BigTV English

Elephants kills oldman: స్నానం చేసి వెళ్తుండగా వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు.. తీవ్ర గాయాలతో మృతి

Elephants kills oldman: స్నానం చేసి వెళ్తుండగా వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు.. తీవ్ర గాయాలతో మృతి

Elephants kills oldman in Manyam: ఏపీలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అవి దాడి చేయడంతో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాటి నుంచి తమను రక్షించాలంటూ వారు వేడుకుంటున్నారు. ఏపీలోని మన్యం జిల్లా కొమరాడ మండలంలోని వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలపై పడి వాటిని పాడు చేస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా అవి దాడి చేస్తున్నాయి. ఓ వృద్ధుడిపై అవి దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా ఉన్న వాగులో స్నానం చేసి, తిరిగి ఇంటికి వెళ్తుండగా అవి దాడి చేశాయి.


Also Read: తిరుపతికి వెళ్తున్నారా ? టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతను గమనించలేకపోయాడు. దారిలో వెళ్తుండగా ఏనుగులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అయితే, ఇటీవలే కాలంలో మన్యం జిల్లాలో ఏనుగుల దాడులు తరుచూ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×