E-Paper
Advertisement

Vitamin B12 Foods: విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవే !

Vitamin B12 Foods: విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవే !
Advertisement

Vitamin B12 Foods: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన సూక్ష్మ పోషకాలు అత్యంత అవసరం. విటమిన్స్, మినరల్స్ తో పాటు కొవ్వు పదార్థాలు శరీరానికి తగినతం తీసుకోవాలి. శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలలో ఒకటి విటమిన్ బి12. దీనిని కోబాలమైన్ అని కూడా అంటారు. ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత నుంచి మతిమరపు వరకు.. నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి 12 ఉండేలా చూసుకోవాలి. విటమిన్ బి 12 గురించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మాంసాహారం:

Advertisement

మాంసాహారంలో అధికంగా విటమిన్ బి 12 ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొవ్వు శాతం అధికంగా ఉండే మాంసాహారం ఎంచుకోవడం మంచిది. వారానికి కొన్ని సార్లు మాంసాహారం తినడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో విటమిన్ బి 12 కంటెంట్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చేపలు:
విటమిన్ బి 12 అధికంగా ఉండే మరో పోషకాహారం చేపలు. ముఖ్యంగా సాల్మన్, ట్రౌట్ వంటి చేపల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి. సాల్మన్ చేపల్లో గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి శరీరానికి తగినంత పోషకాలను తీసుకోవడం అవసరం.

Advertisement

పాల ఉత్పత్తులు:
కొందరు నాన్ వెజ్ తిననివారు కూడా ఉంటారు. అలాంటి వారికి శరీరానికి తగినంత ప్రోటీన్ లభించదు. ముఖ్యంగా వెజిటేరియన్స్ పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జున్ను, పెరుగు, పాల వంటి వాటిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పాల ఉత్పత్తులు చేర్చుకోవడం మంచిది. దీని వల్ల విటమిన్ బి 12 లోపం తలెత్తకుండా ఉంటుంది.

గుడ్లు:
విటమిన్ బి 12 పుష్కలంగా ఉండే ఆహారంలో గుడ్లు కూడా ఒకటి. గుడ్లలోని పచ్చసొనలో ఇది ఎక్కువగా ఉంటుంది. గుడ్డు మొత్తాన్ని ఆహారంగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రెండు గుడ్ల నుంచి ఒకటి 1.1 మైక్రోగ్రాముల విటమిన్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

తృణధాన్యాలు:
తృణధాన్యాలు బలవర్ధకమైన పోషకాహారాలు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తిననివారు విటమిన్ సి అధికంగా ఉండే పోషకాహారం తినాలి. ఆహారంలో భాగంగా తృణధాన్యాలు తీసుకోవాలి. తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్, తీసుకోవడం కూడా బెటర్.

పోషకాలున్న ఈస్ట్:
ఈస్ట్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్ ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Also Read:  ఇలా చేస్తే.. ఈజీగా బరువు తగ్గుతారు తెలుసా ?

సోయా పనీర్:
సోయాతో చేసే పదార్థాల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. దీనిని బీన్ పెరుగు అని కూడా పిలుస్తారు. చపాతి, అన్నంలోకి ఇది రుచిగా ఉంటుంది. నూనెలో వేయించి సలాడ్ లాగా కూడా కలిపి తీసుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

Big Stories

Advertisement
×