E-Paper
Advertisement

Health Tips: వారాల తరబడి బ్రాలను ఉతక్కుండా వాడితే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరికలు ఇవే!

Health Tips: వారాల తరబడి బ్రాలను ఉతక్కుండా వాడితే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరికలు ఇవే!
Advertisement

Health Tips: చాలామంది స్త్రీలు చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే.. రోజూ ధరించే ‘బ్రా’ల విషయంలో అజాగ్రత్తగా ఉండటం. ఇది బయటికి కనిపించేది కాదు కదా.. ఒక్కసారి వేసుకుంటే ఏం జరుగుతుంది? అనే చిన్న నిర్లక్ష్యంతోనే వారాల తరబడి అదే బ్రాను వాడేస్తుంటారు. అయితే ఈ చిన్న అలవాటే పెద్ద సమస్యలకు దారితీస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ ఉతకని బ్రాలతో కేవలం అసౌకర్యమే కాదు.. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్నారు.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు:

బ్రాలు శరీరంలోని అత్యధికంగా చెమట వచ్చే ప్రాంతాన్ని తాకుతాయి. చెమటతో పాటు ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్ బ్రా ఫ్యాబ్రిక్‌లో పేరుకుపోతాయి. ఇదంతా బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా దురద, రాషెస్, ఎర్రగా కమిలిపోవడం, చర్మంపై మంట వంటి సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చే అవకాశముందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.

Advertisement

Read Also: పదే పదే ఆలోచనల్లో పడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్స్‌ ట్రై చేయండి, మైండ్ రిఫ్రెష్ అయిపోద్ది!

దీర్ఘకాలం వాడితే..

ఎక్కువ కాలం శుభ్రం చేకుండా వాడే బ్రాలు దుర్వాసనకు కూడా కారణమవుతాయి. దీర్ఘకాలంగా ఇలా వాడితే చర్మం బలహీనపడి అలర్జీలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే సాధారణంగా 2 నుంచి 3 సార్లు వాడిన తర్వాత బ్రాను తప్పకుండా ఉతకాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువ చెమట వచ్చే రోజుల్లో అయితే ప్రతిరోజూ ఉతకడం మరింత మంచిది.

ఉతికే విధానం ఇది:

Advertisement

బ్రాలను ఎలా శుభ్రం చేస్తున్నం అన్నది కూడా ముఖ్యమే. పదే పదే ఉతకడం వల్ల వాటి ఎలాస్టిసిటీ తగ్గి వదులుగా మారుతాయి కాబట్టి రోజూ ఉతకాల్సిన అవసరం లేదు. కాకపోతే చేత్తో మృదువుగా ఉతకడం బ్రాల నాణ్యతను కాపాడుకోవచ్చు. అలాగే ఖరీదైన బ్రాలు త్వరగా పాడవుతాయన్న భయం చాలామందిలో ఉంటుంది. అందుకే రోజుకొక బ్రా వాడుతూ రొటేషన్‌లో పెట్టుకుంటే.. శుభ్రతతో పాటు నాణ్యత కూడా నిలుస్తుంది. ఈ చిన్న అలవాటు మార్పే పెద్ద చర్మ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. శుభ్రమైన బ్రాలు అంటే కేవలం కంఫర్ట్ కాదు.. ఆరోగ్యానికి కూడా అదే బేసిక్ కేర్.

Read Also: వంటింట్లో దాగున్న ఔషధ గని.. ఎంతటి జ్వరమైనా ఇట్టే పారిపోతుంది!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×