జీవితంలో అందరూ ఏదో ఒక సమయంలో పెన్సిల్ ఉపయోగించే ఉంటారు. ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్‌లో రాయడం నేర్చుకునేటప్పుడు పెన్ బదులు పిల్లలకు పెన్సిల్‌తో ప్రారంభిస్తారు. సాధారణంగా ఒక పెన్సిల్ ధర దాని బ్రాండ్ బట్టి రూ.3 నుంచి రూ.10 ఖరీదు చేస్తుంది. కొన్ని లగ్జరీ పెన్సిల్స్ ధర రూ.100 నుంచి రూ.150 కూడా ఉంది. ఒక్క పెన్సిల్ రూ.150 పెట్టి కొనడమే చాలా కష్టం. ఎందుకంటే పెన్సిల్ త్వరగా అరిగిపోయే వస్తువు.
అలాంటప్పుడు ఎవరైనా తక్కువ ధర పెన్సిల్ కొనడానికే ఇష్టపడతారు. ఇలాంటి సందర్భంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్సిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 12800 డాలర్లు అంటే దాదాపు రూ.12,20,500. ఆ పెన్సిల్‌లో ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
ఈ ప్రత్యేక పెన్సిల్‌ను ప్రముఖ సంస్థ ఫాబర్ కాస్టెల్ తయారు చేసింది. లగ్జరీ స్టేషనరీ కోరుకునే వారు, అరుదైన వస్తువులు కలెక్షన్ చేసే అలవాటు ఉన్నవారు ఈ పెన్సిల్‌ను ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు.
ఈ పెన్సిల్ గ్రాఫ్ వాన్ ఫాబర్-కాస్టెల్ కలెక్షన్‌కు చెందినది. కంపెనీ దీన్ని లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. దీని అధికారిక పేరు ‘పర్ఫెక్ట్ పెన్సిల్’. ప్రపంచవ్యాప్తంగా ఈ పెన్సిల్ ధర సుమారు 12,800 అమెరికన్ డాలర్లు ఉంటుంది. కంపెనీ దీని డిజైన్, పనితనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఈ పెన్సిల్ తయారీలో 240 సంవత్సరాల పాత ఆలివ్ చెక్కను ఉపయోగించారు. ఈ కలప పెన్సిల్‌లో ప్రధాన ఆకర్షణ. కంపెనీ దీని డిజైన్‌లో 18 క్యారెట్ల వైట్ గోల్డ్ కూడా ఉపయోగించింది. ఈ కలయిక పెన్సిల్‌ను మరింత లగ్జరీగా మార్చింది. ప్రీమియం పదార్థాలు దీని విలువను అందాన్ని పెంచాయి. చేతితో చేసిన ఫినిషింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ పెన్సిల్‌లో సాధారణంగా కనిపించని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కాప్ లోపలే శార్పనర్ ఉంటుంది. అలాగే ప్రత్యేక ఎరేజర్ కూడా అందులోనే అమర్చారు.
వేరుగా శార్పనర్ లేదా రబ్బరు అవసరం లేకుండా కంపెనీ దీన్ని రూపొందించింది. దీని అందం, వినియోగం రెండూ సమతుల్యం చేస్తూ దీన్ని తయారు చేశారు.
ఈ పెన్సిల్ మొత్తం 99 భాగాలతో తయారైంది. ప్రతి భాగాన్ని నిపుణులు అత్యంత జాగ్రత్తగా అమర్చారు. ఇందులో ప్రత్యేక ఎక్స్‌టెండర్ కూడా ఉంటుంది. ఈ భాగాన్ని వైట్ గోల్డ్ పల్లాడియంతో తయారు చేశారు. ఇది రాయడానికి సౌకర్యాన్ని పెంచుతుంది.
Also Read: అదృష్టవంతులకు మాత్రమే కలలో ఈ వస్తువులు కనిపిస్తాయి.. మీకూ కనిపిస్తున్నాయా?
ఈ పెన్సిల్ కాప్‌పై మూడు అందమైన వజ్రాలను అమర్చారు. ఈ వజ్రాలు పెన్సిల్‌కు మరింత లగ్జరీ లుక్ ఇస్తాయి. సాధారణ పెన్సిల్స్ ఇలాంటి విలువైన రత్నాలు ఉండవు. అందువల్ల ఈ పెన్సిల్ కలెక్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది.
లిమిటెడ్ ఎడిషన్ వస్తువులను కలెక్టర్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ పెన్సిల్ లగ్జరీ, విలాసం, ప్రతిష్ట, క్రియేటివిటీకి ప్రతీకగా నిలుస్తుంది. చాలా మంది దీన్ని ఉపయోగించకుండా ప్రదర్శన కోసం ఉంచుతారు. ఇది ప్రైవేట్ సెలక్షన్ లగ్జరీ జీవనశైలిని సూచిక.