E-Paper
Advertisement

Erra thotakura: ఎర్రతోటకూర ఎందుకు తినాలి? ఎవరు తింటే ఆరోగ్యం?

Erra thotakura: ఎర్రతోటకూర ఎందుకు తినాలి? ఎవరు తింటే ఆరోగ్యం?
Advertisement

ఆకు కూరల్లో ఎర్రతోటకూర ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఎర్రతోటకూరను తింటారు. ఎర్రటి రంగుతో, మృదువైన ఆకులతో ఉండే ఈ కూర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పలు పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఎర్రతోటకూర ఎందుకు తినాలి? ఇందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి? శరీరానికి ఏ విధంగా మేలు చేస్తుంది? అనే విషయాలు ఎంతో మందికి అవగాహన లేదు.

ఎర్రతోటకూరలో ఏముంటాయి?
ఎర్రతోటకూరలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K మంచి మోతాదులో ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత. ఈ ఆకుకూరలో ఉండే ఎర్రటి రంగు పిగ్మెంట్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది మంచి ఆహారం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు.

Advertisement

రక్తం పెరగడానికి ఎర్రతోటకూర
ఈ కూరలో ఉండే ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. తరచూ అలసట, బలహీనత, తల తిరగడం వంటి సమస్యలు ఐరన్ లోపం వల్ల రావచ్చు. ఎవరైతే ఇనుము లోపం వల్ల బాధపడుతున్నారో, రక్తహీనత సమస్య ఉందో అలాంటి వారు ఎర్రతోటకూర తినాలి. వారానికి కనీసం రెండు సార్లు ఈ కూరను ఆహారంలో చేరితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎర్రతోటకూరలో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు, పళ్ళు బలంగా ఉంటాయి. పిల్లలు పెరుగుతున్న సమయంలో ఈ పోషకాలు చాలా అవసరం. పెద్దవారిలో ఎముకలు బలహీనపడకుండా, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యానికి
విటమిన్ A పుష్కలంగా ఉండే ఈ కూర కంటి చూపును మెరుగుపరుస్తుంది. మొబైల్స్, కంప్యూటర్ వాడకం పెరగడంతో కళ్ల అలసట, డ్రై ఐ సమస్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి వారికి ఆహారంలో ఎర్రతోటకూర చేర్చడం ద్వారా కంటికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఎర్రతోటకూరలో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా పొట్ట సమస్యలు తగ్గిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు చక్కగా నియంత్రణలోకి వస్తాయి. ఫైబర్ ఉండే ఆహారాలు తినడం వల్ల పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Advertisement

డయాబెటిస్ ఉన్నవారు
ఈ కూరలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. అయితే ఒకసారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఎర్రతోటకూరలో పొటాషియం, మెగ్నీషియం ఉండటం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తం సజావుగా ప్రసరిస్తూ ఉండటానికి ఇవి అవసరం. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హృదయాన్ని రక్షించే గుణాలు కలిగి ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

చర్మం, జుట్టు కోసం
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల తల చర్మానికి పోషకాలు బాగా అందుతాయి. ఎర్రతోటకూరను పప్పు, కూర, ఫ్రై, దోసె పిండిలో కలుపుకుని వండుకోవచ్చు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×