E-Paper
Advertisement

Jabardast : ఓర్నీ.. ఇదేం క్రేజ్ మామా.. జబర్దస్త్ లోకి చుప్పాక్ జోడి ఎంట్రీ..

Jabardast : ఓర్నీ.. ఇదేం క్రేజ్ మామా.. జబర్దస్త్ లోకి చుప్పాక్ జోడి ఎంట్రీ..
Advertisement

Jabardast : సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులర్ అవుతూ వస్తుంటారు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ కొన్ని రోజుల్లోనే పాపులర్ అయ్యి, సినిమాల్లో, సీరియల్స్ లలో, బుల్లితెరపై ప్రసారమవుతున్న షో లలో చోటు సంపాదించుకుంటున్నారు.. ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ షో లోకి ఎంట్రీ ఇచ్చారు. టిక్ టాక్ దుర్గారావు తో పాటుగా మరికొంతమంది జబర్దస్త్ లోకి అడుగుపెట్టి బాగా ఫేమస్ అయ్యారు. తాజాగా మరో జంట జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ జంట మరెవ్వరో కాదు.. చుప్పాక్ మ్యూజిక్, పాటతో బాగా ఫెమస్ అయిన  భావన రామ్.. ఈ జంట ఇటీవలే యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ పాటతో మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వీళ్ళ వీడియోలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.. ఇప్పుడు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చారా? లేదా జబర్దస్త్ లో కమెడియన్ గా స్కిట్ చేయడానికి వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.. ఇప్పుడు ఈ జంట ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో ని తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

జబర్దస్త్ లోకి చూప్పాక్ జోడి ఎంట్రీ.. 

ఒకప్పుడు జబర్దస్త్ షో ని చూసేందుకు జనాలు ఆసక్తి కనపరిచేవారు. కానీ ఈ మధ్య మాత్రం జబర్దస్త్ షోని జనాలు చూసేందుకు ఆసక్తి కనబరచట్లేదు.. ఈమధ్య ఈ షోపై ఆసక్తి కలిగించేందుకు జబర్దస్త్ టీం పాపులర్ అయిన యూట్యూబ్ జంటల్ని జబర్దస్త్ లోకి తీసుకొని వస్తున్నారు. దుర్గారావు, ఉప్పల్ బాలు వంటి వాళ్లను షో లోకి తీసుకొని వచ్చారు. అయితే కొత్తగా వచ్చిన వాళ్ల ఎపిసోడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.. దాంతో ఈసారి జబర్దస్త్ లోకి చుప్పాక్ జోడి భావన రామ్ తీసుకుని వచ్చారు.. జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో వెళ్లిపోతానన్న టీమ్ లీడర్లు కొంతమంది కనిపించగా.. కొత్తగా కొంతమంది షోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ జంటే వీడియోలే కనిపిస్తున్నాయి.. ఈ జంట అదిరిపోయే డ్యాన్స్ తో జబర్దస్త్ స్టేజ్ ను షేక్ చేశారు. ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read : కోడలిపై వేదవతి ప్రశంసలు.. ప్రేమకు ఘోర అవమానం.. నిజం తెలుసుకున్న ధీరజ్..

జబర్దస్త్ ప్రోమో హైలెట్స్.. 

బుల్లితెర టాప్ కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ గా నిలిచిన ఈ షో.. ఇప్పుడు ఏదో మొక్కుబడిగా సాగుతుంది. ఈ మధ్య మాత్రం షో రేటింగ్ ను పెంచుకొనేందుకు కొత్తగా కంటెంట్ ను క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు కొత్త వాళ్లను షోలోకి తీసుకొని వస్తున్నారు. తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నూకరాజు టీమ్ లోకి చుప్పాక్ జోడి ఎంట్రీ ఇచ్చారు. నూకరాజు టీమ్‌లో ఈ జోడి వచ్చి అదే లెవల్లో మ్యూజిక్ కొట్టారు. మరోవైపు ఆటో రాంప్రసాద్ టీమ్‌లో కూడా వైరల్ అయిన ఇంకొన్ని ఫేసులు కనిపించాయి.. నిజానికి ఈ ప్రోమో మొత్తంలో కాస్తో కూస్తో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నది మాత్రం రాజీవ్ కనకాల చేసిన స్కిట్‌యే. రాకెట్ రాఘవ చేసిన స్కిట్‌లో రాజీవ్ చిన్న రోల్ చేశారు. తన భార్య సుమపై నాలుగైదు పంచులు కూడా వేశారు. ఈ ప్రోమో పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైన ఈ ప్రోమో పర్వాలేదు.. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి…

Advertisement

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×