E-Paper
Advertisement

Salt Water bath: స్నానపు నీటిలో ఉప్పు కలపడం వల్ల లాభాలేమిటి?

Salt Water bath: స్నానపు నీటిలో ఉప్పు కలపడం వల్ల లాభాలేమిటి?
Advertisement

మనం స్నానం చేసే నీటిలోకొంచెం ఉప్పు వేసి… ఆ నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది శరీరానికి, అలాగే మనసుకు ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ స్నానపు నీటిలో ఉప్పు కలపడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలేంటో తెలుసుకోండి.

అలసట తగ్గుతుంది
రోజంతా పని చేసి ఇంటికి చేరేసరికి శరీరం విపరీతంగా అలసిపోతుంది. ఇలాంటి సమయంలో ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరానికి రిలాక్స్‌గా అనిపిస్తుంది. కండరాలు గట్టిపడినట్టు ఉన్న ఫీలింగ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు నిలబడి పని చేసే వారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. ఉప్పులో సహజంగానే శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మంపై ఉన్న మట్టి, చెమట సులభంగా తొలగిపోతాయి. చిన్న చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్లు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

Advertisement

చర్మం మృదువుగా మారుతుంది
ఉప్పు స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దాంతో చర్మం శుభ్రపడుతుంది. కొంతమంది చర్మం జిడ్డుగా ఉందని చెబుతూ ఉంటారు. అలాంటి వారికి ఉప్పు నీటితో స్నానం ఉపయోగపడుతుంది. కొందరికి సాయంత్రం అయ్యేసరికి పాదాలలో నొప్పి పెరుగుతుంది. వారు ఉప్పు నీటితో స్నానం చేయడం లేదా పాదాలను ఉప్పు నీటిలో 10 నిమిషాలు నానబెట్టడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

మానసిక ఒత్తిడి తగ్గుతుంది
శరీరంతో పాటు మనసుకు కూడా ఉప్పు నీటి స్నానం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు నరాలలో టెన్షన్‌ను తగ్గిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇది మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఉప్పు నీటి స్నానం చేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుందని నమ్ముతారు. అనేక సంస్కృతుల్లో ఉప్పును శుభ చిహ్నంగా భావిస్తారు. అందువల్ల రోజు గానీ వారం లో కొన్నిసార్లు గానీ ఉప్పు నీటిలో స్నానం చేస్తే మనసు హాయిగా ఉంటుందని అంటారు.

Advertisement

చెమట వాసనకు
కొంతమందికి ఎక్కువగా చెమట పడుతుంది. దాంతో శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. ఉప్పు నీటిలో స్నానం చేయడం వల్ల చర్మం ఫ్రెష్‌గా మారి చెమట వాసన తగ్గుతుంది. రోజూ స్నానం చేసే వాళ్లూ కూడా అప్పుడప్పుడూ ఉప్పు నీటిని వాడితే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. ఉప్పు నీటితో స్నానం చేసేందుకు ఒక బకెట్ గోరువెచ్చని నీటికి ఒకటి లేదా రెండు స్పూన్లు ఉప్పు వేయాలి. బాగా కరిగే వరకు కలపాలి. రోజూ వాడాల్సిన అవసరం లేదు. వారం లో రెండు మూడు సార్లు చేస్తే చాలు. తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్నవారు మాత్రం ముందుగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×