు పేరెంట్స్ చేయాల్సిన పనులు:

Advertisement

1. స్కూల్ వాతావరణాన్ని ముందే అలవాటు చేయడం:
పిల్లలను డైరెక్ట్‌గా ఒకేసారి తీసుకెళ్లి స్కూల్‌లో పడేస్తే వారు అస్సలు తట్టుకోలేరు. అందుకే స్కూల్ ప్రారంభం కావడానికి ఒక వారం లేదా పది రోజుల ముందే వారికి మానసికంగా ప్రిపేర్ చేయాలి. ఇంట్లోనే స్కూల్ గురించి కథలు చెప్పాలి. “స్కూల్‌కి వెళ్తే మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. బోలెడన్ని ఆటలు ఆడుకోవచ్చు, కొత్త బొమ్మలు ఉంటాయి” అంటూ స్కూల్ పట్ల పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి. వీలైతే స్కూల్ యాజమాన్యం అనుమతితో.. క్లాసులు స్టార్ట్ అవ్వకముందే ఒకసారి మీ పిల్లలను స్కూల్ క్యాంపస్‌కి తీసుకెళ్లి అక్కడి ప్లే గ్రౌండ్, క్లాస్ రూమ్స్ చూపించడం చాలా మంచిది. దీని వల్ల మొదటి రోజు వెళ్ళినప్పుడు వారికి ఆ వాతావరణం కొత్తగా అనిపించదు.

2. నిద్ర, ఆహారపు అలవాట్లను మార్చడం:
ఇప్పటివరకు ఇంట్లో.. ఉన్నప్పుడు పిల్లలు ఇష్టమొచ్చిన టైమ్‌కి పడుకుని, ఇష్టమొచ్చిన టైమ్‌కి లేచే అవకాశం ఉంటుంది. కానీ స్కూల్ టైమింగ్స్ వేరుగా ఉంటాయి. అందుకే స్కూల్ ఫస్ట్ డే కంటే కనీసం రెండు వారాల ముందు నుంచే ఉదయాన్నే లేవడం, బ్రష్ చేసుకోవడం, సరైన టైమ్‌కి బ్రేక్‌ఫాస్ట్ చేయడం వంటి అలవాట్లను ప్రాక్టీస్ చేయించాలి. అలాగే స్కూల్‌లో వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే టీచర్‌కి లేదా ఆయాకి ఎలా చెప్పాలో ఇంట్లోనే నేర్పించాలి. తమ వాటర్ బాటిల్ ఓపెన్ చేయడం, లంచ్ బాక్స్ మూత తీయడం వంటి చిన్న చిన్న పనులు వారి చేతే చేయించడం వల్ల స్కూల్‌లో వారు ఇబ్బంది పడకుండా ఉంటారు.

Advertisement

3. స్కూల్ షాపింగ్‌లో పిల్లలను భాగస్వామ్యం చేయడం:
పిల్లలకు కొత్త వస్తువులంటే ఎంతో ఇష్టం. అందుకే వారి స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్ వంటివి కొనేటప్పుడు పిల్లలను కూడా మీతో పాటు షాపింగ్‌కి తీసుకెళ్లండి.వారికి నచ్చిన కార్టూన్ క్యారెక్టర్స్ (ఉదాహరణకు స్పైడర్‌మ్యాన్, బార్బీ వంటివి) ఉన్న వస్తువులను వారినే సెలెక్ట్ చేసుకోమనండి. ఇలా చేయడం వల్ల.. ఆ కొత్త వస్తువులను వేసుకుని స్కూల్‌కి ఎప్పుడు వెళ్దామా అనే ఉత్సాహం, ఎగ్జైట్‌మెంట్ పిల్లల్లో పెరుగుతుంది. ఆ వస్తువులపై వారి పేరు స్పష్టంగా రాయడం మర్చిపోకండి.

