E-Paper
Advertisement

నీటిలో మునిగి బెంగాలీ నటుడు రాహుల్ బెనర్జీ మృతి..!

నీటిలో మునిగి  బెంగాలీ నటుడు రాహుల్ బెనర్జీ మృతి..!
Advertisement

బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (43) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు. ఒడిశాలోని తలసరి బీచ్ సమీపంలో షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం ఒడిశాలోని తలసరి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బోటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినట్లు సమాచారం. వెంటనే ఆయనను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. చివరకు ఆయన నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియగానే బెంగాలీ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

Advertisement

2008లో వచ్చిన చిరోదిని తుమీ జే అమర్ (Chirodini Tumi Je Amar) చిత్రంతో రాహుల్ భారీ గుర్తింపు పొందారు. ఈ సినిమా బెంగాలీలో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆయన స్టార్ న‌టుడిగా మారారు. తన అద్భుతమైన నటనతో అనేక చిత్రాల్లో, టెలివిజన్ షోలలో అలరించిన ఆయన, 43 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూయడం అభిమానులను కలిచివేస్తోంది.

సినిమాలతో పాటు బెంగాలీ బుల్లితెరపై కూడా రాహుల్ ఎంతో పాపులర్. ‘తుమీ అస్బే బోలే’, ‘దేశెర్ మటి’ వంటి సీరియల్స్ ద్వారా ఆయన ప్రతి ఇంటికీ దగ్గరయ్యారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా కొన్ని Short Films రూపొందించే ప్రయత్నం చేశారు.

Advertisement

రాహుల్ 2010లో తన సహనటి ప్రియాంక సర్కార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక‌ కుమారుడు ఉన్నాడు. అయితే, మనస్పర్థల కారణంగా కొన్నాళ్లు విడివిడిగా ఉన్న ఈ జంట, ఇటీవల మళ్ళీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది.

ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. బెంగాలీ వెండితెర ఒక ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: సత్తుపల్లిలో దారుణం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా..!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×