E-Paper
Advertisement

Black Coffee: బ్లాక్ కాఫీ తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం

Black Coffee: బ్లాక్ కాఫీ తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం
Advertisement

Black Coffee: ఈ రోజుల్లో.. టీ, కాఫీ మనందరి లైఫ్ స్టైల్‌లో భాగమయ్యాయి. చాలా మంది బ్లాక్ కాఫీ తాగడానికి ఎంతగానో ఇష్టపడతారు. రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభించే వారు అనేక మంది ఉంటారు. ఆఫీసులో పనిభారాన్ని తగ్గించడానికి లేదా భోజనం తర్వాత నిత్ర మత్తు వదలడానికి కూడా కాఫీ కూడా ఒక సరైన ఎంపిక. కానీ అధిక మొత్తంలో బ్లాక్ కాఫీ తాగడం మీ ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మీరు చక్కెరను ఎక్కువగా కలిపి బ్లాక్ కాఫీ తీసుకున్నట్లయితే ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఆరోగ్యానికి కాఫీ కొంత ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, బ్లాక్ కాఫీ మీకు తెలియని అనేక ప్రతికూలతలను కూడా కలిగి ఉంటుంది. బ్లాక్ కాఫీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.

Advertisement

నిద్రకు భంగం :

తరచుగా.. బ్లాక్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల కారణంగా అధిక మొత్తంలో బ్లాక్ కాఫీని తీసుకుంటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది నిద్ర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఫలితంగా మీ నిద్ర చక్రంపై కూడా ప్రభావం చూపుతుంది . కాబట్టి.. మీ కాఫీ తీసుకోవడం పరిమితం చేయడానికి ప్రయత్నించండి. పడుకునే ముందు తాగకుండా ఉండండి.

Advertisement

కడుపు సంబంధిత సమస్యలు:

బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మీ నిద్రకు అంతరాయం కలగడమే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. బ్లాక్ కాఫీ మీ కడుపును ఇబ్బంది పెడుతుంది. ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంట, మలబద్ధకానికి కూడా దారి తీస్తుంది.

ఒత్తిడికి కారణం కావచ్చు:

బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇది ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. అంతేకాకుండా.. ఎక్కువ బ్లాక్ కాఫీ తాగిన తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ముఖ్యమైన పోషకాల లోపం:

మీరు ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగినప్పుడు, మీ శరీరం ఐరన్, కాల్షియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలను గ్రహించడం కష్టమవుతుంది. ఫలితంగా ఇది శరీరంలో పోషక లోపాలకు దారి తీస్తుంది.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×