E-Paper
Advertisement

Govindaraja Temple: తిరుపతిలో హై టెన్షన్.. మద్యం మత్తులో ఆలయ గోపురం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌!

Govindaraja Temple: తిరుపతిలో హై టెన్షన్.. మద్యం మత్తులో ఆలయ గోపురం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌!
Advertisement

Govindaraja Temple: తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఒక వ్యక్తి చేసిన హంగామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుత్తడి తిరుపతి అనే వ్యక్తి, స్వామివారి ఏకాంత సేవ ముగిసిన సమయాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఆలయ భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగానే, వారి కళ్లు గప్పి అత్యంత సాహసంతో ఆలయ మహాద్వారం లోపల ఉన్న గోపురంపైకి ఎక్కాడు. మద్యం మత్తులో ఉన్న అతను గోపురంపై ఉన్న పవిత్ర కలశాలను పట్టుకుని లాగే ప్రయత్నం చేయడంతో, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భక్తులు, ఆలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

Advertisement

వింత షరతు..

గోపురంపై ఉన్న వ్యక్తిని కిందకు దించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఆలయ అధికారులు గంటల తరబడి శ్రమించారు. అధికారులు అతడిని బుజ్జగించి కిందకు రమ్మని కోరగా, అతను ఊహించని డిమాండ్ పెట్టాడు. తనకు ఒక క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని, లేదంటే దూకేస్తానని బెదిరించాడు. ఈ వింత డిమాండ్‌తో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాధారణంగా భక్తిభావంతో నిండి ఉండే ఆలయ ప్రాంగణంలో, ఇలాంటి అపవిత్రమైన కోరిక కోరడం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Advertisement

పోలీసుల సాహసోపేత ఆపరేషన్

నిందితుడు ఎంతకీ దిగి రాకపోవడంతో, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఐరన్ నిచ్చెనల సహాయంతో గోపురం పైకి చేరుకున్నారు. అతను పైనుంచి జారి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నిజామాబాద్ జిల్లా కూర్మవాడలోని పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనతో ఆలయ పవిత్రతకు భంగం కలగడమే కాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని ఆలయాల్లో భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Also Read: రన్‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం.. వీడియో వైరల్.

ప్రస్తుతం నిందితుడు తిరుపతిని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం స్పందిస్తూ.. నిందితుడు అసలు గోపురంపైకి ఎలా వెళ్ళగలిగాడు? దీని వెనుక కేవలం మద్యం మత్తు మాత్రమే ఉందా లేక ఇతర మానసిక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఆలయ భద్రతను మరింత కఠినతరం చేస్తామని, విచారణ అనంతరం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×