వివాహం ఒకప్పుడు జీవితంలో ముఖ్యమైన భాగంగా పరిగణించేవారు. కానీ ఈరోజుల్లో యువ తరం వివాహాన్ని భిన్నంగా చూస్తున్నారు. కొత్త జెనెరేషన్ .. అంటే జెన్ జీ, జెన్ అల్ఫా వివాహ బంధం జీవితంలో తప్పనిసరి అని భావించడం లేదు. చాలా మంది యువకులు వివాహాన్ని వ్యక్తిగత ఆప్షన్‌గా మాత్రమే చూస్తున్నారు. ఆధునిక జీవన విధానాలు, మారిన ఆలోచనలు ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నేటి యువత కెరీర్, ఆర్థిక స్వతంత్రతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థిరమైన ఉద్యోగం, సురక్షిత ఆదాయం వచ్చిన తర్వాతే వివాహం గురించి ఆలోచించాలని భావిస్తున్నారు. పెళ్లి ఖర్చు, పెరిగిపోతున్న జీవన వ్యయాలు కూడా యువకులను ఆలోచింపజేస్తున్నాయి.
ప్రస్తుత తరం మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడుతోంది. జీవితంలో ప్రశాంతత, సంతోషాన్ని దెబ్బతీసే సంబంధాలకు యువత దూరంగా ఉండాలనుకుంటున్నారు. అనారోగ్యకరమైన బంధాలు, భావోద్వేగ ఒత్తిడిని భయపడుతున్నారు. స్వీయ సంరక్షణ, మానసిక స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఆర్థికంగా, విద్యాపరంగా బలంగా ఉన్నారు. సమానత్వం, గౌరవం, మానసిక సంతోషం లేని సంబంధాలను వారు అంగీకరించడం లేదు. ఈ సౌలభ్యాలను కోల్పోయే ప్రమాదముందని యువతులు కూడా వివాహాలను తిరస్కరిస్తున్నారు. స్వాతంత్ర్యం వల్ల మహిళల అంచనాలు పూర్తిగా మారిపోయాయి.
సోషల్ మీడియా ద్వారా వివిధ జీవన విధానాలు, అభిప్రాయాలు యువకులకు చేరువవుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధి, ఎటువంటి బాధ్యతులు లేకుండా స్వేచ్ఛగా జీవించడం.. వివాహం కంటే ముఖ్యమని యువత భావిస్తున్నారు. వ్యక్తిగత సంతోషానికి వివాహం అడ్డంకి అని అందుకే పెళ్లి తప్పనిసరి కాదని భావిస్తున్నారు.
చాలా మంది యువకులు దీర్ఘకాలిక బాధ్యతలు, మానసికంగా బాధలు, వైఫల్యాల గురించి భయపడుతున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో పడే గొడవలు, విడాకులు పిల్లలుగా ఉన్నప్పుడు చూసిన యువత ప్రభావితం అవుతోంది.
సర్వేల ప్రకారం.. మిలెనియల్స్, జెన్ Zలో వివాహం చేసుకునే వారి సంఖ్య 56 శాతానికి పడిపోయింది. జెన్ అల్ఫాలో ఇంకా తగ్గే అవకాశం ఉంది.
ఒంటరితనం ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది
సంతోషంగా జీవించడం, ఇతరుల కంటే స్వయం గురించి ఆలోచించడానికి, కెరీర్, హాబీలపై దృష్టి పెట్టడం అలవాటు యువతలో పెరిగింది. దీని కోసం ఒంటరిగా ఉండడం ముఖ్యమని వారి వాదన.
వివాహం చుట్టూ ఉన్న సామాజిక ఒత్తిడి తగ్గింది
సంబంధాలు మారుతున్నాయి, అంతరించిపోవడం లేదు.
వివాహం పూర్తిగా అంతరించిపోదు కానీ దాని అర్థం మారుతోంది. సమానత్వం, అవగాహన, పరస్పర గౌరవం ఆధారంగా సంబంధాలు ఏర్పడుతున్నాయి.
Also Read: రాత్రంతా ఆలోచిస్తూ ఉంటారా.. నిద్ర రావడం లేదా? దానికి కారణాలు ఇవే
స్వేచ్ఛ, వ్యక్తిగత సంతోషం, మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సంతోషంగా ఉండడం.. వివాహం లేకుండా కూడా సాధ్యమని యువత భావిస్తోంది.
జెన్ జీ, జెన్ అల్ఫా యువతరం వివాహాన్ని సామాజిక బాధ్యత కాకుండా వ్యక్తిగత ఎంపికగా చూస్తున్నారు. కెరీర్, మానసిక ఆరోగ్యం, స్వేచ్ఛ వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. భవిష్యత్ సంబంధాలు సమానత్వం, మానసిక అవగాహనపై ఆధారపడతాయని నిపుణులు అంటున్నారు.