E-Paper
Advertisement

Vitamin C serum: స్కిన్ వైటనింగ్ Vs బ్రైటనింగ్.. విటమిన్ సి సీరమ్ మీ చర్మంపై ఎలా పనిచేస్తుంది?

Vitamin C serum: స్కిన్ వైటనింగ్ Vs బ్రైటనింగ్.. విటమిన్ సి సీరమ్ మీ చర్మంపై ఎలా పనిచేస్తుంది?
Advertisement

Vitamin C serum: నేటి కాలంలో చర్మ సౌందర్యం కోసం విటమిన్ సి సీరమ్ వాడటం ఒక ట్రెండ్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో దీనిని వాడితే చర్మం తెల్లగా మారుతుందని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే..’ఫెయిర్‌నెస్’ , ‘గ్లోయింగ్ స్కిన్’ మధ్య చాలా తేడా ఉంది. విటమిన్ సి సీరమ్ నిజానికి చర్మం రంగును మారుస్తుందా? లేక చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగించి సహజ సిద్ధమైన కాంతిని ఇస్తుందా? అనే సందేహాలకు సమాధానాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ సి అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మన చర్మాన్ని పర్యావరణ కాలుష్యం, సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుంచి కాపాడుతుంది. అయితే ఇది చర్మాన్ని ‘తెల్లగా’ మారుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు.. ఇది చర్మంపై ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి.

Advertisement

1. మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది:
మన చర్మం రంగు ‘మెలనిన్’ అనే పిగ్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఎండలో తిరిగినప్పుడు లేదా హార్మోన్ల మార్పుల వల్ల మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మం నల్లగా మారుతుంది. విటమిన్ సి సీరమ్ ఈ మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించే ‘టైరోసినేస్’ అనే ఎంజైమ్‌ను అడ్డుకుంటుంది. దీని వల్ల నల్లటి మచ్చలు, మొటిమల తాలూకు గుర్తులు తగ్గి చర్మం సమానంగా కనిపిస్తుంది.

2. ఫెయిర్‌నెస్ వర్సెస్ బ్రైటనింగ్:
చాలా మంది పొరబడే విషయం ఇక్కడే ఉంది. విటమిన్ సి సీరమ్ మీ పుట్టుకతో.. వచ్చిన చర్మం రంగును మార్చి మిమ్మల్ని తెల్లగా చేయదు. అంటే.. ఇది ‘బ్లీచింగ్ ఏజెంట్’ కాదు. ఇది చర్మంపై ఉన్న ట్యాన్ , మృతకణాలు, మచ్చలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. దీని వల్ల ముఖం మునుపటి కంటే కాంతివంతంగా కనిపిస్తుంది తప్ప, రంగు మారడం జరగదు.

Advertisement

3. కొల్లాజెన్ ఉత్పత్తి, యాంటీ ఏజింగ్:
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం తన బిగువును కోల్పోతుంది. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మంపై ముడతలు, సన్నని గీతలను తగ్గించి, చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. సోషల్ మీడియాలో చెప్పే ‘గ్లో’ వెనక ఉన్న అసలు రహస్యం ఇదే.

4. ఇది కేవలం సోషల్ మీడియా మిత్ ?
సోషల్ మీడియాలో విటమిన్ సి వాడగానే రాత్రికి రాత్రే తెల్లగా అయిపోతారని చూపే వీడియోలు ఖచ్చితంగా మిత్ (అబద్ధం). కానీ.. విటమిన్ సి ఇచ్చే ప్రయోజనాలు మాత్రం నిజం. కాకపోతే.. ఫలితాలు కనిపించడానికి కనీసం 4 నుంచి 8 వారాల క్రమబద్ధమైన వాడకం అవసరం.

Also Read: జుట్టు రాలడం ఆగిపోవాలంటే.. చియా సీడ్స్ ఇలా తింటే చాలు !

ఎలా వాడాలి ?
సమయం: విటమిన్ సి సీరమ్‌ను ఉదయం పూట వాడటం ఉత్తమం. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

సన్‌స్క్రీన్ తప్పనిసరి: విటమిన్ సి రాసుకున్న తర్వాత తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడాలి. లేకపోతే చర్మం సున్నితంగా మారి త్వరగా నల్లబడే అవకాశం ఉంటుంది.

శాతాన్ని గమనించండి: కొత్తగా వాడేవారు 10% గాఢత ఉన్న సీరమ్‌తో ప్రారంభించి, నెమ్మదిగా 20% వరకు పెంచుకోవచ్చు.

Related News

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

Big Stories

Advertisement
×