E-Paper
Advertisement

ఒకే గర్భంలో ఒకేసారి పుట్టిన ఇద్దరు అమ్మాయిలకు తండ్రులు వేరు.. ఆ రహస్యం తెలిసి అందరూ షాక్

ఒకే గర్భంలో ఒకేసారి పుట్టిన ఇద్దరు అమ్మాయిలకు తండ్రులు వేరు.. ఆ రహస్యం తెలిసి అందరూ షాక్
Advertisement

Twin Sisters Different Fathers DNA Test: ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఊహంకందని ఒక వింత నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. 49 ఏళ్ల వయసు గల ఇద్దరు కవల సోదరిల జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. వారిద్దరూ ఒకే తల్లి గర్భంలో పుట్టినా వారి తండ్రులు వేరని తాజాగా తెలిసింది. ఒస్బోర్న్ బ్రిటన్‌కు మిషెల్, లావినియా ఇద్దరు సిస్టర్స్.. కవలలు. చూడడానికి కూడా ఒకే రూపంలో ఉంటారు. అయితే ఈ ఇద్దరు మహిళలు ఇటీవలే డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోగా.. ఆ పరీక్షల్లో వారికి తమ తండ్రులు వేరని తెలిసింది.

డిఎన్ఏ పరీక్షలు ఎందుకు చేయించుకున్నారు

మిషెల్‌కు తన తండ్రి జేమ్స్ గురించి చాలా సందేహాలు ఉండేవి. ఆమె డీఎన్‌ఏ కిట్ తీసుకొని ఇంట్లోనే టెస్ట్ చేసింది. పరీక్ష ఫలితం షాక్ ఇచ్చింది. జేమ్స్ తన బయోలాజికల్ ఫాదర్ కాదని తెలిసింది. ఈ విషయం తన సోదరి లావినియాకు చెప్పగా.. తర్వాత లావినియా కూడా పరీక్ష చేయించుకుంది. అయితే లావినియా టెస్ట్‌లో కూడా తన తండ్రి జేమ్స్ కాదని తేలింది. అయినా రిపోర్ట్ లో ఇద్దరూ ఒక తల్లికి మాత్రమే పుట్టారని తేలింది. అంటే ఇద్దరూ వేర్వేరు తండ్రుల బిడ్డలని నిర్ధారణ అయింది.

హెటెరోపేటర్నల్ సూపర్‌ఫెకండేషన్ అంటే ఏమిటి?

Advertisement

ఈ అరుదైన పరిస్థితిని వైద్యులు హెటెరోపేటర్నల్ సూపర్‌ఫెకండేషన్ అంటారు. ఒక్క మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఒక మహిళ గర్భంలో సాధారణంగా ఒకే గుడ్డు ఫలదీకరణ కోసం విడుదలవుతుంది. కానీ చాలా అరుదుగా ఒకేసారి రెండు గుడ్లు విడుదలవుతాయి. రెండు గుడ్లు వేర్వేరు పురుషుల స్పెర్మ్‌తో ఫలదీకరణం చెందుతాయి. దీంతో కవలలు వేర్వేరు తండ్రులతో పుడతారు. ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 కంటే తక్కువ సంఖ్యలో మాత్రమే నమోదు అయ్యాయి.

ఇద్దరు కవలలు వేర్వేరు తండ్రులతో పుట్టడం చాలా అరుదు ఎందుకంటే

ఒక స్త్రీ ఒకేసారి రెండు గుడ్లు విడుదల చేయాలి. ఆ తరువాత ఆమెకు గుడ్లు ఫలదీరణ చెందే కాలంలో వేర్వేరు పురుషులతో సంబంధం ఉండాలి. రెండు గుడ్లు విజయవంతంగా ఫలదీకరణం చెందాలి. ఆ తర్వాత ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా పుట్టాలి, పెరగాలి. ఈ అంశాలన్నీ కలిసి జరగడం చాలా అరుదు. దాదాపు అసాధ్యం.

Advertisement

Also Read: ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్య సమస్యలు.. వేసవిలో యమ డేంజర్

మానసిక ప్రభావం

డీఎన్‌ఏ ఫలితాలు చూసి కవల సిస్టమర్స్ లావినియా, మిషెల్ ముందుగా గందరగోళానికి గురయ్యారు. ఆ పరీక్షలు వైద్య నిపుణులతో నిర్ధారణ చేసుకోగా.. మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ వారి మధ్య బంధం బలంగా ఉంది. వారు ఇప్పటికీ తమ మధ్య విభేదాలు రానివ్వలేదు. తమను తాము “మిరాకిల్స్” అని చెప్పుకుంటున్నారు. ఆ తరువాత లావినియా తన బయోలాజికల్ ఫాదర్ ఆర్థర్‌ గురించి తెలుసుకొని అతడిని కలిసింది. మిషెల్ తన తండ్రి అలెక్స్‌ను కనుగొంది.

రహస్యం చెప్పకుండానే మరణించిన తల్లి

వారి తల్లి ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ రహస్యం దాదాపు 50 ఏళ్లు దాచి ఉంచింది. తల్లి డీఎన్‌ఏ నిర్ధారణల ముందే మరణించింది. సోదరీలు ఆమెను నేరుగా అడగలేకపోయారు.

డీఎన్‌ఏ టెక్నాలజీ కుటుంబాలను మారుస్తోంది

హోమ్ డీఎన్‌ఏ కిట్లు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో వచ్చాయి. పాశ్చాత్య దేశాల్లో ఈ డీఎన్ఏ టెస్టుల వల్ల వివాహేతర సంబంధాలు బయటపడుతున్నాయి. కుటుంబ కలహాలకు కారణమవుతున్నాయి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×