OnePlus 15 Smartphone: టెక్ మార్కెట్‌లో ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులోకి రావడంతో కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనగానే రూ.60వేలకి మించిన ధరే ముందుగా గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు అదే ఫ్లాగ్‌షిప్ అనుభవం రూ.40వేల లోపల దొరికే స్థితి ఏర్పడింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా లలో ప్రస్తుతం లభిస్తున్న వన్‌ప్లస్ తాజా ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 15 పై భారీ తగ్గింపులు రావడంతో ఈ ఫోన్ ఒక్కసారిగా మిడ్ రేంజ్ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ ఎలా అందుబాటులోకి వచ్చింది అన్నది ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.
డిజైన్‌లో కొత్త ఫీల్
ఈసారి వన్‌ప్లస్ 15 డిజైన్ పూర్తిగా కొత్త ఫీల్ ఇస్తుంది. ఇప్పటివరకు చూసిన మోడళ్లలో ఉన్న కర్వ్‌డ్ ఎడ్జెస్ తగ్గించి, ఫ్లాటర్ ఐఫోన్ స్టైల్ డిజైన్ వైపు షిఫ్ట్ అయ్యింది. ఇలాంటి డిజైన్ స్టైల్‌ను ఈ ఏడాది మొదట వన్‌ప్లస్ 13ఎస్ లో చూసాం. చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగా ఉంటుంది, ప్రీమియం ఫీల్ కూడా తగ్గదు. ముందు భాగంలో 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం ఈ ఫోన్‌కి పెద్ద ప్లస్. పీక్ బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ వరకూ వెళ్తుంది కాబట్టి బయట ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చిన ఫోన్లలో క్యూహెచ్‌డి ప్యానెల్ లేకపోయినా, ఈ మార్పుతో హై రిఫ్రెష్ రేట్‌ని స్టేబుల్‌గా ఇవ్వనున్నట్లు వన్‌ప్లస్ చెబుతోంది.
పర్‌ఫార్మెన్స్‌లో అసలు ఫ్లాగ్‌షిప్ పవర్
వన్‌ప్లస్ 15లో ఉన్న ముఖ్యమైన ఆకర్షణ దాని పర్‌ఫార్మెన్స్. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న అత్యంత పవర్‌ఫుల్ చిప్‌లలో ఒకటి. దీనితో పాటు అడ్రెనో 840 జీపీయూ ఉండటం వల్ల హెవీ గేమింగ్, హై ఎండ్ గ్రాఫిక్స్, మల్టీ టాస్కింగ్ అన్నీ స్మూత్‌గా జరుగుతాయి.
అల్ట్రా ప్లస్ ర్యామ్ సపోర్ట్
ఈ ఫోన్ లో 16జిబి వరకూ ఎల్‌పీడీడీఆర్ 5ఎక్స్ అల్ట్రా ప్లస్ ర్యామ్ సపోర్ట్ ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే 512జిబి వరకూ యూఎఫ్‌ఎస్ 4.1 స్టోరేజ్ ఆప్షన్ లభిస్తుంది. టచ్ రెస్పాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక చిప్ ఇచ్చారు. దీని వల్ల టచ్ సాంప్లింగ్ రేట్ 3,200Hz వరకూ వెళ్తుంది. గేమింగ్ ఆడే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా సెపరేట్ వై-ఫై చిప్ ఉండటం వల్ల నెట్‌వర్క్ స్టేబిలిటీ, రేంజ్ స్థిరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
6 సంవత్సరాల సెక్యూరిటీ
వన్‌ప్లస్ 15 లో ఆక్సిజన్ ఓఎస్ 16 ఉంది, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. ఈసారి ఏఐ ఫీచర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. గూగుల్ జెమినై ఇంటిగ్రేషన్ తో ప్లస్ మైండ్ సిస్టమ్ ద్వారా స్మార్ట్ సజెషన్స్, ప్రొడక్టివిటీ ఫీచర్లు కనిపిస్తాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ముఖ్యమైన విషయం అప్‌డేట్ ప్రామిస్. వన్‌ప్లస్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని ప్రకటించింది. దీని వల్ల ఈ ఫోన్ కొనుకున్నాక చాలా కాలం వరకూ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి అనే నమ్మకం ఉంటుంది.
