E-Paper
Advertisement

Human life 150 Years: మనిషి 150 ఏళ్లు జీవించడం సాధ్యమే.. కొత్త పిల్ కనిపెట్టిన చైనా

Human life 150 Years: మనిషి 150 ఏళ్లు జీవించడం సాధ్యమే.. కొత్త పిల్ కనిపెట్టిన చైనా

Human life 150 Years| ఎక్కువ కాలం జీవించాలనే ప్రతి మనిషి కోరుకుంటాడు. అందుకే మనిషి జీవితకాలం పెంచే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోగాలు నిరంతరం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా బయోటెక్ కంపెనీ లాన్వీ బయోసైన్సెస్ (Lonvi Biosciences) ఒక అద్భుత ప్రకటన చేసి ప్రపంచ శాస్త్రవేత్తలను షాకిచ్చింది. మనుషులు 150 ఏళ్ల వరకు జీవించవచ్చని ఈ కంపెనీ సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రస్తుతం సమయంలో మనిషి జీవించే సగటు ఆయుష్షు 65-70 ఏళ్ల మధ్య ఉండగా.. చైనా కంపెనీ చేసిన దావా దీనికి రెండింతలు. ఈ కంపెనీ ఒక పిల్ (మాత్ర) కనిపెట్టింది. ఆ పిల్ ద్వారా ఆయుష్షు పెరుగుతుందని కంపెనీ చెప్పింది. అదే నిజమైతే మానవ జీవితం పూర్తిగా మారిపోతుంది. అయితే లాన్వీ కంపెనీ చేసిన దావా ఇంకా పూర్తి స్థాయిలో ధృవీకరణ కాలేదు. కానీ ప్రయోగాలు దాదాపు విజయవంతమయ్యాయి.

ఈ దీర్ఘాయుష్షు మాత్ర ఎలా పనిచేస్తుంది?

మనిషి శరీరంలో సెల్యులర్ స్థాయిలో వయసు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వృద్ధాప్యం వస్తుంది. ఆ తరువాత మరణం సంభవిస్తుంది. ఇప్పుడు చైనా పిల్ ఈ వృద్ధాప్యాన్ని కలుగజేసే సెల్స్‌ని లక్ష్యంగా చేసుకుంటుంది. మన శరీరంలో “జాంబీ సెల్స్” అని పిలువబడే మరణించని వృద్ధ కణాలు ఉంటాయి. ఇవి వాపు (ఇన్‌ఫ్లమేషన్) కలిగించి, వృద్ధాప్య సమస్యలకు కారణమవుతాయి. ఈ మాత్ర ఆ హానికర కణాలను తొలగిస్తుంది. ఫలితంగా ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.

మాత్రలో ఏముంది?

మాత్రలోని ముఖ్యంగా ప్రొసయానిడిన్ సి1 (Procyanidin C1 – PCC1) ఉంటుంది. ఇది ద్రాక్ష గింజల నుంచి సహజంగా లభిస్తుంది. ఇది యాంటీ-ఏజింగ్ లక్షణాలు కలిగి, వృద్ధ కణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. సహజ మూలాల నుంచి వచ్చినందున ఇది సురక్షితమైనది.

ఎలుకలపై ప్రయోగాలు

ఎలుకలపై జరిపిన ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రయోగం చేసిన ఎలుకలు సాధారణంగా 9.4% ఎక్కువ కాలం జీవించాయి. చికిత్స ప్రారంభమైన తర్వాత మిగిలిన ఆయుష్షు 64% వరకు పెరిగింది. ఇది పరిశోధకులను ఆకట్టుకుంది. అయితే మనుషులపై పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు.

150 ఏళ్లు జీవించడం సాధ్యమే

కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ల్యూ ఖింగ్‌హువా (Lyu Qinghua)కు తమ టెక్నాలజీపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. “150 ఏళ్లు జీవించడం సాధ్యమే. త్వరలోనే ఇది నిరూపితమవుతుంది.” అని ఆయన చెప్పారు. కంపెనీ వృద్ధాప్య చికిత్సను మార్చే లక్ష్యంతో పరిశోధనలు కొనసాగిస్తామన్నారు.

ప్రయోగాలకు పెట్టుబడులు

చైనాలో దీర్ఘాయుష్షు పరిశోధనలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం చైనా పౌరుల సగటు ఆయుష్షు 79 ఏళ్లు – ప్రపంచ సగటుకంటే 5 ఏళ్లు ఎక్కువ. ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతంలో వృద్ధాప్య ప్రయోగాలకు అమెరికన్ ధనవంతులకు మాత్రమే పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పుడు చైనా ప్రజలు స్వయంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇది చాలా పెద్ద మార్పు.

శాస్త్రవేత్తల హెచ్చరిక

మనిషి జీవితకాలం పెంచే ప్రయోగాల ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాలు వాటి ఫలితాలు ప్రాథమిక సంకేతాలు మాత్రమే. మానవ పరీక్షలు అవసరం. డోసేజ్ చాలా కచ్చితంగా ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్, దీర్ఘకాలిక ప్రభావాలు తెలుసుకోవాలి. దీనికి సంవత్సరాలు పడుతుంది. రెగ్యులేటరీ అనుమతులు తప్పనిసరి.

ప్రయోగం విజయవంతమైతే సమాజంలో అతిపెద్ద మార్పు

ఈ పిల్ చాలా పెద్ద ఆవిష్కరణ. లాన్వీ దావా నిజమైతే మానవ జాతి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది! ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. ఆరోగ్య వ్యవస్థలు, రిటైర్మెంట్ వయస్సు, జనాభా డైనమిక్స్, ఆర్థిక మోడల్స్ – అన్నీ తలకిందులవుతాయి. భవిష్యత్తులో సెల్యులర్ రిపేర్, జెనెటిక్ మార్పులు, కాంబినేషన్ థెరపీలు వంటి బహుళ మార్గాలు అన్వేషిస్తున్నారు. వృద్ధాప్య పరిశోధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Also Read: ఏఐ పవర్.. 2030 నాటికి మానవులు మృత్యువుని జయించగలరు.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

Related News

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

Big Stories

×