E-Paper
Advertisement

Type 1 Diabetes: పిల్లల్లో వచ్చే టైప్ 1 మధుమేహం, ఇది ఎందుకు వస్తుంది?

Type 1 Diabetes: పిల్లల్లో వచ్చే  టైప్ 1 మధుమేహం, ఇది ఎందుకు  వస్తుంది?
Advertisement

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. ఇందులో రెండు ప్రధాన రకాలుగా టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉంటాయి. వీటిలో టైప్ 1 మధుమేహం చాలా ప్రత్యేకమైనది. దీని కారణాలు, లక్షణాలు, చికిత్స తీరు టైప్ 2 కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎక్కువ మంది దీనిపై సరిగ్గా అవగాహన ఉండదు.

టైప్ 1 మధుమేహం అంటే ఏమిటి?
టైప్ 1 మధుమేహం అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున పాంక్రియాస్‌లోని బీటా సెల్స్ అనే కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది. ఈ బీటా సెల్స్ శరీరానికి అవసరమైన ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ శరీరంలో రక్తంలో ఉండే చక్కెరను కణాల లోపలకి తీసుకెళ్లి శక్తిగా మార్చే పని చేస్తుంది. ఈ ఇన్సులిన్ లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయి. అందుకే టైప్ 1 మధుమేహాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని కూడా అంటారు.

Advertisement

ఈ వ్యాధి ఎవరికి వస్తుంది?
సాధారణంగా ఇది బాల్యంలో లేదా యవ్వనంలో బయటపడుతుంది. అంటే రెండేళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య కనిపిస్తుంది. అయితే అరుదుగా పెద్దవారిలో కూడా కనిపించే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికైనా ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉంటే ప్రమాదం కొంచెం ఎక్కువ. ఇది జీవనశైలి వల్ల కాకుండా జన్యుకారణాలు, ఇమ్యూన్ సిస్టమ్ లోపాలు వల్లే వస్తుంది.టైప్ 1 మధుమేహం ఊబకాయం, ఎక్కువ తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల రాదు. ఇవన్నీ టైప్ 2 మధుమేహం రావడానికి కారణాలుగా చెప్పుకుంటారు.

టైప్ 1 ఎందుకు వస్తుంది?
నిపుణుల ప్రకారం టైప్ 1 మధుమేహానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. జన్యు కారణాలు అంటే తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇమ్యూన్ సిస్టమ్ లోపం అంటే.. శరీరం సొంత కణాలపై దాడి చేయడం, చిన్న వయసులో వచ్చే కొన్ని వైరల్ జ్వరాలు బీటా సెల్స్‌ను దెబ్బతీసినప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. టైప్ 1 వచ్చిన తర్వాత శరీరం ఇన్సులిన్ తయారు చేసుకోలేదు.

Advertisement

టైప్ 1 మధుమేహం లక్షణాలు
తరచూ మూత్రం పోవడం
ఎంత నీరు తాగినా దాహం తగ్గకపోవడం
బరువు ఒక్కసారిగా తగ్గడం
చాలా అలసట, బలహీనత
చూపు మసకబారడం
ఆకలి ఎక్కువగా ఉండటం
చిన్న పిల్లల్లో మంచం తడపడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

ఇది ప్రమాదకరమా?
చికిత్స లేకపోతే టైప్ 1 మధుమేహం చాలా ప్రమాదకరం. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమై డయాబెటిక్ కీటో ఆసిడోసిస్ (DKA) అనే ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. టైప్ 1 మధుమేహానికి పూర్తిగా నయం చేసే చికిత్స లేనప్పటికీ సరైన చికిత్సతో జీవితాన్ని పూర్తిగా సాధారణంగా కొనసాగించవచ్చు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు రోజూ తీసుకోవాలి. చక్కెర స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలి. సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం వంటివి చేయాలి.

టైప్ 1 మధుమేహం ఉన్నవారు పాఠశాల, ఉద్యోగం, ఆటలు ఇతర కార్యకలాపాలు అన్నీ సాధారణంగా చేయవచ్చు. అయితే ఇన్సులిన్‌ను సమయానికి తీసుకోవడం, ఆహార నియంత్రణ పాటించడం తప్పనిసరి.

Related News

మిల్లీనియల్స్ పురుషులను ఇష్టపడుతున్న జెన్ Z అమ్మాయిలు.. కారణాలు ఇవే

30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే చర్చించకపోతే జీవితాంతం పశ్చాత్తాపమే!

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

Big Stories

Advertisement
×