E-Paper
Advertisement

Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో

Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో
Advertisement

కొత్తిమీర మటన్ పేరు చెబితే కొత్తగా అనిపించవచ్చు. కానీ తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర ఆకుల తాజా వాసనతో, మసాలాల రుచితో తయారయ్యే ఈ ప్రత్యేకమైన నాన్‌వెజ్ వంటకం బగారా రైస్, వైట్ రైస్ తో తింటే అదిరిపోతుంది. ఇది సాధారణ మటన్ కూరలకంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో కొత్తిమీర, కొబ్బరి పేస్ట్ ప్రత్యేక రుచిని అందిస్తుంది. ఈ కూర రోటీ, చపాతీ, నాన్ వంటి వాటితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

కొత్తిమీర మటన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ – అరకిలో
ఉల్లిపాయలు – మూడు
కొత్తిమీర తరుగు – అర కప్పు
తురిమిన కొబ్బరి – అర కప్పు
పచ్చిమిర్చి – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
నిమ్మరసం – ఒక స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
పసుపు – అర స్పూన్
కారం పొడి – ఒక స్పూన్
జీలకర్ర పొడి – అర స్పూన్
గరం మసాలా – ఒక స్పూన్
మిరియాలు – నాలుగు
లవంగాలు – మూడు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
నూనె – రెండు స్పూన్లు
కరివేపాకులు – కొద్దిగా

Advertisement

Also read: Black Coffee: బ్లాక్ కాఫీతో పాటూ ఇవి తిన్నారంటే బరువు త్వరగా తగ్గిపోవచ్చు

కొత్తిమీర మటన్ రెసిపీ
1. మొదట మటన్‌ను బాగా కడిగి నీరు పూర్తిగా వంపేయాలి. తరువాత ఒక గిన్నెలో మటన్ వేసి పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని కనీసం గంట పాటూ ఉంచితే మటన్‌కు మసాలా రుచి బాగా పడుతుంది.
3. మిక్సీ జార్‌లో తాజా కొత్తిమీర ఆకులు, తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
4. ప్రెషర్ కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెరినేట్ చేసిన మటన్ వేసి 5 నిమిషాలు కలుపుతూ వేయించాలి.
5. తర్వాత ఒక కప్పు నీరు పోసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. కరివేపాకులు గుప్పెడు వేయాలి.
7. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి వాసన వచ్చే వరకు వేపాలి.
8. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
9. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత ముందుగా ఉడికించిన మటన్‌ను కళాయిలో వేసి కలపాలి.
10. ఇప్పుడు ముందుగా తయారు చేసిన కొత్తిమీర, కొబ్బరి పేస్ట్ వేసి మెల్లగా కలపాలి.
11. అవసరమైతే కొద్దిగా నీరు పోసి మధ్యస్థ మంటపై పావుగంట ఉడికించాలి.
12. చివరగా గరం మసాలా చల్లి రెండు నిమిషాలు ఉడికించాలి.
13. గ్యాస్ ఆఫ్ చేసిన తరువాత పైన కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. అంటే కొత్తిమీర మటన్ కూర రెడీ అయినట్టే.

Advertisement

Also read: Hill Station: మనదేశంలోనే అత్యంత ప్రశాంతమైన హిల్ స్టేషన్ ఇది, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

వేడి వేడి అన్నంతో ఈ కూర తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చపాతీ, నాన్‌తో కూడా బాగా సరిపోతుంది. పక్కన ఉల్లిపాయ సలాడ్, నిమ్మముక్కలు పెట్టుకుంటే భోజనం అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ చెప్పినట్టు కొత్తిమీర మటన్ వండి చూడండి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×