E-Paper
Advertisement

Expensive Tea: కిలో చాయ్ పొడి రూ.9 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాయ్.. రుచి ఎలాగుంటుదంటే..

Expensive Tea: కిలో చాయ్ పొడి రూ.9 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాయ్.. రుచి ఎలాగుంటుదంటే..
Advertisement

Expensive Tea| భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పానీయం టీ. దాదాపు 65 శాతం మంది భారతీయులు ప్రతిరోజూ టీ తాగుతారు. దేశంలో వివిధ రకాల టీ వేర్వేరు ధరల్లో దొరుకుతోంది. చాలా రకాల టీ కిలో ధర రూ.100 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలో ఖరీదైన టీ ఉంది, దాని ధర లగ్జరీ కారు, లేదా పెద్ద బంగ్లా అంత ఖరీదు చేస్తుంది. ఈ టీ ధర వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ టీ కిలో రూ.9 కోట్లు ఉంటుంది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఏది?

ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ “డా హాంగ్ పావ్”. దీనిని “బిగ్ రెడ్ రోబ్” టీ అని కూడా అంటారు. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఈ స్పెషల్ టీని పండిస్తారు. ఈ ప్రాంతంలో రాళ్లు, కొండలు ఎక్కువ. దీని ధర కిలోకు రూ.9 కోట్ల వరకు చేరిందని సమాచారం. 2002లో 20 గ్రాముల టీ రూ.26 లక్షలకు అమ్ముడైంది. ఈ వార్త అప్పట్లో ప్రపంచ టీ ప్రేమికులందరినీ షాక్‌కు గురి చేసింది.

ఈ టీ ఎక్కడ పండుతుంది?

Advertisement

డా హాంగ్ పావ్ టీ.. ఫుజియాన్‌లోని ‘వుయి’ పర్వతాల్లో పండుతుంది. ఈ పర్వతాలు రాళ్లతో నిండి ఉంటాయి. అక్కడి మట్టిలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. టీ మొక్కలు రాళ్ల మధ్య పగుల్లో పెరుగుతాయి. చుట్టుపక్కల ఖనిజాలను గ్రహించడం వల్ల టీకి ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే దీనిని “రాక్ టీ” అని కూడా పిలుస్తారు.

ఈ టీ ఎందుకు అరుదు?

ఈ టీ అరుదైనది కాబట్టి ధర చాలా ఎక్కువ. అసలైన డా హాంగ్ పావ్ ప్రాచీన “మదర్ బుషెస్” నుంచి వస్తుంది. ఈ టీ మొక్కల వయసు వందల సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు కేవలం కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి సంవత్సరం చాలా తక్కువ మొత్తంలోనే కోత పండిస్తారు. పైగా 2006లో చైనా ప్రభుత్వం ఈ టీ మొక్కలు నుంచి కోత చేయకూడదని నిషేధం విధించింది. అందువల్ల టీ అసలు దొరకడం ఇప్పుడు దాదాపు అసాధ్యం.

పేరు వెనుక చరిత్ర

Advertisement

చైనాలో పురాతన కథల ప్రకారం.. మింగ్ రాజవంశ కాలంలో ఒక రాణి తీవ్రంగా అనారోగ్యంతో ఉండేది. డాక్టర్లు ఈ ప్రత్యేక టీ ఇచ్చి చికిత్స చేశారు. రాణి త్వరగా కోలుకుంది. రాజు ఆనందంతో ఈ టీ మొక్కలపై చైనా సంప్రదాయ ఎర్ర డ్రెస్ (పై దుస్తులు) వేయించాడు. అప్పటి నుంచి దీనిని “డా హాంగ్ పావ్” అంటారు. అంటే “పెద్ద ఎర్ర డ్రెస్” అని అర్థం.

ఈ టీ రుచి ఎలా ఉంటుంది?

ఈ టీ రుచి గొప్పగా, మట్టి సువాసన కలిగి, కొంచెం తీయగా ఉంటుంది. తాగిన తర్వాత నోట్లో చాలా సేపు రుచి అలాగే ఉంటుంది. సువాసన కూడా గొంతులో నిలిచిపోతుంది. ఈ టీ రుచి మెల్లగా, ఆలస్యంగా ఎక్కువ సేపు ఉంటుంది. ఇందులో రాళ్లలోని ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎందుకు ఇంత ఖరీదు?

ఈ టీ చాలా అరుదు, ప్రాచీన మొక్కలు, పరిమిత ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అన్నింటి కంటే ముఖ్యంగా చైనా జాతీయ ఖజానాగా పరిగణించబడింది. ఈ కారణాల వల్లే ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్క గ్రాము ధర కూడా సుమారు రూ.1.5 లక్షల వరకు ఉంటుంది.

Also Read: ఇంట్లో తులసి మొక్క పక్కనే ఈ మొక్కలు పెంచకూడదు.. ఎంత హాని జరుగుతుందంటే

మార్కెట్లో అసలైన టీ లభించడం కష్టం

ఇప్పుడు మార్కెట్లో డా హాంగ్ పావ్ పేరుతో లభించే టీ అసలైనది కాదు. ఆ మొక్కల నుంచి తీసిన కటింగ్స్‌తో వేరే చోట పండించబడుతున్న టీ. ఇది కూడా ఖరీదైనదే, కానీ అసలు టీ ధరతో పోల్చలేం.

డా హాంగ్ పావ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన టీ. దీని చరిత్ర, రుచి, సులభంగా లభించడంతో ఈ టీని స్పెషల్‌గా చేస్తాయి. అసలైన డా హాంగ్ పావ్ టీ రుచి చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి.

Related News

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

Big Stories

Advertisement
×