E-Paper
Advertisement

Household Items Replacement: టూత్ బ్రష్ నుంచి పిల్లో వరకు.. ఏ వస్తువు ఆయుష్షు మీకు ఎంతో తెలుసా?

Household Items Replacement: టూత్ బ్రష్ నుంచి పిల్లో వరకు.. ఏ వస్తువు ఆయుష్షు మీకు ఎంతో  తెలుసా?
Advertisement

Household Items Replacement: మన ఇంట్లో రోజూ వాడే చాలా వస్తువులు ఎంతకాలం ఉపయోగించాలో మనకు స్పష్టంగా తెలియదు. టూత్‌బ్రష్, దిండు, షూస్, మ్యాట్రెస్ వంటి వస్తువులు సమయానికి మార్చకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయంలా అనిపించినా ఇవి మన హైజీన్, కంఫర్ట్ మీద పెద్ద ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి వస్తువును ఎప్పుడు రీప్లేస్ చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇప్పడు చూద్దాం.

మన రోజువారీ జీవితంలో వాడే చాలా వస్తువులు ఎక్కువ రోజులు వాడటం వల్ల ఇవి పాడవుతాయి లేదా వీటిపై బ్యాక్టీరియా పెరుగుతాయి. కానీ చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా సంవత్సరాల పాటు అదే వస్తువులు వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే కొన్ని ముఖ్యమైన హౌస్‌హోల్డ్ ఐటమ్స్‌ను ఎప్పుడు మార్చాలో తప్పకుండా తెలుసుకోవాలి.

Advertisement

1. టూత్‌బ్రష్ – ప్రతి 3 నెలలు:
టూత్‌బ్రష్ రోజూ ఉపయోగించే వస్తువు. 3 నెలల తర్వాత బ్రష్ బ్రిస్టల్స్ దెబ్బతింటాయి. దీంతో పళ్లను సరిగ్గా శుభ్రం చేయలేవు. అలాగే బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చాలి.

2. పిలో (దిండు) – 1 నుంచి 2 సంవత్సరాలు:
పిలోలో డస్ట్, బ్యాక్టీరియా, చెమట పేరుకుపోతాయి. దీన్ని ఎక్కువకాలం వాడితే అలర్జీలు, మెడ నొప్పులు రావచ్చు. అందుకే 1-2 సంవత్సరాలకు ఒకసారి కొత్తది తీసుకోవాలి.

Advertisement

3. సాక్స్ & అండర్‌వేర్ – 6 నుంచి 12 నెలలు:
ఇవి రోజూ వాడే వస్తువులు కాబట్టి త్వరగా పాడైపోయి బ్యాక్టీరియా పెరుగుతుంది. హైజీన్ కోసం 6-12 నెలల్లో మార్చడం మంచిది.

4. రన్నింగ్ షూస్ – 1 సంవత్సరం లేదా 500 కిమీ:
షూస్ సోల్ దెబ్బతింటే కాళ్లకు సపోర్ట్ తగ్గుతుంది. దీని వల్ల నొప్పులు రావచ్చు. కాబట్టి 1 సంవత్సరం లేదా 500 కి.మీ తర్వాత మార్చాలి.

5. కీబోర్డ్ – 5 సంవత్సరాలు:

కీబోర్డ్‌లో డస్ట్, జర్మ్స్ ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా పనిచేయకపోతే.. లేదా 5 సంవత్సరాలు పూర్తైతే మార్చడం మంచిది.

6. ఫోన్ ఛార్జింగ్ కేబుల్ – 1 నుంచి 2 సంవత్సరాలు:
చార్జింగ్ కేబుల్ దెబ్బతింటే ఫోన్‌కు నష్టం కలగొచ్చు. స్పార్కింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి 1-2 సంవత్సరాల్లో మార్చాలి.

Also Read: జంక్ ఫుడ్ తింటున్నారా? మీ మెదడుకు ‘స్లో పాయిజన్’ ఇస్తున్నట్లే!

7. సన్‌స్క్రీన్ – ప్రతి 12 నెలలకు:
సన్‌ స్క్రీన్‌లోని కెమికల్స్ టైమ్‌తో ప్రభావం కోల్పోతాయి. అందుకే 1 సంవత్సరం తర్వాత కొత్తది వాడాలి.

8. మ్యాట్రెస్ – 1 నుంచి 2 సంవత్సరాలు:
మ్యాట్రెస్ ఎక్కువకాలం వాడితే బ్యాక్టీరియా, డస్ట్ మైట్స్ పెరుగుతాయి. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది.

9. బూమ్ (చీపురు) – 1 నుంచి 2 సంవత్సరాలు:
చీపురు బ్రిస్టల్స్ పాడైపోతే తొందరగా శుభ్రం చేయదు. కాబట్టి సమయానికి మార్చాలి.

10. రేజర్ బ్లేడ్స్ – 5-7 షేవ్స్:
బ్లేడ్స్ పాడైతే స్కిన్ ఇర్రిటేషన్ వస్తుంది. కాబట్టి 5-7 షేవ్స్ తర్వాత మార్చాలి.

11. షవర్ హెడ్ -6 నుంచి 12 నెలలు:
షవర్ హెడ్‌లో మినరల్స్, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. కాబట్టి 6-12 నెలల్లో మార్చడం మంచిది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×