E-Paper
Advertisement

Sam Altman vs Dario Amodei: ఏఐ బాసుల మధ్య కోల్డ్ వార్.. ఇండియా ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర దృశ్యం

Sam Altman vs Dario Amodei: ఏఐ బాసుల మధ్య కోల్డ్ వార్.. ఇండియా ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర దృశ్యం
Advertisement

Sam Altman vs Dario Amodei: న్యూ ఢిల్లీలో జ‌రుగుతున్న‌ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా కృత్రిమ మేధ (AI) రంగంలోని ఇద్దరు దిగ్గజాల మధ్య చోటుచేసుకున్న ఆసక్తికర పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఓపెన్ ఏఐ (OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంత్రోపిక్ (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడానికి నిరాకరించిన దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.

గురువారం జరిగిన ఈ సదస్సులో పీఎం మోదీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఇతర టెక్ నేతలతో కలిసి గ్రూప్ ఫోటో దిగే సమయంలో ఈ ఘటన జరిగింది. వేదికపై ఉన్న నాయకులందరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గాలిలోకి ఎత్తాల‌ని ప్రధాని కోరారు. మోదీ స్వయంగా ఆల్ట్‌మాన్, పిచాయ్ చేతులు పట్టుకుని పైకి లేపగా మిగిలిన వారు కూడా అదే అనుసరించారు. అయితే పక్కపక్కనే నిలబడిన ఆల్ట్‌మాన్, అమోడెయ్ మాత్రం పరస్పరం చేతులు పట్టుకోకుండా కేవలం తమ పిడికిలిని గాలిలోకి ఎత్తారు. ఈ దృశ్యం ఏఐ కోల్డ్ వార్ కు సంకేతమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలకు బలమైన కారణాలు లేక‌పోలేదు. గతంలో ఓపెన్ ఏఐలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అమోడెయ్ సంస్థ ధోరణి నచ్చక 2021లో బయటకు వచ్చి తన సోదరి డేనియలాతో కలిసి ఆంత్రోపిక్ ను స్థాపించారు. ఏఐ భద్రత (AI Safety) కంటే వ్యాపారానికే ఆల్ట్‌మాన్ ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన సూపర్ బౌల్ (Super Bowl) ప్రకటనల విషయంలో కూడా ఇరు సంస్థలు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నాయి. చాట్‌జీపీటీలో ప్రకటనలు తీసుకురావాలన్న ఓపెన్ ఏఐ నిర్ణయాన్ని ఎగతాళి చేస్తూ ఆంత్రోపిక్ యాడ్స్ ఇవ్వగా ఆల్ట్‌మాన్ వాటిని వంచన అని కొట్టిపారేశారు.

ఈ స‌ద‌స్సులో సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ ఏఐ సాంకేతికత కేవలం ఒక దేశం లేదా ఒక సంస్థ చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని అన్నారు. ఏఐ ప్రజాస్వామ్యీకరణే సురక్షితమైన భవిష్యత్తుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు డారియో అమోడెయ్ ఏఐ వల్ల తలెత్తే తీవ్రమైన ముప్పులను (Serious Risks) ప్రస్తావించారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ వ్యవస్థలు, వాటి దుర్వినియోగం, ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కేవలం నమూనాలను పెంచడం (Scaling) మాత్రమే కాకుండా వాటి విలువలపై దృష్టి పెట్టాలని అమోడెయ్ పేర్కొన్నారు.

Advertisement

Read Also: Visakhapatnam AI Hub: దేశానికి ఏఐ హబ్‌గా విశాఖ.. లక్షల్లో ఉద్యోగాలు, ఇండియా-అమెరికా కనెక్ట్

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×