E-Paper
Advertisement

Shardul Thakur: ఒక‌టి కాదు, రెండు కాదు.. 8 జ‌ట్లు మారిన ఏకైక ఆట‌గాడు

Shardul Thakur: ఒక‌టి కాదు, రెండు కాదు.. 8 జ‌ట్లు మారిన ఏకైక ఆట‌గాడు
Advertisement

Shardul Thakur: ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు జరగబోయే ఆటగాళ్ల ట్రేడింగ్ పై ఆసక్తికరమైన ఓ వార్త బయటకు వచ్చింది. టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాగూర్ ని లక్నో సూపర్ జెయింట్స్ {LSG} నుంచి ముంబై ఇండియన్స్ {MI} ట్రేడ్ చేసుకున్నట్లు టీమిండియా మాజీ ఆటగాడు, సీనియర్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధ్రువీకరించారు.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో శ్రీలంక ప్లేయ‌ర్ల‌కు VVIP సెక్యూరిటీ.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Advertisement

తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ అశ్విన్ ఈ విషయాన్ని వెల్లడించారు. తద్వారా శార్దూల్ ఠాకూర్ ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడుసార్లు ట్రేడ్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు.

2017 నుండి శార్దూల్ ఠాగూర్:

2017 ఐపీఎల్ సీజన్ లో శార్దూల్ ఠాకూర్ ని తొలిసారి రైజింగ్ పూనే సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ నుంచి ఇతడిని తీసుకుంది. ఇక 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కలకత్తా ట్రేడ్ చేసుకుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో మూడుసార్లు వేళానికి ముందే జట్టు మారిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు శార్దూల్ ఠాకూర్. నిజానికి ఇతడు ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అన్ సోల్డ్ గా నిలిచాడు. ఇతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అయితే సీజన్ ప్రారంభానికి ముందు ఇతడిని ఇంజ్యూరీ రీప్లేస్మెంట్ గా లక్నో సూపర్ జెంట్స్ తీసుకుంది. ఆ సీజన్ లో ఇతడికి రెండు కోట్ల కనీస ధర చెల్లించగా.. అనూహ్య ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్ లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు ఫిదా అయిన ముంబై ఇండియన్స్ ఇతడిని రెండు కోట్ల క్యాష్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. అయితే కేవలం ట్రేడ్ ప్రక్రియ ద్వారా మూడుసార్లు జట్లు మారడం మాత్రమే కాకుండా.. వేలం ద్వారా మరో ఆరుసార్లు జట్లు మారాడు శార్దూల్.

ఐపీఎల్ చరిత్రలో ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లు ఎందరో:

Advertisement

ఐపీఎల్ {IPL} చరిత్రలో ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లు ఎందరో ఉన్నప్పటికీ.. వారిలో కొందరు అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించి రికార్డులు సృష్టించారు. ఐపీఎల్ లో అత్యధిక ఫ్రాంచైజీలకు ప్రతినిథ్యం వహించిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఆరోన్ ఫించ్ పేరిట ఉంది. ఇతడు ఏకంగా తొమ్మిది ఫ్రాంచైజీలకు ప్రతినిత్యం వహించాడు.

Also Read: Ind vs Sa 1st Test: టాస్ ఓడిన టీమిండియా.. ముగ్గురు స్పెషల్ బౌలర్లతో గిల్ స్కెచ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

అలాగే భారత పేసర్ జయదేవ్ ఉనద్కట్ ఏకంగా 8 జట్లకు ఆడి రికార్డు క్రియేట్ చేశాడు. మనిష్ పాండే కూడా తన ఐపిఎల్ కెరీర్ ని ముంబై ఇండియన్స్ జట్టుతో ప్రారంభించి.. ఏడు జట్లకు ప్రతినిథ్యం వహించాడు. దినేష్ కార్తీక్ 6, వరుణ్ ఆరోన్ 6, మురుగన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×