ఎన్టీఆర్ జిల్లా గణపవరంలో బైకుని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు చోదకుడు మిక్కిలి సమీర్ స్పాట్‌లోనే మృతి చెందాడు. జి.కొండూరు మండలం కండ్రిక గ్రామానికి చెందిన సమీర్ పెయింటింగ్ పనికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా ఇండియా పరిశ్రమ సమీపంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయ. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు విచారణ చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కంకరబోడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సోషల్ టీచర్ రవి.. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ కోటయ్య పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విజయ పాల డైరీ సొసైటీ ఎన్నికల విధులకు వెళ్తున్న అధికారుల కిడ్నాప్ కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి జగన్మోహన్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి అనే ఇద్దరు అధికారులను కిడ్నాప్ చేశారు. దాడిని తప్పించుకున్న మిగతా ఇద్దరు అధికారులు ప్రాణ భయంతో ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పేదల సొంతింటి కల నెరవేరింద్నారు ఎమ్మెల్యే కాలే యాదవ్. రంగారెడ్డి జిల్లా గుండాల గ్రామ వాసి మంగళి లక్ష్మమ్మ నూతన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. పేదల సొంతింటి కల నెరవేరిందన్నారు ఎమ్మెల్యే. ఈ పథకం ద్వారా 5 లక్షలు అందిన లబ్ధిదారురాలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ సమీపంలో మోటర్ బైక్ పార్కింగ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు అంబాభవాని జాతర సందర్భంగా శునకాలకు పరుగు పోటీలను నిర్వహించారు. ప్రాంతీయ సంప్రదాయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ పోటీలు ఈసారి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు జిల్లాలోని అనేక గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి ఈ పోటీలను వీక్షించారు. గెలిపొందిన శునకాల యజమానలకు బహుమతులు ప్రదానం చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పర్యటించారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ చేరుకున్న కవితకు నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని నలంద స్కూల్‌లో జరుగుతున్న చిల్డ్రన్స్ డే వేడుకలకు ఆమె హాజరయ్యారు.
బాపట్ల జిల్లా చీరాలలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చీరాలలోని బొమ్మలతోటలో ఓ కొవ్వొత్తుల తయారీకేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఈ ప్రమాదంలో మూడు బైకులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.
సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న భూముల్లో హైటెన్షన్ టవర్ నిర్మాణాన్ని రైతులు అడ్డుకున్నారు. 2017లో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకొని ప్లాట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సూర్యాపేటజిల్లాలో కోదాడ సమీపంలో లారీ వేగంగా దూసుకొని వచ్చి బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ హాస్పటల్‌లో మృతి చెందారు. మృతులు కోదాడ మున్సిపాలిటీ తమ్మరకు చెందిన సిరాజ్‌గా, సైదాలుగా గుర్తించారు. రోడ్డు ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారీలో ఉండగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లా ఎలవెంచరిలో వ్యవసాయ క్షేత్రాలను తెలంగాణ రైతు కమిషన్ బృందం పరిశీలించింది. కౌలు రైతులు కూడా ఉద్యానవన పంటల సాగుతో లాభాలు పొందుతున్నట్లు కౌలు రైతు పద్మనాభన్ వివరించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లిలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. దుంగలను తరలిస్తున్న కారును ఛేజింగ్ చేసి మరీ పట్టుకున్నారు. పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీ అయ్యారు. దీంతో కారు ను కూడా పోలీసులు సీజ్ చేశారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఢిల్లీ పేలుడు ఘటనలో భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా బలగాలు పేల్చివేశాయి. పుల్వామాలోని అతడి ఇంటిని కూల్చివేశారు. నిందితుడు ఉమర్ ఇంటిని ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇటీవలే ‘కె-ర్యాంప్’ చిత్రంతో హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల్ని పలకరించారు. ఇప్పుడాయన నుంచి రానున్న కొత్త సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. దీన్ని దర్శకుడు సాయి రాజేశ్ అందిస్తున్న కథతో రవి నంబూరి తెరకెక్కిస్తున్నారు. ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ కథానాయిక ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి తన కొత్త లుక్‌ని విడుదల చేశారు. గౌరీ ప్రియ ఇందులో నివి అనే పాత్రలో అలరించనున్నట్లు ఆ పోస్టర్‌తో స్పష్టత ఇచ్చారు.
టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడు టెస్టుల్లో టీమ్ ఇండియా తరఫున చివరిసారిగా ఓవల్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ 2023లో కనిపించాడు. తర్వాత అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. మహ్మద్ షమీ ఫిట్‌నెస్ విషయంలో తనకు అప్‌డేట్ లేదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల అన్నాడు. దేశవాళీల్లో మాత్రం షమీ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. అయితే భారత జట్టుకు ఎంపిక విషయంలో షమీకి సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా అన్నాడు.