E-Paper
Advertisement

Sleep Divorce Trend: రాత్రి విడాకులు, పగలు ప్రేమ.. వేగంగా వైరలవుతున్న వింత విడాకుల ట్రెండ్..

Sleep Divorce Trend: రాత్రి విడాకులు, పగలు ప్రేమ.. వేగంగా వైరలవుతున్న వింత విడాకుల ట్రెండ్..
Advertisement

Sleep Divorce Trend| ఈ రోజుల్లో భార్యభర్తల మధ్య సంబంధాలు, జీవన విధానాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో “స్లీప్ డివోర్స్” అనే ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఈ పదం వినగానే దంపతులకు ఆందోళన కలిగగినా, దీని అర్థం నిజమైన విడాకులు కాదు. ఆరోగ్య కోసం దంపతులు వేర్వేరుగా పడుకోవడమని చెబుతున్నారు.

స్లీప్ డివోర్స్ అంటే..

స్లీప్ డివోర్స్ అంటే భర్తాభార్యలు ఇష్టపూర్వకంగా వేర్వేరు పడకలు లేదా గదుల్లో నిద్రపోవడం. ఇది వారి మధ్య సంబంధంలో సమస్య ఉందని సూచించదు. మంచి నిద్ర కోసం, ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటారు. మంచి నిద్ర వల్ల మూడ్ మెరుగవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది.

జంటలు ఎందుకు స్లీప్ డివోర్స్ ఎంచుకుంటున్నారు?

Advertisement

చాలా జంటలు (దంపతులు, సహజీవనం చేసేవారు) భాగస్వామి అలవాట్ల వల్ల నిద్ర భంగం పడుతుంటారు. గురక, వేర్వేరు నిద్ర సమయాలు, రాత్రి ఫోన్ వాడటం, ఎక్కువ కదలికలు వంటివి నిద్రను భంగపరుస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు అనేక జంటలు వేర్వేరుగా నిద్రపోవడం మొదలుపెట్టాయి. భారతదేశంతో సహా పలు దేశాల్లో ఈ ట్రెండ్ పాపులర్ అవుతోంది.

స్లీప్ డివోర్స్ లాభాలు

వేర్వేరుగా నిద్రపోతే ఇద్దరికీ మంచి నిద్ర వస్తుంది. గురక, కదలికల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. మంచి నిద్ర వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మూడ్ మెరుగవుతుంది, కోపం తగ్గుతుంది. జంటల మధ్య సంభాషణ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరూ కాస్త పర్సనల్ గ్యాప్ కోరుకున్నప్పుడు వేర్వేరుగా పడుకుంటారు. ఆ తరువాత మళ్లీ ఇష్టం వచ్చినప్పుడు దగ్గరవుతారు. దీని వల్ల మంచి నిద్ర లభిస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

స్లీప్ డివోర్స్ వల్ల కలిగే నష్టాలు

Advertisement

కొన్నిసార్లు వేర్వేరుగా నిద్రపోవడం వల్ల దంపుతులు, లివ్ ఇన్ లో ఉండే జంటల మధ్య దూరం పెరగవచ్చు. వారి మధ్య ప్రేమ తగ్గిపోవచ్చు. రాత్రి సమయంలో మాట్లాడుకోవడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఒకరు వేరుగా పడుకోవాలనుకంటే ఇంకొకరు ఒంటరితనంతో ఇబ్బంది పడవచ్చు. శారీరక సాన్నిహిత్యం తగ్గడం వల్ల వారి బంధంపై ప్రభావం పడవచ్చు.

ఎవరు స్లీప్ డివోర్స్ చేయకూడదు?

ప్రతి ఒక్కరూ స్లీప్ డివోర్స్ ఇష్టపడతారని చెప్పలేం. శారీరక సాన్నిహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడే వారు, ఒంటరిగా నిద్రపోతే అసౌకర్యం అనిపించేవారు ఈ పద్ధతి మానుకోవాలని మానసిక నిపుణుల అభిప్రాయం. దంపతులు ఈ విధానం పాటించే ముందు ఎదుటి వ్యక్తి మానసిక శక్తిని అర్థం చేసుకోవాలి.

Also Read: ఆ దేశంలో టాయ్‌లెట్ సీట్‌కు పూజలు చేస్తున్న ప్రజలు.. ఈ సంప్రదాయం వెనుక విచిత్ర కారణం

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

ఈ నిర్ణయం తీసుకునేముందు దంపతులు బహిరంగంగా చర్చించుకోవాలి. ఇద్దరూ అంగీకరించాలి. శాశ్వతంగా కాకుండా కొన్ని రోజులు మాత్రమే వేర్వేరుగా నిద్రపోయి చూడవచ్చు. నిద్ర క్వాలిటీ, సంబంధం మధ్య బ్యాలెన్స్ ఉండాలి.

స్లీప్ డివోర్స్ విధానం క్వాలిటీ నిద్ర కోరుకునే దంపతులకు ఒక ఆచరణాత్మక పరిష్కారం. అయితే దీనికి పరస్పర అవగాహన అవసరం. సరైన విధంగా అమలు చేస్తే ఆరోగ్యం, సంబంధం రెండూ మెరుగవుతాయి. ప్రతి జంట తమ జీవన విధానానికి సరిపడా నిర్ణయం తీసుకోవాలి.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×