E-Paper
Advertisement

సైట్ పెరుగుతోందని చెప్పే 10 వార్నింగ్ సైన్స్.. వెంటనే చెక్ చేసుకోండి!

సైట్ పెరుగుతోందని చెప్పే 10 వార్నింగ్ సైన్స్.. వెంటనే చెక్ చేసుకోండి!
Advertisement

Eyesight: ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌లు, లాప్‌టాప్‌లు, టీవీ స్క్రీన్‌ల ముందే మన రోజంతా గడిచిపోతోంది. డిజిటల్ లైఫ్‌స్టైల్ వల్ల చాలా మందిలో చిన్న వయసులోనే కంటి చూపు మందగించడం సర్వ సాధారణమైపోయింది. అయితే చూపు ఒక్కసారిగా పోదు, మన కళ్ళు ముందే కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపుతాయి. సరైన సమయంలో ..వాటిని గుర్తించి డాక్టర్‌ను సంప్రదిస్తే చూపును కాపాడుకోవచ్చు. మరి మీ కంటి చూపు తగ్గుతోందని చెప్పే ఆ 10 ముఖ్యమైన వార్నింగ్ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

1. బ్లర్ విజన్ (మసకబారిన చూపు):
దూరంగా ఉన్న బోర్డులు,వెహికిల్ నంబర్లు లేదా దగ్గరగా ఉన్న పుస్తకంలోని అక్షరాలు సరిగ్గా కనిపించకుండా మసకగా అనిపిస్తే మీ చూపు మందగిస్తుందని అర్థం.

Advertisement

2. తరచుగా తలనొప్పి రావడం:
మీరు చదివేటప్పుడు లేదా స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు కళ్ళపై ఒత్తిడి పడి తరచుగా నుదిటి భాగంలో లేదా కళ్ళ వెనక తలనొప్పి వస్తుంటే వెంటనే ఐ చెకప్ చేయించుకోవాలి.

3. కళ్ళు చిన్నవి చేసి చూడటం:
ఏదైనా వస్తువు లేదా అక్షరాలు స్పష్టంగా కనిపించనప్పుడు కళ్ళు చిన్నవి చేసి, నొసలు ముడిచి చూస్తున్నారా ? అయితే మీ చూపు మారడానికి ఇది స్పష్టమైన సంకేతం.

Advertisement

4. నైట్ విజన్ తగ్గడం:
చీకట్లో లేదా రాత్రి వేళ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లైట్ల కాంతి విపరీతంగా అనిపించడం, రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం.. లేదా చీకటికి కళ్ళు అలవాటు పడటానికి సమయం పట్టడం చూపు తగ్గుదల లక్షణం.

5. లైట్ల చుట్టూ కాంతి వలయాలు:
రాత్రి వేళ బల్బులు లేదా స్ట్రీట్ లైట్ల చుట్టూ రంగురంగుల కాంతి వలయాలు కనిపిస్తే అది కంటి ఒత్తిడికి లేదా గ్లాకోమా/కంటి పొరలకు సంకేతం కావచ్చు.

6. పుస్తకాలు/ఫోన్ :
చదివేటప్పుడు ఫోన్‌ను లేదా పుస్తకాన్ని కళ్ళకు బాగా దగ్గరగా పెట్టుకోవడం లేదా మరీ దూరంగా జరిపి చూడాల్సి రావడం మీ సైట్ మారడానికి మరో సంకేతం.

7. కంటి అలసట & పొడిబారడం:
కొద్దిసేపు స్క్రీన్ చూసినా కళ్ళు బాగా అలసిపోవడం, ఎర్ర బడటం, నీరు కారడం లేదా పొడి బారినట్లు అనిపించడం డిజిటల్ ఐ స్ట్రెయిన్ లక్షణం.

8. రెండింటిలా కనిపించడం:
ఒకే వస్తువును చూస్తున్నప్పుడు అది రెండుగా కనిపిస్తుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కంటి నరాల సమస్యకు లేదా కంటి కండరాల బలహీనతకు సూచన.

9. వెలుగును తట్టుకోలేకపోవడం:
సూర్యకాంతిలోకి వెళ్లినప్పుడు లేదా రూమ్‌లో లైట్ వేసినప్పుడు కళ్ళు మంటగా అనిపించడం, కాంతిని తట్టుకోలేక కళ్ళు మూసేయాల్సి రావడం కూడా కంటి సమస్యే.

10. చదివేటప్పుడు వరసలు తప్పిపోవడం:
పుస్తకం లేదా డిజిటల్ స్క్రీన్ పై చదువుతున్నప్పుడు వేలితో పాయింట్ చేయకుండా చదవలేక పోవడం, ఒక లైన్ నుంచి ఇంకో లైన్‌కు వెళ్లేటప్పుడు అక్షరాలు కలగాపులగమైపోవడం కంటి సమన్వయ లోపాన్ని సూచిస్తుంది.

కళ్ళు మన శరీరంలో అత్యంత సున్నితమైన, కీలకమైన అవయవాలు. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవి కనిపించినా సొంత వైద్యం చేయకుండా వెంటనే కంటి డాక్టర్ ని సంప్రదించి ఐ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం!

Tags

Related News

చిన్న పిల్లలు నిద్రలో ఎందుకు నవ్వుతారు? దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

డిటాక్స్ జ్యూస్‌లు వద్దే వద్దు.. గట్ హెల్త్ మెరుగుపరిచే సింపుల్ చిట్కాలు!

ఇళ్ల గోడలకు పైన తెలుపు.. కింద ఎరుపు రంగు ఎందుకు? దాని వెనుక అసలు రహస్యం ఇదే

బిర్యానీ డెలివరీకి వెళ్తే.. సీఈఓ కుర్చీలో కూర్చోబెట్టారు.. ఆ తర్వాత ఏమైందంటే?

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం.. ఈ 5 సంకేతాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు

జబ్బలు లూజ్‌గా ఉన్నాయని స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించడం లేదా.. ఈ వ్యాయామాలు చేస్తే టోన్డ్ షేప్

జలుబుతో ముక్కు మూసుకుపోయిందా.. శ్వాస తీసుకునేందుకు ఈజీ టిప్స్

Big Stories

Advertisement
×