E-Paper
Advertisement

OTT Movie : 2025లో అత్యంత ఖరీదైన ఓటీటీ డీల్… ‘పుష్ప 2’ కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన మూవీ మావా

OTT Movie : 2025లో అత్యంత ఖరీదైన ఓటీటీ డీల్… ‘పుష్ప 2’ కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన మూవీ మావా
Advertisement

OTT Movie : భారీ సినిమాలపై అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్ కన్ను ఉంటుంది. పెద్దగా ప్రమోషన్లు అక్కరలేకుండానే ఇలాంటి సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అలాంటి సినిమాలనే సొంతం చేసుకోవడానికి ఓటీటీలు కూడా రెడీగా ఉంటాయి. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ తో మరొకటి పోటీ పడుతూ కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఓటీటీ చరిత్రలో భారీ డీల్ కుదుర్చుకుని, అత్యంత కాస్ట్లీ మూవీగా మారింది ఓ బ్లాక్ బస్టర్ మూవీ. అదే రీసెంట్ గా వచ్చిన ‘ధురంధర్’.

నెట్ ఫ్లిక్స్ భారీ డీల్

రణవీర్ సింగ్ స్పై-థ్రిల్లర్ “ధురంధర్” తక్కువ సమయంలోనే 500 కోట్ల మార్కును అత్యంత వేగంగా నమోదు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించడానికి దగ్గరగా ఉంది. అలాగే ఓటీటీ డీల్ విషయంలో కూడా రికార్డు సృష్టించింది. రణవీర్ సింగ్ చిత్రం ఓటీటీ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సమాచారం ప్రకారం “ధురంధర్” ఇప్పటి వరకు ఓటీటీలో అమ్ముడైన అత్యంత ఖరీదైన ఇండియన్ చిత్రంగా నిలిచింది.

‘పుష్ప 2’ రికార్డు బ్రేక్

Advertisement

నెట్‌ఫ్లిక్స్ “ధురంధర్” ఓటీటీ హక్కులను 285 కోట్లకు కొనుగోలు చేసింనట్టు టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ వార్తలు గనుక నిజమైతే రణవీర్ సింగ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అమ్ముడైన అత్యంత ఖరీదైన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించినట్టే. అలాగే ఈ క్రేజీ ఓటీటీ డీల్ తో “ధురంధర్” మూవీ “పుష్ప 2” సృష్టించిన చరిత్రను తిరగరాసినట్టే. 2024లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వివాదాస్పద మూవీ ‘పుష్ప 2’. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను 275 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే “పుష్ప 2” కంటే “ధురంధర్” కి 10 కోట్లు ఎక్కువే చెల్లించింది నెట్ ఫ్లిక్స్.

Read Also :  8-ఎపిసోడ్‌ల హర్రర్ సిరీస్… IMDbలో 8.4 రేటింగ్‌… కల్లోనూ వెంటాడే రియల్ స్టోరీ

“ధురంధర్” ఓటీటీ రిలీజ్ డేట్

Advertisement

కాగా “ధురంధర్” సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన ఆరు నుండి ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వస్తుంది ఏ మూవీ అయినా. దీన్ని బట్టి లెక్కేస్తే “ధురంధర్” సినిమా 2026 జనవరి చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్‌లోకి రావచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ మూవీ 2026 జనవరి 16 నుంచి 30 మధ్యలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి అనుకున్నట్టుగానే మేకర్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారా ? లేదంటే ఆలస్యం చేస్తారా ? అన్నది వెయిట్ అండ్ సీ.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×