Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం వయసు పెరుగుతున్న సరే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తూ వస్తున్నాడు.. బాలీవుడ్ లో ఈయన హోస్ట్గా వ్యవహరిస్తున్న పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఎంతో మందికి మంచి వినోదం పాటు విజ్ఞానం కూడా అందించింది. హోస్ట్ సీట్‌లో అమితాబ్ బచ్చన్ తప్ప మరో సెలబ్రిటీని ఎవరు కూడా పెద్దగా ఊహించుకోలేకపోయారు.. 16 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 17వ సీజన్ ని జరుపుకుంటుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని నిర్వహించింది. ఈ ఎపిసోడ్ కు అగస్త్య నంద, కికు శారదా వచ్చారు. వీరిద్దరూ అమితాబచ్చన్ తో చాలా సరదాగా గడిపారు. సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా అమితాబ్ ఎమోషనల్ అయ్యాడు. తన 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నా జీవితంలో మూడో వంతు అభిమానులతో గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన అన్నారు. అమితాబ్ ఎమోషనల్ అవుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
టాలీవుడ్ లో ఎలాగైతే పలుషోలు ఉంటాయో బాలీవుడ్ లో కూడా అలానే కొన్ని షోలు ప్రసారం అవుతుంటాయి.. టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తర్వాత అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుంది కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ టాప్ షోకు బాలీవుడ్ బడా హీరో అమితా బచ్చన్ హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. ఇప్పటికీ 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 17వ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది.. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వీడియోలో తన 25 ఏళ్ల సినీ కెరియర్ గురించి వివరించి భావోద్వేగానికి లోనయ్యారు.. నా జీవితంలో మూడో వంతు జీవితం మీతోనే గడిపాను అని ఆయన అనడంతో పాటుగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అమితాబ్ పై నెటిజన్లు ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు..
బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా షో కౌన్ బనేగా కరోడ్పతి.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ షో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఈ షోలో పాల్గొని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. దాదాపు 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో రీసెంట్గా 17వ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ షో 17వ సీజన్ ఇటీవల జరగ్గా.. అందులో అమితాబచ్చన్ ప్రశ్నలు అడుగుతూ తన జీవితంలో అభిమానులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడంతో లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా అమితాబ్ గొప్ప మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. అమితాబ్ లాంటి మంచి నటుడు మంచి మనసున్న వ్యక్తి మరొకరు లేరు అంటూ ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమధ్య తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నాడు బిగ్ బీ..