E-Paper
Advertisement

Jubilee Hills bypoll: జూబ్లీలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. ‘కారు’లో కలవరం, గాంధీ భవన్‌లో సంబరాలు

Jubilee Hills bypoll: జూబ్లీలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. ‘కారు’లో కలవరం, గాంధీ భవన్‌లో సంబరాలు
Advertisement

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ వార్ వన్ సైడ్ అన్నట్టుగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచే తన ఆధిపత్యాన్ని చెలాయించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఏడో రౌండ్ ముగిసేసరికి 19,619 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. జూబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. మొదటి రౌండ్‌లోనే ఆధిక్యతను కైవసం చేసుకున్న కాంగ్రెస్, ఆ తర్వాత ప్రతి రౌండ్‌లోనూ మెజారిటీని పెంచుకుంటూ పోయింది. కేవలం ఒక్క మూడో రౌండ్‌లో మాత్రమే బీఆర్‌ఎస్ పార్టీ స్పల్ప మెజారిటీ సాధించగలిగింది. మిగిలిన అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ అనూహ్య ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీలో.. ముఖ్యంగా అభ్యర్థి నవీన్ యాదవ్ వర్గంలో ఉత్సాహం పెల్లుబికింది.

ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరు ఇప్పటికీ ‘వార్ వన్ సైడ్’ అన్నట్లుగా సాగుతోంది. అధికార పార్టీ బీఆర్‌ఎస్, జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా, ఏడో రౌండ్ లోనూ కాంగ్రెస్ తన హవాను కొనసాగించడంతో.. నవీన్ యాదవ్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

జూబ్లీహిల్స్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో.. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో నిండిపోయారు. బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచిపెట్టుకుంటూ కార్యకర్తలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. నవీన్ యాదవ్ గెలుపు దిశగా పయనిస్తుండడంతో.. ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ అన్ని రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ విజయానికి చేరువయ్యారు. ఇప్పటికే గెలుపు లాంఛనప్రాయం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నవీన్ యాదవ్ ఇంటివద్ద, పార్టీ కార్యాలయం వద్ద, సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దకు భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. విజయ సంబురాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నవీన్ యాదవ్ ఇంటివద్ద కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ, డప్పులు కొడుతూ సందడి చేస్తున్నారు. కాంగ్రెస్ శిబిరంలో పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

ALSO READ: Jubilee Hills bypoll: మేం గెలవమని ముందే తెలుసు.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు, కౌంటర్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన దీపక్ రెడ్డి

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×