E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: చిల్డ్రన్స్ డే స్పెషల్.. అమ్మనాన్నను గుర్తు చేసుకుని ఎక్కెక్కి ఏడ్చిన కళ్యాణ్

Bigg Boss 9 Promo: చిల్డ్రన్స్ డే స్పెషల్.. అమ్మనాన్నను గుర్తు చేసుకుని ఎక్కెక్కి ఏడ్చిన కళ్యాణ్
Advertisement

Bigg Boss 9 Telugu Promo 2: గొడవలు, ఆటలు, నవ్వులతో సందడిగా సాగిన బిగ్ బాస్ హౌజ్ లో భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే (Children’s Day 2025) స్పెషల్ సందర్భంగా బిగ్ బాస్ చైల్డ్ హుడ్ మెమోరిస్ కి తీసుకువెళ్లాడు కంటెస్టెంట్స్. వారి చిన్ననాటి ఫోటోలు ముందు పెట్టి వారిని చైల్డ్ గుడ్ కి తీసుకువెళ్లాడు. బాల్యం ప్రతి ఒక్కి జీవితంలో చాలా అందమైన సమయం అంటూ తల్లిదండ్రులతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాడు బిగ్ బాస్. 

మా అమ్మ నా సూపర్ హీరో

Advertisement

తాజాగా విడుదల చేసిన రెండో ప్రొమోలో (Bigg Boss Telugu 9 Second Promo) కంటెస్టెంట్స్ వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. మొదట తనూజ తన తల్లిని గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. నా జీవితంలో నా బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ. నా కంటే ఎక్కువగా నన్ను నమ్మింది తనే. నా వల్ల కాదు అన్న విషయాలను కూడా నువ్వు చేయగలవు అనే ధైర్యం ఇచ్చి పంపించింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటూ మా అమ్మ సావిత్రే. థ్యాంక్యూ అమ్మ.. ఐ లవ్ యూ అంటూ కన్నీరు పెట్టుకుంది.

అన్నయ్య నాకు మరో నాన్న 

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నా లైఫ్ కి మా అన్నయ్య హీరో. మరో నాన్నలా నన్ను పెంచాడు. మా అమ్మకి నన్ను కనడం ఇష్టం లేదు. మాకు చాలా పెదవాళ్లం. తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అందుకే నన్ను కనడానికి ఆమె ఆలోచించింది. కానీ, ప్రతి క్షణం నాతో ఉంటూ నాకు తొడుగా ఉన్నాడు. మరో నాన్నల నన్ను చూసుకున్నాడు. కూలి పనులో 20 మూటలు మోయాల్సి వస్తే.. నన్ను ఐదు మోయనిచ్చేవాడు. తను 15 మూటలు మోసేవాడు అంటూ ఇమ్మూ తన అన్నయ్యతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.

Advertisement

చిన్నతనంలో ఒడిదుడుకులు చూశా

కళ్యాణ్ చిన్నప్పటి నుంచి హాస్టల్ నే పెరిగానని, మా అమ్మ నాన్న ఉన్నది, తిరిగింది తనకు అసలు గుర్తు లేదన్నాడు. అంతేకాదు వారిపై ఉన్న ప్రేమని కూడా ఎప్పుడు ఎక్స్ ప్రెస్ చేయలేదని, బయటకు చూపించడం కూడా నాకు రాదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. నన్ను హాస్టల్ పంపిస్తానంటే వెళ్లను.. మీతోనే ఉంటా అని కూడా మా అమ్మనాన్న చెప్పలేకపోయా. వాళ్లు తీసుకువెళ్తే తీసుకువెళ్లాను. సండే వస్తే అందరికి వాళ్ల తల్లిదండ్రుల నుంచి ఫోన్స్ వచ్చేవి. నాకు కూడా మా అమ్మనాన్న చేస్తారని వార్డెన్ దగ్గరే కూర్చోని ఎదురు చూసేవాడిని. కానీ కొన్ని నెలల వరకు వారి నుంచి నాకు ఫోన్ వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ కళ్యాణ్ ఎక్కెక్కి ఏడ్చాడు. అది విని హౌజ్ లోని మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు.

Also Read: Anchor Rashmi: జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్.. యాంకర్ రష్మి షాకింగ్ ట్వీట్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×