4. మొదటి రోజు బై చెప్పే విధానం:
చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే.. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి వారు పక్కకు చూడగానే దొంగచాటుగా అక్కడ నుంచి పారిపోతారు. ఇది చాలా తప్పు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ‘మా అమ్మ నాన్న నన్ను వదిలేసి వెళ్లిపోయారు’ అనే అభద్రతా భావం ఎక్కువైపోతుంది. అందుకే మీ చిన్నారి ఎంత ఏడుస్తున్నా సరే.. ధైర్యంగా వారి కళ్లల్లోకి చూసి ముద్దు పెట్టుకుని, “నువ్వు లోపల ఆడుకో నాన్న, అమ్మ/నాన్న కరెక్ట్‌గా ఈవెనింగ్ వచ్చి నిన్ను తీసుకెళ్తారు” అని నమ్మకంగా చెప్పి బై చెప్పాలి. మీ వీడ్కోలు క్లుప్తంగా ఉండాలి.. ఎక్కువసేపు అక్కడే ఉండి సెంటిమెంట్‌గా ఎమోషనల్ సీన్ క్రియేట్ చేయకూడదు.

5.ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం:
పిల్లల కంటే.. ఎక్కువగా తల్లిదండ్రులే ఎమోషనల్ అవుతుంటారు. గేటు దగ్గర పిల్లవాడు ఏడుస్తుంటే.. వెనక్కి తిరిగి చూసి తల్లి కూడా ఏడవడం చాలా ఇళ్లల్లో జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి.. పిల్లలు మీ ముఖ కవళికలను చాలా బాగా గమనిస్తారు. ముఖంలో భయం, బాధ కనిపిస్తే.. స్కూల్ అనేది ఏదో డేంజర్ ప్లేస్ అందుకే మా అమ్మ భయపడుతోంది అని వారు మరింత గట్టిగా ఏడుస్తారు. కాబట్టి మీరు ఎంత బాధగా ఉన్నా.. పిల్లల ముందు మాత్రం చాలా హ్యాపీగా, చిరునవ్వుతో.. ధైర్యంగా కనిపించాలి. మిమ్మల్ని చూసే వారు ధైర్యాన్ని తెచ్చుకుంటారు.

మొదటి వారం లేదా.. పది రోజులు పిల్లలు స్కూల్‌కి వెళ్ళడానికి మారాం చేయడం, ఏడవడం చాలా కామన్. అంత మాత్రానికే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే వారిని ప్రేమగా.. దగ్గరకు తీసుకుని, ఈరోజు స్కూల్‌లో ఏం జరిగిందో, ఏమేం ఆటలు ఆడారో అడిగి తెలుసుకోండి. టీచర్స్ తో నిరంతరం టచ్‌లో ఉంటూ.. పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవడం మంచిది.

Tags

Related News

వర్షాకాలంలో ఊసరవెల్లులు ఇంట్లో వస్తున్నాయా? దూరంగా ఉంచేందుకు ఈ 3 చిట్కాలు

మీరు సన్‌స్క్రీన్ పిల్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త చర్మ వైద్యులు ఏం చెబుతున్నారంటే

స్కూల్ పిల్లలకు వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువ.. ఆరోగ్యకరంగా ఉండేందుకు ఈ అలవాట్లు తప్పనిసరి

ఒడిస్సీ సినిమా.. తామర పువ్వు తింటే జ్ఞాపకశక్తి పోతుందా? నిపుణులు ఏమంటున్నారు?

గోళ్లు-కనుబొమ్మలు-కాలివేళ్లు.. ఇవే ఓ వ్యక్తి సంపద రహస్యం, కాకపోతే

లీవ్ కోసం బాస్‌కి 50 వింత సాకులు చెప్పిన డెవలపర్.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు!

చామన ఛాయ లేదా నల్లగా ఉండే వారికి మ్యాచింగ్ కలర్స్.. ఈ 7 కలర్ డ్రెస్‌లతో రాయల్ లుక్

ప్రేమ రూపం చూసి కలుగుతుందా లేక మనసు చూసి పుడుతుందా? నిజం చేదుగా ఉంటుంది

Big Stories

Advertisement
×