E-Paper
Advertisement

BEST Bus Accident: వైరల్ వీడియో.. పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్‌లోనే 13 మంది..!

BEST Bus Accident: వైరల్ వీడియో.. పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్‌లోనే 13 మంది..!
Advertisement

BEST Bus Accident: ముంబై మహానగరంలో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉండే బాండూప్ (వెస్ట్) ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సిసిటివి (CCTV) దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, వాటిని చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.

రాత్రి 10 గంటల సమయంలో బాండూప్ స్టేషన్ రోడ్‌లో ప్రయాణికులు, పాదచారులు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆ సమయంలో రూట్ చివరి పాయింట్‌కు చేరుకున్న ఒక బెస్ట్ (BEST) బస్సును డ్రైవర్ వెనక్కి (Reverse) తీసే ప్రయత్నం చేశాడు. అయితే అకస్మాత్తుగా బస్సు వేగంగా వెనక్కి రావడంతో అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. తప్పించుకునేలోపే బస్సు కొందరిని తొక్కేసింది. పక్కనే ఉన్న ఒక బట్టల దుకాణంలోని సిసిటివి కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బస్సు చక్రాల కింద నలిగిపోయిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

Advertisement

ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Ex-gratia) ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Advertisement

ప్రమాదానికి కారణమైన బస్సు ‘ఒలెక్ట్రా గ్రీన్-టెక్’ నుంచి వెట్-లీజ్ పద్ధతిలో తీసుకున్న మిడి బస్సు. కాంట్రాక్ట్ ప్రకారం డ్రైవర్, నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థదే. ఇక్కటైన మలుపులు ఉండే బాండూప్ వంటి ప్రాంతాల్లో ఈ బస్సుల టర్నింగ్ రేడియస్ సరిపోవడం లేదని, ఇవి ప్రమాదకరమని గతంలోనే విమర్శలు వచ్చాయి. అయినా బస్సుల కొరత కారణంగా వీటిని మళ్లీ వాడటమే తాజా విషాదానికి కారణమని తెలుస్తోంది.

Read Also: Most Motorcycles Countries: ప్రపంచంలో అత్యధిక బైక్స్ ఉన్న దేశాలు ఇవే, ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×