E-Paper
Advertisement

Wheat Flour cake: గోధుమపిండితో అరగంటలో కేక్ చేసేయండిలా, రెసిపీ ఇదిగో

Wheat Flour cake: గోధుమపిండితో అరగంటలో కేక్ చేసేయండిలా, రెసిపీ ఇదిగో
Advertisement

సాధారణంగా కేక్ అనగానే మైదాతో తయారు చేసినది గుర్తుకు వస్తుంది. అయితే గోధుమపిండితో చేసిన కేక్ కూడా చాలా రుచిగా, మృదువుగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి మంచిది కూడా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఈ కేక్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పుట్టిన రోజులకు, న్యూఇయర కు కేక్ కట్ చేసేందుకు ఇంట్లోనే కేకు సిద్ధం చేసుకోండి.

గోధుమపిండి కేకు రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – రెండు కప్పులు
పంచదార – రెండు కప్పులు
నెయ్యి లేదా బటర్ – ఒక కప్పు
గుడ్లు – నాలుగు
పాలు – అర కప్పు
బేకింగ్ పౌడర్ – ఒక స్పూన్
వెనిల్లా ఎసెన్స్ – ఒక స్పూన్
ఉప్పు – చిటికెడు

Advertisement

గోధుమపిండి కేకు రెసిపీ
1. ముందుగా గోధుమపిండిని ఒక జల్లెడలో వేసి బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పుతో కలిపి జల్లించాలి.
2. ఇలా చేయడం వల్ల పిండిలో గడ్డలు లేకుండా మెత్తగా మారుతుంది.
3. తరువాత పంచదారను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి.
4. గుడ్లను పగలగొట్టి తెల్లసొన, పచ్చసొన వేరుచేసి రెండు గిన్నెల్లో ఉంచాలి.
5. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్ల తెల్లసొన బీట్ చేయాలి. ఇందులో కొద్దిగా పంచదార పొడి వేసుకుంటూ బాగా కలపాలి.
6. ఇది నురగలాగా మారే వరకు బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేకు సున్నితంగా వస్తుంది.
7. ఇంకో గిన్నెలో గుడ్ల పచ్చసొన తీసుకుని మిగిలిన పంచదార పొడి వేసి బాగా కలపాలి.
8. ఇప్పుడు నెయ్యిని ఇందులో వేసి మిశ్రమం క్రీమీగా మారే వరకు కలపాలి. తరువాత వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి.
9. ఇప్పుడు జల్లించిన గోధుమపిండిని ఈ మిశ్రమంలో కొంచెం కొంచెంగా వేయాలి. ఒకసారి పిండి వేసిన తరువాత కొద్దిగా పాలు వేసుకుంటూ నెమ్మదిగా కలపాలి.
10. మొత్తం పిండి, పాలు కలిసే వరకు ఇదే విధంగా చేయాలి. ముద్దలు పడకుండా జాగ్రత్తగా కలపాలి.
11. చివరగా బీట్ చేసి పెట్టుకున్న గుడ్ల తెల్లసొనను ఈ మిశ్రమంలో వేసి స్పూన్‌తో నెమ్మదిగా కలపాలి.
12.ఎక్కువగా కలిపితే కేక్ గట్టిగా మారుతుంది, కాబట్టి మెల్లగా కలపడం చాలా ముఖ్యం.
13. ఇప్పుడు ఓవెన్‌ను 175 డిగ్రీల ఉష్ణోగ్రతకు ముందే వేడిచేయాలి.
14. కేక్ టిన్ లేదా పాన్ తీసుకుని లోపల నెయ్యి రాసి కొద్దిగా గోధుమపిండి చల్లాలి. ఇలా చేస్తే కేక్ అంటుకోదు.
15. సిద్ధం చేసిన కేక్ మిశ్రమాన్ని పాన్‌లో పోసి పై భాగాన్ని సమంగా సర్దాలి.
16. పాన్‌ను ఓవెన్‌లో పెట్టి సుమారు 30 నుంచి 35 నిమిషాలు బేక్ చేయాలి. మధ్యలో ఓసారి టూత్‌పిక్ లేదా కత్తి పెట్టి చూసుకోవాలి. అది శుభ్రంగా బయటికి వస్తే కేక్ సిద్ధమైనట్టు. లేదంటే ఇంకా కొద్ది నిమిషాలు ఉంచాలి.

కేక్ సిద్ధమైపోయాక మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చు. ఇది గోధుమపిండి కేక్ కాబట్టి అందరూ తినవచ్చు. అయితే పంచదార ఎక్కువ వేస్తాము కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు దీన్ని తినకపోవడమే మంచిది.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×