E-Paper
Advertisement

Pavala Shyamala : ఆత్మహత్యకు పాల్పడిన పావలా శ్యామల.. అసలేం జరిగిందంటే..?

Pavala Shyamala : ఆత్మహత్యకు పాల్పడిన పావలా శ్యామల.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Pavala Shyamala : సినీ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో ప్రత్యేక క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. వయసు మీద పడటంతో సినిమాలకు దూరమైంది. అదే ఆమెకు శాపం అయింది. చేతిలో చిల్లి గవ్వలేక నిరాశ్రయురాలు అయ్యింది.. ఆమె పరిస్థితిని చూసి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సాయం చేశారు.. కానీ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆమెకు ఆ సాయం పెద్దగా సరిపోలేదు.. ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె ఉన్న హోం లో ఆమెను సరిగ్గా పట్టించుకోవడంలేదని బయటకు వచ్చేసిందట.. ఆ తర్వాత ఎవరు చూడకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.. అక్కడ ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమెను కాపాడారు.. అనంతరం ఆర్ కే ఫౌండేషన్ హెల్త్ కేర్ లో చేర్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి..? పోలీసులు ఏం చెప్తారు అన్నది తెలియాల్సి ఉంది..

పావల శ్యామల పరిస్థితి ఎలా ఉందంటే..? 

పావలా శ్యామల తన బేస్ వాయిస్ తో స్టార్ హీరోలను సైతం తన డైలాగులతో గడగడ లాడించింది.. ఇండస్ట్రీలోని దాదాపు అందరూ హీరోల సినిమాలలో ఈమె కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జరగని ముద్ర వేసుకుంది.. ప్రస్తుతం వయసు మీద పడడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉందన్న విషయం అందరికీ తెలుసు. సినిమాల్లో వచ్చిన డబ్బులను అనారోగ్య సమస్యలకు వాడినట్లు గతంలో చాలా వీడియోల్లో ఆమె చెప్పింది.. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఇండస్ట్రీలోని ఎంతో మంది స్టార్ హీరోలు సహాయం చేశారు.. వాళ్ళు చేసిన సాయం కన్నా ఆమె సమస్యలు ఎక్కువ అవడంతో మళ్లీ రోడ్డున పడింది. ప్రస్తుతం ఓ వృద్ధాశ్రమంలో ఉన్న ఆమె అక్కడ ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బయటకు వచ్చేసింది. బయట పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుపోయిందని తెలుస్తుంది.. పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ళు అక్కడ ఆమెను కాపాడి మరో వృద్ధాశ్రమంలో చేర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం పావలా శ్యామల ఆర్కే ఫౌండేషన్ లో ఉన్నారు. బ్రతుకు భారంతో సాగుతున్న జీవితానికి ముగింపు పలగాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.. మరి ఆమె ఆత్మహత్యకు కారణం అనారోగ్య సమస్యలు అని తెలుస్తుంది. తమ పరిస్థితిని తెలుసుకున్న కొందరు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..

300 లకు పైగా సినిమాలు.. 

Advertisement

ఉదయ్ కిరణ్, గోపీచంద్, వెంకటేష్, సిద్దార్థ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్త్రీలోని స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఆమె ఇప్పుడు దీన స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. సాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.. సినీ పెద్దలు సాయం ఆమెకు పెద్దగా సరిపోలేదు. దాంతో మళ్లీ ఆమె రోడ్డున పడింది. ఈసారి ఆమెకు ఏ ఒక్కరు కూడా సాయం చెయ్యలేదు. అందుకే ఆత్మ హత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. సాయం అందిస్తామని హామీ ఇచ్చిన పెద్దలు ముందుకు వచ్చి ఆదుకుంటారేమో చూద్దాం..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×