Also Read: iPhone 17 Pro: ఐఫోన్-17పై ఏకంగా రూ.22 వేలు డిస్కౌంట్.. ఆన్‌లైన్‌లో కాదు, ఎక్కడంటే?
ఫ్లాగ్‌షిప్ స్థాయిలో కెమెరా సెటప్
వన్‌ప్లస్ 15 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధానంగా 50ఎంపి సోనీ ఐఎంఎక్స్ 906 ప్రైమరీ సెన్సార్ ఉంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండటం వల్ల ఫోటోలు, వీడియోలు స్టేబుల్ గా వస్తాయి. దీనితో పాటు 50ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, ఇది 116 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇస్తుంది. ఇంకా 50ఎంపి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంది. ఇది 3.5x ఆప్టికల్ జూమ్, 7x లాస్‌లెస్ డిజిటల్ జూమ్ వరకూ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ లో 32ఎంపి సోనీ ఐఎంఎక్స్ 709 ఆర్‌జీబీడబ్ల్యూ కెమెరా ఆటో ఫోకస్ తో వస్తుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ అన్నీ క్లియర్ గా ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్‌లో అసలు గేమ్ చేంజర్
వన్‌ప్లస్ 15లో 7,300mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉంది. ఇది ఈ సెగ్మెంట్ లో చాలా పెద్ద బ్యాటరీ. హెవీ యూజేజ్ ఉన్నా కూడా 1 రోజు కంటే ఎక్కువ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటుంది. చార్జింగ్ విషయానికి వస్తే 120W సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. చాలా తక్కువ సమయంలో ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది. ఇదే కాకుండా 50W ఎయిర్ వూక్ వైర్‌లెస్ చార్జింగ్ కూడా ఉంది. వైర్డ్, వైర్‌లెస్ రెండింటిలోనూ ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్థాయి స్పీడ్ ఇస్తుంది. ప్రస్తుతం సేల్ అవుతున్న ఫోన్లలో ఇది అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒకటిగా నిలుస్తుంది. ఇది మిడ్ రేంజ్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం ఇవ్వగల ఫోన్.
నిజంగానే రూ.40,000 లోపు వస్తుందా?
వన్‌ప్లస్ 15 లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.76,999. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా లలో ఇది రూ.72,999 కు అందుబాటులో ఉంది. ఇక్కడే మొదటి తగ్గింపు కనిపిస్తుంది. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే వెంటనే రూ.4,000 ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. దీంతో అప్‌ఫ్రంట్ ధర సుమారు రూ.68,999 కు అందుబాటులో ఉంది.
అక్కడితో ఆఫర్ ఆయిపోలేదండోయ్
ఇక్కడితో ఆఫర్ ఆగిపోదు. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే అదనపు లాభం వస్తుంది. ఫోన్ మోడల్, కండిషన్ బట్టి ఎక్స్‌చేంజ్ విలువ మారుతుంది. సరిగా పనిచేస్తున్న ఫోన్ అయితే రూ.44,450 వరకు చూపిస్తోంది. సాధారణంగా చాలామందికి రూ.25వేల వరకు ఎక్స్‌చేంజ్ ధర వచ్చినా కూడా, మొత్తం మీద లెక్క వేస్తే వన్‌ప్లస్ 15 చివరికి వచ్చే ధర సుమారు రూ.40,000 దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కి ఇది నిజంగా షాకింగ్ డీల్ అనే చెప్పాలి. ఆలస్యం చేయకుండా తక్కువ ధరలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోండి.