E-Paper
Advertisement

Vankaya Pulusu: ఆంధ్రా స్టైల్ వంకాయ పులుసు.. పాతకాలపు కమ్మని రుచి ఆస్వాదించండి

Vankaya Pulusu: ఆంధ్రా స్టైల్ వంకాయ పులుసు.. పాతకాలపు కమ్మని రుచి ఆస్వాదించండి
Advertisement

Vankaya Pulusu: ఆంధ్ర వంటకాలంటే ముందుగా గుర్తొచ్చేది ఘాటైన కారం, అద్భుతమైన పులుపు, కమ్మని తీపి కలగలిపిన ప్రత్యేక రుచి. అందులోనూ వంకాయ పులుసు అనేది కేవలం వంటకం కాదు, మన సంప్రదాయ భోజనానికి అలంకారం. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ వంకాయ పులుసు వేసుకుని తింటే… ఆ రుచి అమోఘం. మాంసం తినని వారికి వంకాయను ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ వంకాయ పులుసును ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పులుసు కోసం కావాల్సిన పదార్థాలు :
వంకాయలు5-6 చిన్నవి
ఉల్లిపాయ- 1 మీడియం సైజు
పచ్చిమిర్చి3-4
చింతపండు- నిమ్మకాయంత సైజు
బెల్లం/షుగర్1-2 టీస్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
కారం1- స్పూన్
పసుపు- 1/2 టీన్
కొత్తిమీర- గార్నిష్ కోసం

Advertisement

తాలింపు కోసం: నూనె- 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు1/2 టీన్లు, జీలకర్ర- 1/2 టీస్పూన్లు,మెంతులు- 1/4 టీస్పూన్, ఎండుమిర్చి- 2-3, కరివేపాకు- 1 రెబ్బ, ఇంగువ – చిటికెడు

తయారీ విధానం :
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, తొడిమలు తీయకుండా నాలుగు భాగాలుగా ట్ చేయాలి. లేదంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో ఉప్పు వేసి, వంకాయ ముక్కలను వేయాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి.

Advertisement

పులుసు :
ఒక మందపాటి గిన్నె లేదా కడాయి తీసుకుని నూనె వేయండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాలి. ఉప్పు నీటిలోంచి వంకాయ ముక్కలను తీసి, నూనెలో వేసి సుమారు 5 నిమిషాలు మీడియం మంటపై మగ్గించాలి. వంకాయలు కొద్దిగా మెత్తబడాలి.ఇప్పుడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వంకాయ మిశ్రమంలో పోయాలి. పులుసు మరుగుతుండగా, బెల్లం లేదా చక్కెర వేసి బాగా కలపాలి. బెల్లం పులుపును సమతుల్యం చేసి పులుసుకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. పులుసును మూతపెట్టకుండా.. 10-15 నిమిషాలు మీడియం మంటపై మరిగించాలి. పులుసు చిక్కబడి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఈ దశలో రుచి చూసి, ఉప్పు లేదా పులుపు సరిచేసుకోవచ్చు.

తాలింపు:
చిన్న మూకుడిలో నూనె వేసి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపును వెంటనే ఉడికిన వంకాయ పులుసులో వేసి కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే, కమ్మని ఆంధ్ర స్టైల్ వంకాయ పులుసు సిద్ధం.

ఈ వంకాయ పులుసు వేడి అన్నంతో పాటు ఆవకాయ లేదా పచ్చిమిర్చి పచ్చడితో జతగా అద్భుతంగా ఉంటుంది.

Related News

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Big Stories

Advertisement
×