E-Paper
Advertisement

Coffee for kids: ప్రేమగా పిల్లలకు కాఫీ చేసి ఇస్తున్నారా? అది కాఫీ కాదు విషమే

Coffee for kids: ప్రేమగా పిల్లలకు కాఫీ చేసి ఇస్తున్నారా? అది కాఫీ కాదు విషమే
Advertisement

ఈ రోజుల్లో పెద్దలతో పాటు పిల్లలకు కూడా కాఫీ తాగడం అలవాటుగా మారుతోంది. ఇంట్లో తల్లిదండ్రులు కాఫీ తాగుతుంటే పిల్లలు మాకు కావాలని అడుగుతుంటారు. కొందరు తల్లిదండ్రులు కొంచెం కాఫీ వాళ్లకి కూడా ఇస్తుంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం పిల్లలకు కాఫీ ఇవ్వకూడదని స్పష్టంగా చెబుతున్నారు. కాఫీ వల్ల పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.

కెఫీన్ తో ప్రమాదం
కాఫీలో ప్రధానంగా ఉండే పదార్థం కెఫీన్. దీనిలో ఉండే పెద్ద సమస్య ఇదే. కెఫిన్ పెద్దల శరీరానికి కొంతవరకు సహకరిస్తుంది. నిద్రమత్తు తగ్గించడం, అలసటను తగ్గించడం వంటివి చేస్తుంది. కానీ పిల్లల శరీరం ఇంకా ఎదుగుతున్న దశలో ఉంటుంది. వారి నరాల వ్యవస్థ, మెదడు, గుండె పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఈ దశలో కాఫీ ప్రభావం వారిపై ఎక్కువగా పడుతుంది. పిల్లలు కాఫీ తాగితే మొదటగా ప్రభావం పడేది నిద్రపై. కెఫిన్ వల్ల పిల్లలకు నిద్ర పట్టకపోవడం, మధ్య మధ్యలో మేలుకోవడం వంటివి చేస్తారు. సరైన నిద్ర లేకపోతే పిల్లల ఎదుగుదల మందగిస్తుంది. మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తికి నిద్ర చాలా అవసరం. రోజూ కాఫీ తాగే పిల్లలు చిరాకు, కోపం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

Advertisement

Also read: Parenting Tips: పిల్లలు మీ మాట వినడం లేదా? ఇలా.. వారిని దారిలోకి తెచ్చుకోండి!

ఈ సమస్యలు వచ్చే ఛాన్స్
కాఫీ వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం పెరిగిపోతుంది. రోజూ కాఫీ తాగే పిల్లల్లో హృదయ స్పందనలు పెరుగుతాయి. గుబులు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరు పిల్లల్లో ఆందోళన ఎక్కువగా పెరుగుతుంది. ఇది చదువుపై ప్రభావం చూపుతుంది. పరీక్షల సమయంలో భయం, ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. జీర్ణవ్యవస్థపైనా కాఫీ చెడు ప్రభావం చూపుతుంది. కాఫీ ఆమ్లతను పెంచుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, గ్యాస్, మంట, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. పిల్లల కడుపు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైతే భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది.

Advertisement

ఎముకలు వీక్
పిల్లల ఎముకల ఆరోగ్యంపైనా కాఫీ ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే కెఫిన్ శరీరంలో కాల్షియం శోషణను తగ్గిస్తుంది. పిల్లల ఎదుగుదల దశలో కాల్షియం చాలా అవసరం. ఎముకలు బలంగా మారేందుకు, పొడవు పెరగేందుకు కాల్షియం కీలకం. కాఫీ ఎక్కువగా తాగే పిల్లల్లో ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం కాఫీకి వారు చిన్న వయసులోనే అలవాటు పడిపోతారు. చిన్న వయసులోనే కాఫీ అలవాటు అయితే అది పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. కాఫీ లేకపోతే తలనొప్పి, చిరాకు, అలసట వంటి లక్షణాలు రావడం మొదలవుతాయి. దీన్ని కెఫిన్ కు బానిస కావడం అంటారు. పిల్లల విషయంలో ఇది మంచిది కాదు.

కొంతమంది తల్లిదండ్రులు పాలతో కలిపి కాఫీని ఇస్తే హానికరం కాదని అనుకుంటారు. కానీ పాలతో కలిపినా కెఫిన్ ప్రభావం తగ్గదు. పైగా కాఫీలో చక్కెర ఎక్కువగా వేసి ఇస్తే దంత సమస్యలు, ఊబకాయం వంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయి. వైద్యులు పిల్లలకు పాలు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు వంటి సహజ పానీయాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇవి శరీరానికి పోషకాలు అందిస్తాయి. అలసటను కూడా తగ్గిస్తాయి. చలికాలంలో వేడి పాలు లేదా మూలికలతో చేసిన తేలికపాటి పానీయాలు ఇవ్వవచ్చు.

నిపుణుల సూచన ప్రకారం 12 సంవత్సరాల లోపు పిల్లలకు కెఫిన్ ఉన్న పానీయాలు పూర్తిగా దూరంగా ఉంచడం మంచిది. టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, కోలా వంటి వాటిని పిల్లలకు ఇవ్వకూడదు. పిల్లలు అడిగితే ప్రేమతో, ఓపికతో కారణం చెప్పి అలవాటు చేయాలి. కాఫీ పిల్లలకు శక్తినిచ్చే పానీయం కాదు, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన డ్రింక్. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. చిన్న వయసులోనే మంచి ఆహార అలవాట్లు నేర్పితేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. కాఫీకి దూరంగా ఉంచితేనే మంచిది.

Related News

మందులు తీసుకుంటున్నా కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉందా? మీరు చేసే ఈ 6 తప్పులే కారణం

మీ ఫేస్ కలర్ చామన ఛాయ.. అయితే ఈ 5 లిప్ స్టిక్ షేడ్స్ మీకు సరిపడవు

మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహార పదార్థాలు.. ఆ దేశాల్లో కంప్లీట్ బ్యాన్, ఎందుకో తెలుసా?

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

Big Stories

Advertisement
×