E-Paper
Advertisement

Ginger: ప్రతిరోజూ చిన్న అల్లం ముక్కను తింటే ఎన్ని ప్రయోజనాలో

Ginger: ప్రతిరోజూ చిన్న అల్లం ముక్కను తింటే ఎన్ని ప్రయోజనాలో
Advertisement

మన వంటగదిలో సాధారణంగా ఉపయోగించే వాటిలో అల్లం ఒకటి. అల్లాన్ని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. టీలో లేదా పచ్చడిలో, కూరలో ఎలా తిన్నా అల్లంతో అన్నీ ప్రయోజనాలే దక్కుతాయి. చిన్న మసాలా పదార్థంగా కనిపించే అల్లం, వాస్తవానికి శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే సహజ ఔషధంగా చెప్పుకోవాలి. అల్లం వంటల్లో రుచి పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారికి అల్లం సహాయపడుతుంది. అల్లంలో ఉండే సహజ రసాయనాలు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.

అల్లం ఎందుకు తినాలి?
చలికాలంలో తరచూ వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు అల్లం మంచి ఇంటి వైద్యంగా ఉపయోగపడుతుంది. అల్లం టీ లేదా అల్లం కషాయం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గడంతో పాటు శరీరానికి తాపం అందుతుంది. అలాగే కఫం తగ్గించడంలో కూడా అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ కొద్దిగా అల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణాలు ఉండటంతో శరీరం ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. తరచూ జలుబు, అలసటతో బాధపడేవారు అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో

ప్రయాణ సమయంలో వచ్చే వికారం, వాంతులు తగ్గించడంలో కూడా అల్లం ఉపయోగపడుతుంది. చిన్న ముక్క అల్లం నమలడం లేదా అల్లం టీ తాగడం వల్ల వాంతివచ్చే ఫీలింగ్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గర్భధారణ సమయంలో వికారం సమస్య ఎదుర్కొనే మహిళలు కూడా వైద్యుల సలహాతో అల్లం ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అల్లం కండరాల నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాయామం చేసిన తర్వాత లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల్లో నొప్పి రావడం సహజం. అల్లంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే గుణాలు నొప్పిని తగ్గించడంలో సహకరిస్తాయి.

Advertisement

డయాబెటిస్ ఉన్నవారికి
ఇక మధుమేహం ఉన్నవారికి కూడా అల్లం మరింత లాభాలిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అల్లం సహాయపడుతుందని పేర్కొంటున్నారు. అయితే దీనిని మందుల ప్రత్యామ్నాయంగా ఉపయోగించకుండా వైద్యుల సూచనతో మాత్రమే తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా అల్లం మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో అల్లం సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఇది మెటబాలిజాన్ని పెంచి కొవ్వును కాల్చేస్తుంది. అలాగే ఆకలిని అదుపులో ఉంచేందుకు ఇది సహాయపడుతుంది. అల్లం నీరు లేదా అల్లం టీ తీసుకోవడం బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అల్లం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మొటిమలు తగ్గించడంలో కూడా అల్లం మేలు చేస్తుంది.

అయితే అల్లం ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా కడుపు మంట రావచ్చు. గర్భిణీలు, రక్తం పలుచన చేసే మందులు తీసుకునేవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×