E-Paper
Advertisement

Pilot Shirt Ripping: పైలెట్ తన షర్టు ఎప్పుడు చింపుకుంటాడు? ఎందుకు?

Pilot Shirt Ripping:  పైలెట్ తన షర్టు ఎప్పుడు చింపుకుంటాడు? ఎందుకు?
Advertisement

పైలట్‌ శిక్షణలో అనేక రకాల పరీక్షలు, దశలు ఉంటాయి. అయితే వీటిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఫస్ట్ సోలో ఫ్లైట్. ఒక విద్యార్థి పైలట్, ఇన్‌స్ట్రక్టర్‌ లేకుండా మొదటిసారి విమానం నడపడం అంటే అది అతని కెరీర్‌లో పెద్ద అడుగు. ఈ సందర్భాన్ని గుర్తుగా నిలుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫ్లయింగ్ స్కూల్స్‌లో ఒక ప్రత్యేక సంప్రదాయం కొనసాగుతోంది. అదే పైలట్ షర్ట్ వెనక భాగాన్ని కట్ చేయడం. ఈ సంప్రదాయం గురించి చాలా మందికి తెలియదు. ఇక దీని వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? ఎలా మొదలైంది? ఎందుకు ఇప్పటికీ పాటిస్తున్నారు? వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి సోలో ఫ్లైట్
ఫ్లయింగ్ ట్రైనింగ్‌లో విద్యార్థి మొదటిసారి ఒంటరిగా ఆకాశంలోకి ఎగరడం ఒక పెద్ద సవాలే. ఇన్‌స్ట్రక్టర్‌తో కలిసి సాధన చేస్తూ వచ్చిన విద్యార్థికి ఒక దశలో ఇప్పుడు నువ్వు ఒంటరిగా విమానం నడపడానికి సిద్ధం అని ఇన్‌స్ట్రక్టర్ అనుమతి ఇస్తారు. విద్యార్థి విజయవంతంగా ల్యాండింగ్ చేసిన వెంటనే ఫ్లయింగ్ స్కూల్‌లో ఉన్నవాళ్లు చాలా ఉత్సాహంగా ఆ సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు. అదే సమయంలో ఇన్‌స్ట్రక్టర్ అతని షర్ట్ వెనుక భాగాన్ని కత్తిరిస్తారు. ఈ క్షణం ప్రతి పైలట్ జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. తర్వాత ఆ కట్ చేసిన షర్ట్ పై విద్యార్థి పేరు, ఫ్లైట్ వివరాలు, తేదీ వంటి వాటిని రాసి, కొన్ని చోట్ల గోడలకు వేలాడదీస్తారు. కొందరు పైలట్లు తమ ఇంట్లో కూడా దాన్ని గుర్తుగా ఉంచుకుంటారు.

Advertisement

ఈ సంప్రదాయం ఎందుకు మొదలైంది?
ఇది సరదా కోసం మొదలైన సంప్రదాయం కాదు. దీనికి విమానయాన చరిత్రతో సంబంధం ఉంది. చాలాకాలం క్రితం పాత విమానాల్లో కాక్పిట్ ఓపెన్‌గా ఉండేది. విద్యార్థి ముందు సీట్లో కూర్చుంటే ఇన్‌స్ట్రక్టర్ వెనుక కూర్చుండేవాడు. ఆ రోజుల్లో హెడ్ పెట్లు, ఇంటర్‌కామ్ సిస్టమ్‌లు లేవు. ఆ సమయంలో ఇన్‌స్ట్రక్టర్ విద్యార్థికి సూచన ఇవ్వాలంటే అతని షర్ట్ కు ఉన్న తాడును లాగడం ద్వారా సంకేతం పంపేవాడు. విద్యార్థి సరైన దిశలో లేకపోయినా, వేగం తగ్గించాలన్నా, పెంచాలన్నా తాడు లాగి చెప్పేవాడు. క్రమంగా విద్యార్థి పూర్తిగా నైపుణ్యం సంపాదించాక, అతను ఇన్‌స్ట్రక్టర్ సహాయం లేకుండానే విమానం నడపగలడని అర్థమయ్యాక ఇక నీకు వెనక నుండి నేను లాగడం అవసరం లేదు అని సూచిస్తూ షర్ట్ వెనుక భాగాన్ని కట్ చేయడం ప్రారంభమైంది.

ఇప్పటి విమానాల్లో అధునాతన సాంకేతిక వసతులు ఉన్నప్పటికీ, ఈ అందమైన సంప్రదాయాన్ని చాలాచోట్ల ఇంకా కొనసాగిస్తున్నారు. కారణం ఇది పైలట్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఫ్లయింగ్ కమ్యూనిటీలో కొత్తగా అడుగు పెడుతున్న వ్యక్తికి పెద్ద గౌరవం లభించినట్లుగా భావిస్తారు. ఈ సంప్రదాయం ద్వారా విద్యార్థి తన సాధనలో ఎంత కష్టపడ్డాడో, ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేశాడో గుర్తుచేస్తుంది.

Advertisement

పైలట్‌గా మారడం సులువు పని కాదు. మానసిక ధైర్యం, క్రమశిక్షణ, నైపుణ్యం అన్నీ అవసరం. ఫస్ట్ సోలో ఫ్లైట్‌ అంటే ఆకాశంలో తన మీదే బాధ్యత ఉంటుందని అర్థం. ఆ క్షణం పూర్తి చేసిన విద్యార్థికి ఇది ఒక పెద్ద గర్వకారణం. షర్ట్ కట్ చేయడం అనేది అతను ఇప్పుడు నిజమైన పైలట్ గా మారాడు అని సూచించే చిన్న సెలబ్రేషన్. అది కుటుంబం, మిత్రులు, సహచరుల ముందు ఇది ఒక గర్వకారణమైన సంఘటన అవుతుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×